TTD MULLS DARSHAN ON TRIAL BASIS AT ALL ITS LOCAL TEMPLES FROM JUNE 8- TTD CHAIRMAN _ జూన్ 8 నుండి టిటిడి అనుబంధ ఆల‌యాల‌లో ప్ర‌యోగాత్మ‌కంగా ద‌ర్శ‌నం – టిటిడి ఛైర్మ‌న్ శ్రీ వై.వి.సుబ్బారెడ్డి

Tirupati, 6 Jun. 20: In view of COVID 19 relaxation announced by Central and State Governments, TTD has geared up for resuming Darshan in all its local temples on a trial basis, from June 8 onwards, said TTD Chairman Sri YV Subba Reddy.

TTD EO Sri Anil Kumar Singhal reviewed in detail over the arrangements made for resuming darshan in local temples.

As per directions of Chairman and EO, Tirupati JEO Sri P Basant Kumar accompanied by senior officials visited Sri Padmavati Ammavari temple at Tiruchanoor, Sri Kalyana Venkateshwara Temple at Srinivasa Mangapuram,  

Sri Prasanna Venkateswara Swamy temple at Appalayagunta, Sri Govindaraja Swamy temple and Sri Kapileswara Swamy temple on Saturday and instructed the concerned officials to make 

Speaking to media later the JEO explained the guidelines to Devotees for darshan. Excerpts:

* Darshan for devotees from 7:30am to 6pm everyday.

* Devotees without masks will not be allowed for darshan.

* TTD has arranged hand sanitizers at all temples.

* Darshan will be given for 250 persons every hour at all TTD local temples from June 8 onwards

* Online tickets could be by https:/tirupatibalaji.ap.gov.in for all TTD local temples 

* For tickets, through SMS devotees should send messages to Phone 7738286666

* They should mention TTD (space) Temple Name (Space) Date (space) Number of persons in their SMS. For instance, if six persons wanted to have darshan of Lord Govindaraja Swamy, the messaging method is: TTD SVG 11.06.2020 6

DIFFERENT TEMPLE CODES:

Sri Govindaraja Swamy temple (SVG)

Sri Padmavathi Ammavari temple (SVP)

Sri Kapileswara swamy temple (SVK)

Sri Prasanna Venkateswara, Appalayagunta (SVA), Sri Kalyana Venkateswara at Srinivasa Mangapuram  (SVS)

*  TTD local temples Ticket counters have been set up at Vishnu Nivasam, RTC bus stand, Alipiri at Bhudevi complex.

* There would be no special sevas, special Darshans, Shatari and Theertham at any of these temples

* However as per tradition, in all Vaishnava temples laddu and Anna Prasadam will soon be resumed

* All devotees are requested to observe mandatory social distancing at all temples during darshan and follow instructions by temple staff.

TTD Additional CVSO Sri Siva Kumar Reddy, IT Chief Sri Sesha Reddy, Spl.Gr.DyEO Smt Varalakshmi, DyEOs Smt Jhansi Rani, Sri Subramaniam, temple priests and others participated in the inspection.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

జూన్ 8 నుండి టిటిడి అనుబంధ ఆల‌యాల‌లో ప్ర‌యోగాత్మ‌కంగా ద‌ర్శ‌నం –
టిటిడి ఛైర్మ‌న్ శ్రీ వై.వి.సుబ్బారెడ్డి

తిరుప‌తి, 2020 జూన్ 06: కేంద్ర రాష్ట్ర ప్ర‌భుత్వాలు కోవిడ్ -19 లాక్‌డౌన్ నిబంధ‌న‌ల‌ను స‌డ‌లించిన నేప‌థ్యంలో జూన్ 8వ తేదీ సోమ‌వారం ఉద‌యం నుండి టిటిడి అనుబంధ ఆల‌యాల‌లో భ‌క్తుల‌కు ప్ర‌యోగాత్మ‌కంగా ద‌ర్శ‌నం క‌ల్పించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామ‌ని టిటిడి ఛైర్మ‌న్ శ్రీ వై.వి.సుబ్బారెడ్డి వెల్ల‌డించారు. టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్ స్థానిక‌ ఆల‌యాల‌లో ద‌ర్శ‌నంపై సంబంధిత అధికారుల‌తో స‌మీక్షించారు.

 టిటిడి ఛైర్మ‌న్‌, ఈవో ఆదేశాల‌కు అనుగుణంగా జెఈవో శ్రీ పి.బ‌సంత్‌కుమార్ అధికారుల‌తో క‌లిసి శ‌నివారం తిరుచానూరు శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి ఆల‌యం, శ్రీ‌నివాస‌మంగాపురం శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆల‌యం, అప్ప‌లాయ‌గుంట శ్రీ ప్ర‌స‌న్న వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆల‌యం, తిరుప‌తి శ్రీ గోవింద‌రాజ‌స్వామివారి ఆల‌యం, శ్రీ క‌పిలేశ్వ‌ర‌స్వామివారి ఆల‌యాల‌ను ప‌రిశీలించి అధికారులకు ప‌లు సూచ‌న‌లు చేశారు.

