TTD OBSERVES “TRADITIONAL ACCOUNTING FESTIVAL”_ శ్రీవారి ఆలయంలో నేత్ర‌ప‌ర్వంగా ఆణివార ఆస్థానం

Tirumala, 16 July 2017: The “Festival of commencement of New Accounts” – the traditional Anivara Asthanam was observed religious fervour in Tirumala temple of Lord Venkateswara on Sunday by TTD.

PEDDA JEEYANGAR SWAMY OFFERS VISESHA PADI

A set of new vastrams to be presented to Presiding deity and other deities were carried over head by H.H.Sri Sri Ramanuja Pedda Jeeyar Swamy, the senior pontiff of Tirumala shrine Circumambulating Dwajasthambham inside Sri Vari Temple.

TEMPLE COURT AT BANGARU VAKILI

The processional deities of Lord Malayappa Swamy, Goddesses Sridevi and Bhudevi and chief commander of Lord Sri Vishwaksena were seated opposite Garudalwar Sannidhi and the Asthanam-temple court was performed.

BRIEF NOTE ON ANIVARA ASTHANAM

Among the festivals conducted with pomp and splendor at tirumala, Anivara Asthanam takes the place of pride. As this Asthanam is held on the last day of the Tamil month Ani, it is called as Anivara Asthanam.

INSCRIPTIONAL EVIDENCE

An inscription (No.617 T.T) found on the stone wall of the second prakara of Tirumala temple under dated 9-3-1494 confirms the importance of this “Annual Accounting Festival”.

The Anivara Asthanam marks the closure of the previous year’s account and the commencement of new accounts. On this occasion, the temple is re-entrusted to the Jeeyangars, as also the seals of the office of the Administration to the Executive and administrative heads of the Devasthanams. This festival also signifies the oath taking ceremony, at which the servants of the Lord are to affirm their loyalty and faithfulness to their duty in sacred service of Lord.

TTD EO Sri Anil Kumar Singhal, Tirumala JEO Sri KS Sreenivasa Raju, CVSO Sri A Ravikrishna, Temple DyEO Sri Rama Rao, Peishkar Sri Ramesh and others were also present.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

శ్రీవారి ఆలయంలో నేత్ర‌ప‌ర్వంగా ఆణివార ఆస్థానం

తిరుమల, 16 జూలై 2017: తిరుమల శ్రీవారి ఆలయంలో ఆదివారంనాడు సాలకట్ల ఆణివార ఆస్థానం నేత్ర‌ప‌ర్వంగా జ‌రిగింది. శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద‌జీయంగార్‌, శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్న‌జీయంగార్‌, టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్ దంప‌తులు, జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీ‌నివాస‌రాజు దంప‌తులు, సివిఎస్‌వో శ్రీ ఎ.ర‌వికృష్ణ దంప‌తులు పాల్గొన్నారు.

ముందుగా ఉదయం 7 నుండి 9 గం||ల నడుమ బంగారువాకిలి ముందు గల ఘంటా మండపంలో సర్వభూపాల వాహనంలో ఉభయదేవేరులతో కూడిన శ్రీ మలయప్ప స్వామివారిని గరుత్మంతునికి అభిముఖంగా కొలువుకు వేంచేపు చేశారు. మరో పీఠంపై స్వామివారి సర్వసైన్యాధ్యక్షుడైన శ్రీ విష్వక్సేనులవారు దక్షిణాభిముఖంగా వేంచేపు చేశారు. అనంతరం ఆనందనిలయంలోని మూలవిరాట్టుకు, బంగారువాకిలి వద్ద ఆస్థానంలో వేంచేపు చేసిన ఉత్సవమూర్తులకు ప్రత్యేకపూజలు, ప్రసాదాలు నివేదించారు. ఆ త‌రువాత శ్రీశ్రీశ్రీ పెద్ద జీయంగార్‌ పెద్ద వెండితట్టలో ఆరు పెద్ద పట్టువస్త్రాలను తలపై పెట్టుకొని మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా విచ్చేశారు. శ్రీశ్రీశ్రీ చిన్న జీయంగార్‌, టిటిడి ఈవో, జెఈవో, ఇతర ఉన్నతాధికారులు వెంట వచ్చారు. నాలుగు ప‌ట్టువస్త్రాల‌ను శ్రీవారి మూలవిరాట్టుకు అలంకరించారు. మిగిలిన రెండు వస్త్రాలలో ఒకటి మలయప్పస్వామివారికి, మరొకటి విష్వక్సేనులవారికి అలంకరించారు.

అనంతరం శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు తమ తలకు శ్రీవారి పాదవస్త్రంతో ”పరివట్టం” (చిన్న పట్టుగుడ్డ) కట్టుకొని స్వామివారి ద్వారా బియ్యపు దక్షణ స్వీకరించి ‘నిత్యైశ్వర్యోభవ’ అని స్వామివారిని ఆశీర్వదించారు. ఆ తరువాత అర్చకులు శ్రీశ్రీశ్రీ పెద్ద జీయంగారికి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయంగారికి, టిటిడి తరఫున కార్యనిర్వహణాధికారి శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్‌కు ‘లచ్చన’ అను తాళపు చెవి గుత్తిని వరుస క్రమంలో కుడిచేతికి తగిలించారు. హారతి, చందనం, తాంబూలం, తీర్థం, శఠారి మర్యాదలు చేసిన అనంతరం ఆ తాళపు చెవి గుత్తిని శ్రీవారి పాదాలచెంత ఉంచారు. అనంత‌రం ఆస్థానంతో ఈ కార్య‌క్ర‌మం ముగిసింది.

వార్షిక లెక్క‌లు ప్రారంభించిన రోజు : టిటిడి ఈవో

పూర్వం మహంతులు దేవస్థాన పరిపాలనను స్వీకరించిన రోజు అయిన ఈ ఆణివార ఆస్థానం పర్వదినంనాటి నుండి టిటిడి ఆదాయ వ్యయాలు, నిల్వలు తదితర వార్షిక లెక్కలు ప్రారంభమ‌య్యేవ‌ని టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్ తెలిపారు. టిటిడి ధర్మకర్తల మండలి ఏర్పడిన తరువాత వార్షిక బడ్జెట్‌ను మార్చి – ఏప్రిల్‌ నెలలకు మార్చార‌ని చెప్పారు. అయినా శ్రీవారి ఆలయంలో ఈ వార్షిక సాలకట్ల ఉత్సవం నిరంతరాయంగా సౌరమానాన్ని అనుసరించి జరుగుతోంద‌న్నారు. సాధారణంగా ఈ ఉత్సవాన్ని ప్రతి సంవత్సరం సౌరమానం ప్రకారం దక్షిణాయన పుణ్యకాలంలో కర్కాటక సంక్రాంతినాడు నిర్వహిస్తారని తెలిపారు. సౌరమానాన్ని అనుసరించే తమిళుల కాలమానం ప్రకారం ఆణిమాసం చివరి రోజున నిర్వహించే కొలువు కావడంతో దీనికి ఆణివార ఆస్థానం అని పేరు వ‌చ్చింద‌ని వివ‌రించారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.