TTD JEO (HEALTH & EDUCATION) INSPECTS TTD CANTEENS _ టిటిడి క్యాంటీన్లను తనిఖీ చేసిన జెఈవో(విద్య మ‌రియు ఆరోగ్యం) శ్రీ‌మ‌తి సదా భార్గ‌వి

Tirupati, 15 Oct 20: TTD JEO ( health and education) Smt Sada Bhargavi on Thursday inspected the TTD canteens in Tirupati and reviewed  implementation of the Covid-19 guidelines.

She visited the  canteens at TTD administrative building ,Sri Padmavati rest house , and Tiruchanoor Anna Prasadam Bhavan where she inspected the quality of Anna Prasadam, dining hall, kitchen,store room,drinking water system,clearance of wet and dry garbage etc  and gave specific instructions.

The JEO also directed officials to provide qualitative and clean food items to employees and devotees in general .

She said TTD was also mulling over cashless system of issuing tokens  at canteens.

SE(electrical) Sri Venkateshwarlu,DyEO (canteens) Sri Lakshman Nayak,DE Sri Chandrasekhar,unit officer Sri Amarnath Reddy and  other engineering officials were present in the inspection tour.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

టిటిడి క్యాంటీన్లను తనిఖీ చేసిన జెఈవో(విద్య మ‌రియు ఆరోగ్యం) శ్రీ‌మ‌తి సదా భార్గ‌వి

తిరుపతి, 2020 అక్టోబర్ 15: తిరుపతిలోని టిటిడి క్యాంటీన్లను జెఈవో(విద్య మ‌రియు ఆరోగ్యం) శ్రీ‌మ‌తి సదా భార్గ‌వి గురువారం తనిఖీ చేశారు.

టిటిడి పరిపాలనా భవనంలోని ఉద్యోగుల క్యాంటీన్, శ్రీ పద్మావతి విశ్రాంతి గృహంలోని క్యాంటీన్, తిరుచానూరులోని అన్నప్రసాద భవనాన్ని తనిఖీ చేశారు. కోవిడ్‌-19 నేపథ్యంలో తీసుకుంటున్న జాగ్రత్తలను పరిశీలించారు. ఆయా క్యాంటీన్లలో ఆహార ప‌దార్థాల నాణ్య‌త‌, డైనింగ్ హాల్, వంటశాల, స్టోర్ రూమ్, తాగునీటి వసతి, తడి చెత్త, పొడి చెత్త సేకరణ, పారిశుద్ధ్య నిర్వ‌హ‌ణ త‌దిత‌రాల‌ను ప‌రిశీలించి అధికారుల‌కు ప‌లు సూచ‌న‌లు చేశారు. ఉద్యోగుల క్యాంటీన్‌లో మెను ప‌రిశీలించి మ‌రింత‌ రుచిక‌ర‌మైన‌, శుచిక‌ర‌మైన ఆహారాన్ని ఉద్యోగుల‌కు అందించాల‌ని సూచించారు. త్వ‌ర‌లో న‌గ‌దు ర‌హిత లావాదేవీల ద్వారా టోకెన్లు జారీ చేసే విధానాన్ని ప‌రిశీలిస్తున్న‌ట్టు చెప్పారు.

జెఈఓ వెంట ఎస్ఇ(ఎల‌క్ట్రిక‌ల్స్‌) శ్రీ వేంక‌టేశ్వ‌ర్లు, డెప్యూటీ ఈఓ(క్యాంటీన్‌) శ్రీ లక్ష్మ‌ణ్ నాయ‌క్‌, డిఇ శ్రీ చంద్ర‌శేఖ‌ర్‌, యూనిట్ ఆఫీస‌ర్ శ్రీ అమ‌రనాథ‌రెడ్డి, ఇత‌ర ఇంజినీరింగ్ అధికారులు ఉన్నారు.
           
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.