 ఈ సంద‌ర్భంగా జెఈవో శ్రీ పి.బ‌సంత్‌కుమార్ మీడియాతో మాట్లాడుతూ జూన్ 8వ తేదీ నుండి భక్తులకు ప్ర‌యోగాత్మ‌కంగా ఉచితంగా ద‌ర్శ‌నం క‌ల్పించేందుకు విధివిదానాల‌ను రూపొందించిన‌ట్లు చెప్పారు.    

– రోజు ఉద‌యం 7.30 గంట‌ల నుండి సాయంత్రం 6.00 గంట‌ల వ‌ర‌కు భ‌క్తుల‌కు ద‌ర్శ‌నం క‌ల్పిస్తాం.

– ద‌ర్శ‌నానికి విచ్చేసే భ‌క్తులు మాస్కులు త‌ప్ప‌నిస‌రిగా ధ‌రించాలి. మాస్కులు లేని వారిని  ఎట్టి ప‌రిస్థితుల‌లోను దర్శ‌నానికి అనుమ‌తించ‌ము.

– ఆల‌యాలకు విచ్చేసే భ‌క్తుల‌ కొర‌కు హ్యాండ్ శానిటైజ్ ఏర్పాటు చేశాము.  

– జూన్ 8వ తేదీ నుండి టిటిడి అనుబంధ ఆల‌యాల‌లో గంటకు 250 మంది చొప్పున ద‌ర్శ‌నం క‌ల్పిస్తాము.

– ఆన్‌లైన్, ఎస్.ఎమ్.ఎస్, ఆల‌యాల‌ ప్రాంగ‌ణంలో నిర్థేశిత పిఒఎస్ మిష‌న్‌ల ద్వారా ఉచితంగా ద‌ర్శ‌నం టోకెన్లు మంజూరు చేయ‌డానికి ఏర్పాట్లు చేశాము.

– ఆన్‌లైన్‌లో టిటిడి వెబ్‌సైట్‌ https:/tirupatibalaji.ap.gov.in ద్వారా స్థానిక ఆల‌యాల‌లో ద‌ర్శ‌నం టోకెన్లు పొంద‌వ‌చ్చు.

– ఫోన్ నెం.7738286666 కు ఎస్‌.ఎమ్‌.ఎస్ పంపి ద‌ర్శ‌నం టోకెన్లు పొంద‌వ‌చ్చు. ఇందు కొర‌కు ‌TTD(space)Temple Name(Space)Date(space)Namber of persons టైపుచేసి ఎస్‌.ఎమ్‌.ఎస్ పంపాలి.

– జూన్ 8 నుండి 30వ తేదీ వ‌ర‌కు భ‌క్తులు టిటిడి స్థానిక ఆల‌యాల‌లో ద‌ర్శ‌నం టోకెన్లు పొందేందుకు తిరుప‌తిలోని విష్ణునివాసం, ఆర్‌టిసి బ‌స్టాండ్‌, అలిపిరి వ‌ద్ద గ‌ల భూదేవి కాంప్లెక్స్‌లలో ఒక్కొక్క కౌంట‌ర్ ఏర్పా‌టు చేశాము.

– ఆలయాల‌లో ఎలాంటి సేవ‌లు, ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌నాలు, శ‌ఠారి, తీర్థ ప్ర‌సాదాలు ఉండ‌వు.

– వైష్ణ‌‌వ ఆల‌యాల‌లో భ‌క్తుల‌కు ప్ర‌సాదం అందించే సాంప్ర‌దాయం ఉన్నందున త్వ‌ర‌లో ఆయా ఆల‌యాల‌లో ల‌డ్డూ ప్ర‌సాదాలు, అన్న ప్ర‌సాదాలు అందించేందుకు చ‌ర్య‌లు తీసుకుంటా‌న్నాము.

– భ‌క్తులు ద‌ర్శ‌నానికి వెళ్ళే‌ట‌ప్పుడు క్యూ లైన్ల‌లో భౌతిక‌ దూరం పాటించాలి. విధుల‌లో ఉన్న సిబ్బంది ఇచ్చే సూచ‌న‌లు పాటిస్తూ, టిటిడికి స‌హాక‌రించాల‌ని కోరుతున్నాము.

 ఈ ప‌రిశీల‌న‌ కార్య‌క్ర‌మంలో అద‌న‌పు సివిఎస్వో శ్రీ శివ‌కుమార్‌రెడ్డి, ఐటి విభాగాధిప‌తి శ్రీ శేషారెడ్డి, డెప్యూటీ ఈవోలు శ్రీ‌మ‌తి ఝూన్సీరాణి, శ్రీ వ‌ర‌ల‌క్ష్మీ, శ్రీ సుబ్ర‌మ‌ణ్యం, ఆల‌య అర్చ‌కులు, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది