TTD KALYANA MANDAPAMS TO GO ONLINE FROM RADHASAPTHAMI_ జనవరి 24న రథసప్తమి నుంచి టిటిడి కల్యాణమండపాల ఆన్‌లైన్‌ బుకింగ్‌ ప్రారంభం : జెఈవో శ్రీ పోల భాస్కర్‌

Tirupati, 18 January 2018: The Kalyana Mandapams run by TTD will be booked through online from January 24 onwards.

In a review meeting held by Tirupati JEO Sri P Bhaskar on Thursday evening in TTD administrative building with Engineering and IT wing officials, he said, from the auspicious day of Radhasapthami, the booking of TTD Kalyana Mandapams will go on-line in a phased manner starting from Chittoor district.

He also instructed the engineering officials to see that all Kalyana Mandapams are well maintained and directed the IT wing to ensure that the online apllication is user friendly.

The offline booking of TTD kalyana mandapams closes by January 20. The devotees who wish to book TTD kalyana mandapams can also approach the nearby post-offices and fill the application through online or else take the assistance of the manager of kalyana mandapam to fill the application in online.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

జనవరి 24న రథసప్తమి నుంచి టిటిడి కల్యాణమండపాల ఆన్‌లైన్‌ బుకింగ్‌ ప్రారంభం : జెఈవో శ్రీ పోల భాస్కర్‌

తిరుపతి, 2018 జనవరి 18: పవిత్రమైన రథసప్తమి పర్వదినం నాడైన జనవరి 24వ తేదీ నుంచి కల్యాణమండపాల ఆన్‌లైన్‌ బుకింగ్‌ను ప్రారంభించనున్నట్టు టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆయా కల్యాణమండపాల పరిసరాల్లోని పోస్టాఫీసుల్లోనూ వీటిని బుక్‌ చేసుకునే అవకాశం కల్పించామని పేర్కొన్నారు.

తొలిదశలో ప్రయోగాత్మకంగా చిత్తూరు జిల్లాలోని 39 కల్యాణమండపాలను టిటిడి ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచింది. దశలవారీగా ఇతర కల్యాణమండపాలను ఆన్‌లైన్‌లోకి తీసుకురానుంది. మాన్యువల్‌గా కల్యాణమండపాలను బుక్‌ చేసుకునే ప్రక్రియ జనవరి 21వ తేదీ నాటితో ముగియనుంది. భక్తులు ttdkmonline.com అనే వెబ్‌సైట్‌ ద్వారా క్రెడిట్‌/డెబిట్‌ కార్డుల ద్వారా కల్యాణమండపాలను బుక్‌ చేసుకోవచ్చు. ఇతర వివరాలకు ఆయా కల్యాణమండపాల మేనేజర్లను సంప్రదించగలరు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.