TTD NETS Rs.13.54Cr IN HUMAN HAIR SALE_ తలనీలాల విక్రయం ద్వారా టిటిడి ఆదాయం రూ.13.54 కోట్లు
Tirumala, 7 September 2017: TTD has added Rs.13.54Crores to its coffers through the e-auction of 11,100 kilos of various varieties of human hair held on Thursday which took place under the supervision of Tirumala JEO Sri KS Sreenivasa Raju.
HH Sep 2017
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs TIRUPATI
తలనీలాల విక్రయం ద్వారా టిటిడి ఆదాయం రూ.13.54 కోట్లు
సెప్టెంబర్ 07, తిరుమల, 2017 : కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసే భక్తులు భక్తిశ్రద్ధలతో సమర్పించిన తలనీలాల ఈ-వేలంలో టిటిడి రూ.13.54 కోట్ల ఆదాయాన్ని గడించింది.
ప్రతినెలా మొదటి గురువారం నాడు తలనీలాల ఈ వేలం జరుగుతున్న విషయం విదితమే. ఇందులోభాగంగా టిటిడి తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్.శ్రీనివాసరాజు పర్యవేక్షణలో తలనీలాల ఈ వేలం జరిగింది. మొదటి, రెండు, మూడు, నాలుగు, ఐదు, తెల్లవెంట్రుకలు తలనీలాల రకాల ఈ-వేలం నిర్వహించారు. ఈ నెల నిర్వహించిన ఈ-వేలంలో మొత్తం 11,100 కిలోల తలనీలాలు అమ్ముడుపోయాయి.
తలనీలాలలో మొదటి రకం(31 ఇంచుల పైన), రెండో రకం(16 నుండి 30 ఇంచులు), మూడో రకం(10 నుండి 15 ఇంచులు), నాలుగో రకం(5 నుండి 9 ఇంచులు), ఐదో రకం(5 ఇంచుల కన్నా తక్కువ), తెల్లవెంట్రుకల రకాలను తితిదే ఈ-వేలంలో పెట్టింది.
కిలో రూ.22,494/-గా ఉన్న మొదటి రకం తలనీలాలను మొత్తం 8,900 కిలోలను వేలానికి ఉంచగా 300 కిలోలు అమ్ముడుపోయాయి. తద్వారా రూ.67.48 లక్షల ఆదాయం సమకూరింది.
కిలో రూ.17,223/-గా ఉన్న రెండో రకం తలనీలాలను మొత్తం 52,400 కిలోలను వేలానికి ఉంచగా 7,200 కిలోలు అమ్ముడుపోయాయి. తద్వారా రూ.12.40 కోట్ల ఆదాయం సమకూరింది.
కిలో రూ.2,833/-గా ఉన్న మూడో రకం తలనీలాలను మొత్తం 24,100 కిలోలను వేలానికి ఉంచారు. ఇందులో 1,600 కిలోలు అమ్ముడుపోయాయి. తద్వారా రూ.45.52 లక్షల ఆదాయం లభించింది.
కిలో రూ.1,194/-గా ఉన్న నాలుగో రకం తలనీలాలను 1000 కిలోలను వేలానికి ఉంచారు. ఏవీ అమ్ముడుపోలేదు.
కిలో రూ.25/-గా ఉన్న ఐదో రకం తలనీలాలను 1,34,000 కిలోలను వేలానికి ఉంచగా 2000 కిలోలు అమ్ముడుపోయాయి. తద్వారా రూ.50 వేల ఆదాయం సమకూరింది.
కిలో రూ.5,749/-గా ఉన్న తెల్ల వెంట్రుకలను 6,300 కిలోలను అమ్మకానికి ఉంచారు. ఏవీ అమ్ముడుపోలేదు.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.