TTD LAUNCHES NEW MOBILE APP _ టిటిదేవస్థానమ్స్ మొబైల్‌ యాప్‌ను ప్రారంభించిన టిటిడి ఛైర్మన్‌

ONE STOP SOLUTION FOR DEVOTEES-CHAIRMAN

 

DIGITAL GATEWAY FOR PILGRIMS-TTD EO

 

Tirumala, 27 JANUARY 2023: The new Mobile App, “TTDevasthanams” released by TTD with the support of Jio Platforms, is a “One stop solution” for devotees providing all services evolving the needs of the pilgrims, said TTD Trust Board Chairman Sri YV Subba Reddy.

 

Launching the new Mobile App at Annamaiah Bhavan in Tirumala on Friday, the Chairman said, the app is designed to streamline communication, event updates, bookings, digital content, e-Hundi payments and ultimately elevate the overall devotional experience for all the pilgrims. “It’s a universal app that acts as a “Hand Guide” to pilgrims. EVen they can even watch all Four SVBC live programs in this app. Undoubtedly it’s a first of its kind Religious App”, he asserted.

 

TTD EO Sri AV Dharma Reddy described the app as a “Digital Gateway for Pilgrims”. “We have been working with the JIO team for the past two years to bring out this fully personalized pilgrim-friendly app that presents a wide array of features which includes real-time updates on events and activities happening in Tirumala providing a seamless experience to the pilgrim using the app.

 

Earlier, the Jio team representative explained the features of the app with Powerpoint Presentation. The mobile app includes push notifications regarding important announcements, access to live streaming, easy access to on-line resources such as videos, ringtones, wallpapers and important do’s & don’ts. The app is fully integrated with TTD donation and hundi services, providing a convenient payment experience.

 

TTD JEO Sri Veerabrahmam, CVSO Sri Narasimha Kishore, Jio President Sri Anish Shah, President, Chief Operating Officer, Jio Platforms Ltd., Sri Amar, IT Advisor to TTD, Sri Sandeep, GM IT TTD and others members from TTD IT wing and Jio team were also present.

 

                                                   

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
టిటిదేవస్థానమ్స్ మొబైల్‌ యాప్‌ను ప్రారంభించిన టిటిడి ఛైర్మన్‌
 
దర్శన టికెట్లు, సేవాటికెట్ల బుకింగ్‌తో పాటు సమస్త సమాచారం నిక్షిప్తం
 
తిరుమల, 27 జనవరి, 2023: భక్తులకు మరింత మెరుగైన డిజిటల్‌ సేవలు అందించేందుకు ప్రయోగాత్మకంగా టిటిదేవస్థానమ్స్ పేరుతో రూపొందించిన మొబైల్‌ యాప్‌ను టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డి శుక్రవారం ప్రారంభించారు. తిరుమల అన్నమయ్య భవనంలో ఈ కార్యక్రమం జరిగింది. 
 
ఈ సందర్భంగా ఛైర్మన్‌ మీడియాతో మాట్లాడుతూ భక్తుల కోసం ఇప్పటివరకు గోవింద మొబైల్‌ యాప్‌ ఉండేదని, దీన్ని మరింత ఆధునీకరించి మరిన్ని అప్లికేషన్లు పొందుపరచి నూతన యాప్‌ను రూపొందించామని తెలిపారు. ఈ మొబైల్‌ యాప్‌ ద్వారా భక్తులు తిరుమల శ్రీవారి దర్శనం, సేవలు, వసతి, అంగప్రదక్షిణ, సర్వదర్శనం, శ్రీవారి సేవ బుక్‌ చేసుకోవచ్చన్నారు. విరాళాలు కూడా ఇదే యాప్‌ నుండి అందించవచ్చని చెప్పారు. పుష్‌ నోటిఫికేషన్ల ద్వారా తిరుమల శ్రీవారి ఆలయంలో జరిగే ఉత్సవాల వివరాలు ముందుగా తెలుసుకోవచ్చని, ఎస్వీబీసీ ప్రసారాలను లైవ్‌ స్ట్రీమింగ్‌ ద్వారా ఈ యాప్‌ ద్వారా చూడవచ్చని తెలిపారు.
 
తిరుమలకు సంబంధించిన సమస్త సమాచారం ఈ యాప్‌లో ఉందని, భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించడానికి ఉపయోగపడుతుందని చెప్పారు. జియో సంస్థ సహకారంతో  టిటిడి ఐటి విభాగం ఈ యాప్‌ను రూపొందించినట్టు వివరించారు. సామాన్య భక్తులకు స్వామివారి సేవలు, దర్శనం, టికెట్లు, వసతి సులువుగా అందించేందుకు ఆన్లైన్‌ ద్వారా క్లౌడ్‌ టెక్నాలజిని ఉపయోగిస్తున్నామని తెలిపారు. తద్వారా ప్రతినెలా దర్శనం, సేవలు, శ్రీవాణి టికెట్లతో పాటు తిరుమల, తిరుపతిలో వసతి కూడా ముందుగానే బుక్‌ చేసుకోగలుగుతున్నారని వివరించారు. నూతన యాప్‌ సేవలపై భక్తుల నుండి సలహాలు, సూచనలు స్వీకరించి అవసరమైతే మరిన్ని  పొందుపరుస్తామని చెప్పారు.
 
భక్తులకు డిజిటల్‌ గేట్‌ వే : టిటిడి ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి
 
భక్తులకు సంబంధించిన అన్ని అవసరాల కోసం డిజిటల్‌ గేట్‌ వేగా ఈ యాప్‌ ఉపయోగపడుతుందని టిటిడి ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి అన్నారు. భక్తులు లాగిన్‌ అయ్యేందుకు యూజర్‌ నేమ్‌తోపాటు ఓటిపి ఎంటర్‌ చేస్తే చాలని, పాస్‌వర్డ్‌ అవసరం లేదని చెప్పారు. కంప్యూటర్‌ వాడడం తెలియనివారు కూడా వినియోగించేందుకు వీలుగా ఈ ప్రపంచస్థాయి యాప్‌ను రూపొందించినట్టు చెప్పారు.
 
ఈ కార్యక్రమంలో టిటిడి జెఈవో శ్రీ వీరబ్రహ్మం, సివిఎస్వో శ్రీ నరసింహకిషోర్‌, జియో ప్లాట్‌ఫామ్స్‌ లిమిటెడ్‌ ప్రెసిడెంట్‌, చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ శ్రీ అనీష్‌ షా, ఐటి సలహాదారు శ్రీ అమర్‌, ఐటి జిఎం శ్రీ సందీప్‌, యాప్‌ను రూపొందించిన బృందం పాల్గొన్నారు.
 
టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.