TTD JEO OFFERS PATTU VASTRAMS _ శ్రీ లక్ష్మీనరసింహస్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించిన జెఈవో
INVITES AHOBILA MUTT SEER FIR ANNAMAIAH VARDHANTI UTSAVAMS
Tirupati, 10 Mar. 22: Upon the instructions of TTD EO Dr KS Jawahar Reddy and the Additional EO Sri AV Dharma Reddy, TTD JEO Sri Veerabrahmam presented silk vastrams to Sri Lakshmi Narasimha Swamy temple in Ahobilam on Thursday.
As Sri Annamacharya Vardhanti is scheduled from March 28 to April 1, he also invited HH Ahobilam seer Sriman Srivan Shadagopa Yatindra Mahadesikan Swamiji to grace the occasion to take part in the program to be held at Tirumala on March 29.
Annamacharya Project Director Dr A Vibhishana Sharma was also present.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
శ్రీ లక్ష్మీనరసింహస్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించిన జెఈవో
అన్నమయ్య వర్ధంతి ఉత్సవాలకు అహోబిలం పీఠాధిపతికి ఆహ్వానం
తిరుపతి, 2022 మార్చి 10: ప్రముఖ పుణ్యక్షేత్రమైన అహోబిలంలోని శ్రీ శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి బ్రహ్మోత్సవాల సందర్భంగా టిటిడి ఈవో డాక్టర్ కెఎస్.జవహర్‌రెడ్డి, అదనపు ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి ఆదేశాల మేరకు జెఈవో శ్రీ వీరబ్రహ్మం టిటిడి తరపున గురువారం స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు.
అదేవిధంగా, మార్చి 28 నుండి ఏప్రిల్ 1వ తేదీ వరకు టిటిడి ఆధ్వర్యంలో శ్రీ తాళ్లపాక అన్నమయ్య వర్ధంతి ఉత్సవాలు జరుగనున్న నేపథ్యంలో అహోబిలం పీఠాధిపతి శ్రీమాన్ శ్రీవణ్ శఠగోప రంగనాథ యతీంద్ర మహాదేశికన్ స్వామివారిని జెఈవో శ్రీ వీరబ్రహ్మం, అన్నమాచార్య ప్రాజెక్టు సంచాలకులు డా. ఆకెళ్ల విభీషణశర్మ ఆహ్వానించారు. మార్చి 29వ తేదీన తిరుమలలో జరుగనున్న వర్ధంతి ఉత్సవాలకు అహోబిలం పీఠాధిపతి విచ్చేయనున్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.