TTD JEO(E&H) INSPECTS CHILDRENS HOSPITAL WORKS- REVIEWS PANCHAGAVYA PRODUCTS _ శ్రీ పద్మావతి చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ పనుల పరిశీలన

REVIEWS PANCHAGAVYA PRODUCTS

 

Tirupati,20  December 2022: TTD JEO(E&H) Smt Sada Bhargavi on Tuesday inspected the ongoing construction works at Sri Padmavati Children’s Super Specialty hospital in Zoo park road near Alipiri.

 

Speaking on the occasion the TTD JEO said that the engineering department has been directed to complete the ground-level works by the December end by deploying additional workers to speed up works as recent rains had delayed the work process.

 

CE Sri Nageswara Rao, SE(Electrical) Sri Venkateswarlu, EE Sri Krishna Reddy accompanied the JEO during inspection.

 

CONDUCT A WORKSHOP ON PANCHA GAVYA PRODUCTS- JEO

 

Earlier the JEO Smt Sada Bhargavi directed officials to conduct a workshop to highlight the significance of Panchagavya products.

 

Addressing a review meeting with officials on the Panchagavya products at the TTD Administrative Building the JEO said adequate publicity be given for these products and promos be conceived on SVBC to attract children, youth and women on variety of products

 

She said during festivals etc. the exhibition cum sale of Panchagavya products and agarbattis also be organised along with that of book stalls and also promote UPI payment system for convenience of devotees.

 

DyEO (General) Sri Gunabhushan Reddy, PRO Dr T Ravi, HDPP Special Officer Smt Vijayalakshmi, Sales Wing OSD Sri Rama Raju were present.

 

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

 

శ్రీ పద్మావతి చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ పనుల పరిశీలన

తిరుపతి, 2022 డిసెంబరు 20: తిరుపతిలోని అలిపిరి జూపార్క్ రోడ్డులో నిర్మాణంలో ఉన్న శ్రీ పద్మావతి చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పనులను టిటిడి జెఈఓ శ్రీమతి సదా భార్గవి మంగళవారం పరిశీలించారు.

ఈ సందర్భంగా జెఈఓ మాట్లాడుతూ ఇటీవల వర్షాలు కురవడంతో పనులు ఆలస్యం అయ్యాయని, ఇందుకోసం అదనంగా కార్మికులను ఏర్పాటు చేసి త్వరితగతిన పనులు పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. డిసెంబరు లోపు గ్రౌండ్ లెవల్ వరకు పనులు పూర్తి చేయాలన్నారు. ఆసుపత్రి పనులపై ప్రతి వారం సమీక్ష నిర్వహించాలని ఇంజినీరింగ్ అధికారులకు సూచించారు.

జెఈఓ వెంట చీఫ్ ఇంజినీర్ శ్రీ నాగేశ్వరరావు, ఎస్ఇ(ఎలక్ట్రికల్స్) శ్రీ వెంకటేశ్వర్లు, ఈఈ శ్రీ కృష్ణారెడ్డి తదితరులు ఉన్నారు.

పంచగవ్య ఉత్పత్తులపై వర్క్ షాప్ నిర్వహించాలి : జెఈఓ

అంతకుముందు తిరుపతిలోని పరిపాలన భవనంలో గల కార్యాలయంలో జెఈఓ శ్రీమతి సదా భార్గవి పంచగవ్య ఉత్పత్తులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. టిటిడి తయారు చేస్తున్న పంచగవ్య ఉత్పత్తుల విశిష్టతను తెలియజేసేందుకు వీలుగా ప్రత్యేకంగా వర్క్ షాప్ నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.

ఈ ఉత్పత్తులకు విస్తృతంగా ప్రచారం కల్పించాలని ఎస్వీబీసీలో ప్రోమోలు రూపొందించి ప్రసారం చేయాలని కోరారు. పిల్లలకు, యువతకు, మహిళలకు, వయసు పైబడిన వారికి కేటగిరీల వారీగా ఈ ఉత్పత్తులను విభజించాలని సూచించారు. ఉత్సవాల సమయంలో టిటిడి నిర్వహిస్తున్న పుస్తక ప్రదర్శనతో పాటు పంచగవ్య ఉత్పత్తులు, అగరబత్తీలను కలిపి ప్రదర్శన, విక్రయాలు చేపట్టాలని ఆదేశించారు. అందుబాటులో ఉన్న యూపీఐ పేమెంట్లను చక్కగా ఉపయోగించుకోవాలని కోరారు.

ఈ సమీక్షలో డెప్యూటీ ఈఓ జనరల్ శ్రీ గుణభూషణ్ రెడ్డి, పిఆర్ఓ డా. టి.రవి, హెచ్ డిపిపి ప్రత్యేకాధికారి శ్రీమతి విజయలక్ష్మి, సేల్స్ వింగ్ ప్రత్యేకాధికారి శ్రీ రామరాజు ఇతరులు పాల్గొన్నారు.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.