TTD IS FRONTRUNNER OF HINDU SANTANA DHARMA  – PONTIFFS _ టీటీడీ ధార్మిక కార్యక్రమాల విహంగ వీక్షణం

TIRUMALA, 03 FEBRUARY 2024: On the first day of the three-day religious conclave organised by TTD at Astana Mandapam in Tirumala, in the morning session the Pontiffs unanimously advocated that TTD alone can lead the campaign of Hindu Sanatana Dharma and sustain its sanctity for future generations.

Sri Vidyasreesha Thirtha Swamy 

TTD leads the country in spreading and protecting Sanatana Hindu dharma 

He complimented Sri Bhumana Karunakar Reddy whose name heralds Swami and for his dedication towards spearheading the Hindu Dharma campaign now and earlier as well in his previous tenure.

Similarly, he also lauded the efforts of Sri AV Dharma Reddy who championed the Parayanams like Akhanda Sundarakanda, Gita Parayanam etc. to rejuvenate the Bhakti cult among the youth

Sri Shushrutananda  Mataji

While complimenting the commitment and dedication of both the TTD Chairman Sri Bhumana Karunakar Reddy and EO Sri AV Dharma Reddy to take ahead more and more Dharmic programs for propagation of Sanatana Hindu Dharma, she wished the programs should reach every nook and corner.

Sri  Swatmanandendra Saraswati  Swami 

TTD Dharmic programs are invigorating Dharmic fervour among youth and driving them towards righteousness.

Through social media, TTD is also successfully combating the false and baseless, half-truths slugged by vested elements with SVBC spiritual programs. Go Samrakshana program is also laudable.

It is praiseworthy that Honourable AP CM Sri YS Jaganmohan Reddy has also built a Goshala at his official residence and Undertook Gosamrakshana activities, he added.

TTD should adopt Artificial intelligence software for Dharmic programs as well.

Sri Shiva Darshanam Mataji

Dharmic programs are essential to bring out Sanatana Hindu sentiments embedded in everyone in spite of hostilities and ups and downs in society.

Syllabus in schools and colleges also be improvised to include the genesis of Hindu Dharma. Earlier TTD used to conduct Subhapradam and it should be resumed for inculcating religious ethos among students 

Sri Devanadha Ramanuja Jiyar Swamiji, Shamshabad

Meditation Halls should be established in Tirumala Divyakshetra.  He said that small programs should be taken to society through SVBC YouTube channel.  Actions should be taken to increase philanthropy among students, youth and women.  Students should be made participants in Srivari Seva program.

Sri Swaswarupanandagiri – Sri Lalita Peetham..Srinivasa Mangapuram

Tirumala-style Govinda Nama Smarana should be started from Tirupati, Srinivasa Mangapuram, Tiruchanoor, Renigunta and Chandragiri areas.

Sri Ramachandra Ramanuja Jiyar

Many good programs are being done by TTD. Dravidian Veda should also be encouraged.

Sri Viswayogi Viswamji, Guntur

India will become powerful in the world soon and  TTD should take Sanatana Dharma to the world from Tirumala.

 
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

టీటీడీ ధార్మిక కార్యక్రమాల విహంగ వీక్షణం

•⁠ ⁠ధార్మిక సదస్సులో స్వామీజీలకు ఆడియో వీడియో ప్రజెంటేషన్

ఫిబ్రవరి 03, తిరుమల, 2024: తిరుమల ఆస్థాన మండపంలో శనివారం నిర్వహించిన శ్రీ వేంకటేశ్వర ధార్మిక సదస్సులో టీటీడీ చేపడుతున్న ధార్మిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు సంబంధించి 40 నిమిషాలు నిడివి గల ఆడియో వీడియో ప్రజెంటేషన్ ను స్వామీజీలకు చూపడం జరిగింది. ఇందులో ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి.

హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ అనేక ధార్మిక ప్రాజెక్టులను నిర్వహిస్తోంది. మనగుడి కార్యక్రమంలో భాగంగా శ్రావణ పౌర్ణమి, గీతా జయంతి, వైకుంఠ ఏకాదశి, ఉగాది తదితర పర్వదినాలు నిర్వహించి వాటి ప్రాశస్త్యాన్ని సమాజానికి తెలియజేస్తోంది. హరిజన, గిరిజన, మత్స్యకార గ్రామాల్లో భజన మందిరాల నిర్మాణానికి, దేవాలయాల జీర్ణోద్ధరణకు శ్రీవాణి ట్రస్టు ద్వారా ఆర్థిక సహాయం అందిస్తోంది. ఇప్పటివరకు 689 ఆలయాల నిర్మాణం పూర్తయింది. ఆయా ప్రాంతాల్లోని హరిజన, గిరిజన, మత్స్యకార వర్గాలకు చెందిన 1501 మందికి అర్చక శిక్షణ ఇవ్వడం జరిగింది. ఈ ఆలయాల్లో నిత్య ధూపదీప నైవేద్యాల కోసం నెలకు 5000 రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తోంది. వెనుకబడిన వర్గాల వారికి శ్రీవారి బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి సందర్భంగా 29,298 మందికి శ్రీవారి దర్శనం ఉచితంగా కల్పించడం జరిగింది.

గుడికో గోమాత కార్యక్రమంలో భాగంగా 194 ఆలయాలకు ఆవు, దూడను అందించడం జరిగింది. కార్తీక మాసంలో పలు నగరాల్లో కార్తీక దీపోత్సవాలు నిర్వహిస్తోంది. దాససాహిత్య ప్రాజెక్టు ద్వారా 680 దాస సంకీర్తనలను రికార్డు చేయించి జనబాహుళ్యంలోకి తీసుకెళ్లారు. 80 పుస్తకాలను ఆవిష్కరించారు. క్రమం తప్పకుండా మెట్లోత్సవాలు, ఉత్తరప్రదేశ్ లోని నైమిశారణ్యంలో భాగవత సప్తాహం, విశ్వశాంతి యాగాలు నిర్వహిస్తున్నారు. ఆళ్వార్ దివ్యప్రబంధ ప్రాజెక్టు 108 దివ్యదేశాల్లో ధనుర్మాసంలో వైష్ణవ స్వామీజీల ఆరాధనోత్సవాలు నిర్వహిస్తోంది. దేశవ్యాప్తంగా 216 కేంద్రాల్లో తిరుప్పావై పారాయణం చేశారు. పురాణ ఇతిహాసాలపై ప్రత్యేక సదస్సులు నిర్వహిస్తున్నారు. నాళాయిర దివ్య ప్రబంధ పారాయణ ప్రాజెక్టు ద్వారా సుమారు 225 మంది పారాయణదారులతో నిత్యం వైష్ణవ ఆలయాల్లో దివ్య ప్రబంధ పారాయణం జరుగుతోంది.

శ్రీనివాస కళ్యాణం ప్రాజెక్టు ద్వారా ఇప్పటివరకు 962 శ్రీనివాస కళ్యాణాలు నిర్వహించారు. శ్రీ వేంకటేశ్వర వైభవోత్సవ ప్రాజెక్టు ద్వారా పలు ప్రాంతాల్లో తిరుమలలో శ్రీవారికి నిర్వహించే సేవలను భక్తులందరూ దర్శించుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. శ్రీ వేంకటేశ్వర ఉన్నత వేదాధ్యయన సంస్థ ద్వారా 1308 మంది వేద పండితులకు, 60 మంది వృద్ధులైన వేద పండితులకు, 119 మంది వృద్ధ ఆగమపండితులకు, 15 మంది అహితాగ్నులకు, 110 మంది మృతులైన వేదపండితుల భార్యలకు జీవనభృతి కల్పిస్తున్నారు. అన్నమాచార్య ప్రాజెక్టు ద్వారా ఇప్పటివరకు 4,530 సంకీర్తనలు రికార్డ్ చేశారు. మొత్తం సంకీర్తనలను 29 సంపుటాలుగా ముద్రించారు. ఈ ప్రాజెక్టులో ప్రస్తుతం ఉన్న 340 మంది కళాకారులు సంగీత, హరికథ కార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్నారు.

మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ ప్రాజెక్టు ద్వారా 114 కృతులు రికార్డు చేశారు. 29 పుస్తకాలను ఆవిష్కరించారు. పురాణ ఇతిహాస ప్రాజెక్టు ద్వారా ఇప్పటివరకు కూర్మ, బ్రహ్మ, విష్ణు, మత్స్య, అగ్ని, మార్కండేయ, వామన, లింగ పురాణాలను ముద్రించారు. గరుడ పురాణం ముద్రణ దశలో ఉంది. ఎస్వీ రికార్డింగ్ ప్రాజెక్టు ద్వారా అన్నమాచార్య సంకీర్తనలు, కన్నడ హరిదాసుల సంకీర్తనలు, ఆళ్వారుల పాశురాలు తదితర రికార్డింగ్ పనులు జరుగుతున్నాయి. వేద ప్రచారంలో భాగంగా తిరుమల ధర్మగిరి వేద పాఠశాలలో ప్రస్తుతం 437 మంది విద్యార్థులు వేద విద్యను అభ్యసిస్తున్నారు. ఇక్కడ విద్యార్థులకు విద్యాభ్యాసం పూర్తయిన వెంటనే నగదు ప్రోత్సాహక బహుమతులు అందిస్తున్నారు. తిరుమలతో పాటు కీసరగుట్ట, విజయనగరం, ఐ భీమవరం, కోటప్పకొండ, నల్గొండలో వేద పాఠశాలలు ఉన్నాయి. ఎస్వీ ఆయుర్వేద కళాశాల భారతీయ సనాతన వైద్య విధానమైన ఆయుర్వేదాన్ని ప్రోత్సహించి ప్రజలకు నాణ్యమైన వైద్యం అందిస్తోంది. భారతీయ కళలను ప్రోత్సహించేందుకు, ఎస్వీ సంగీత, నృత్య కళాశాల, శిల్పకళాశాల నడుస్తున్నాయి. తాళపత్ర ప్రాజెక్టు ఆధ్వర్యంలో లక్షల సంఖ్యలో ఉన్న తాళపత్రాలను డిజిటలైజ్ చేసి భావితరాలకు అందించేందుకు కృషి చేస్తోంది.

భక్తులకు స్వచ్ఛందంగా సేవలు అందించేందుకు 2000 సంవత్సరంలో ప్రారంభమైన శ్రీవారి సేవలో ఇప్పటివరకు దాదాపు 15 లక్షల మంది భక్తులు సేవకులుగా సేవలందించారు. శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయంలో 400 మందికిపైగా విద్యార్థులు వేదాలకు సంబంధించి ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రస్తుతం తెలుగు, తమిళ, కన్నడ హిందీ భాషల్లో తిరుమల శ్రీవారి ఉత్సవాలతో పాటు అనేక ధార్మిక కార్యక్రమాలను ప్రసారం చేస్తోంది. ముద్రణ, ప్రచురణల విభాగంలో సుమారు 86 ఆధ్యాత్మిక గ్రంథాలను ప్రచురించారు. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ నిత్యాన్నదాన ట్రస్ట్ ద్వారా ప్రతిరోజు సుమారుగా 60 వేల నుంచి లక్ష మంది వరకు భక్తులు అన్నప్రసాదాలను స్వీకరిస్తున్నారు. ఎస్వీ గోశాలలో 2,300 ఆవులు, నాలుగు గుర్రాలు, ఏడు ఏనుగులు ఉన్నాయి. వీటి సంరక్షణతోపాటు దేశవాళి గోవుల సంరక్షణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. వీటితోపాటు బర్డ్ ఆసుపత్రి, స్విమ్స్ ఆస్పత్రి, శ్రీ పద్మావతి చిన్నపిల్లల గుండె ఆసుపత్రి పేదరోగులకు నాణ్యమైన వైద్య సేవలను అందించడం జరుగుతోంది.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.