BURUGAMANDA TEMPLE TAKEN OVER BY TTD _ టిటిడి ఆధీనంలోకి బూర‌గ‌మంద‌ శ్రీ ప్ర‌స‌న్న వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆల‌యం

Tirupati, 6 Nov. 20: The ancient temple of Sri Prasanna Venkateswara Swamy at Burugamanda village in Sadumu mandal of Chittoor district was traditionally merged with the TTD on Friday.

The merger ceremony was performed in the presence of the AP Panchayati Raj Minister Sri Peddireddy Ramachandra Reddy.

Sri K Venkat Reddy, the custodian of the temple handed over the temple documents to the Endowments Department who in turn gave it to TTD.

Henceforth Temple will become part of the Sri Kalyana Venkateswara Swamy group of temples run by TTD.

TTD Spl.GR.DyEO Smt Vara Lakshmi, DyEO of SKVT Smt VR Shanti, DyEO (Inventories) Sri Devendrababu and superintendent Sri Chengalrayulu were present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

టిటిడి ఆధీనంలోకి బూర‌గ‌మంద‌ శ్రీ ప్ర‌స‌న్న వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆల‌యం

తిరుప‌తి, 2020 న‌వంబ‌రు 06: చిత్తూరు జిల్లా స‌దుం మండ‌లం బూర‌గ‌మంద గ్రామంలోని శ్రీ ప్ర‌స‌న్న వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆలయాన్ని టిటిడిలోకి విలీనం చేసుకునే కార్య‌క్ర‌మం శుక్ర‌వారం జ‌రిగింది. రాష్ట్ర పంచాయ‌తీరాజ్ శాఖ మంత్రివ‌ర్యులు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స‌మ‌క్షంలో ఈ విలీన కార్య‌క్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వ‌హించారు.

ఈ సంద‌ర్భంగా ఆల‌య ధ‌ర్మ‌క‌ర్త శ్రీ కె.వెంక‌ట‌రెడ్డి రాష్ట్ర దేవాదాయ శాఖ అధికారుల‌కు ఆల‌యానికి సంబంధించిన రికార్డుల‌ను అందించారు. అనంత‌రం రాష్ట్ర దేవాదాయ శాఖ అసిస్టెంట్ క‌మిష‌న‌ర్ శ్రీ వేంక‌టేశ్వ‌ర్లు ఆల‌యానికి సంబంధించిన రికార్డులు, ఇత‌ర ప‌త్రాల‌ను టిటిడి అధికారుల‌కు అంద‌జేశారు. శ్రీ‌నివాస‌మంగాపురంలోని శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆల‌య స‌ముదాయంలో ఈ ఆల‌యాన్ని చేర్చారు.

ఈ కార్య‌క్ర‌మంలో టిటిడి జ‌న‌ర‌ల్ డెప్యూటీ ఈవో శ్రీ‌మ‌తి వ‌ర‌ల‌క్ష్మీ, శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ‌మ‌తి విఆర్‌.శాంతి, ఇన్వెంట‌రీ డెప్యూటీ ఈవో శ్రీ దేవేంద్ర‌బాబు, సూప‌రింటెండెంట్ శ్రీ చెంగ‌ల్రాయ‌లు త‌దిత‌రులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.