TTD OFFICERS INSPECT GARUDA SEVA PARKING AREAS NEAR ALIPIRI_గరుడ సేవ నాడు వాహనాల పార్కింగ్‌ కోసం తిరుపతిలో విస్తృత ఏర్పాట్లు

Tirupati, 28 July 2017: In view of ensuing annual brahmotsavams of Lord Sri Venkateswara Swamy from September 23 to October 1 with Garuda Seva on September 27, a team of officers lead by Tirumala JEO Sri KS Sreenivasa Raju along with Tirupati JEO Sri P Bhaskar, Chief Vigilance and Security Officer Sri A Ravikrishna and Tirupati Urban SP Sri Abhishek Mohanty inspected the identified parking areas near Alipiri on Friday.

After the inspection, speaking on this occasion, the Tirumala JEO Sri KS Sreenivasa Raju said “the pilgrim crowd especially those coming in private four wheeler visiting Tirumala on Garuda Seva day is increasing year after year. To avoid traffic congestion in Tirumala, we have identified a few places near Alipiri for the parking of four-wheelers especially on Garuda Seva Day. Today we have inspected the sprawling 38 acres of “Deva Lok” site belonging to AP Tourism. In this 25acres will be allotted for four-wheeler parking. Similarly we have Bharatiya Vidya Bhavan Grounds and SV Medical College grounds as other parking areas. Special buses will be operated by APSRTC on Garuda Seva day from these parking places to Tirumala and back. After August 15, we will inspect these places again with concrete action plan. Our mission is to provide hassle free facilities to multitude of visiting pilgrims”, JEO maintained.

Tirupati JEO Sri P Bhaskar said, to reduce vehicular congestion in Tirumala, alternative parking places have been identified in Tirupati itself. “In future there is a dire need to reduce vehicular traffic in Tirumala due to space problem in Hill Town. We are also contemplating to provide more facilities in the identified parking areas in Tirupati also”, he added.

Tirupati Urban SP Sri Abhishek Mohanty said, “Today we have a preliminary inspection. We will do the required civil engineering works for these parking places to avoid any sort of problem to the pilgrims”, he said.

Meanwhile TTD is contemplating to provide parking space to 3000 two-wheeler at Bhudevi Complex, 1300 at Srivari Mettu, while parking facility for 800 four wheeler at Devalok, 170 at BVB grounds, 100 at SVMC, 80 in Srivari Mettu for Garuda Seva.

CVSO Sri A Ravikrishna, Additional CVSO Sri Sivakumar Reddy, GM Transport Sri Sesha Reddy, SE Electricals Sri Venkateswarulu, EE Manoharam, DyEO Board Cell Smt Goutami, RTC RM Sri Nagasivudu, DSP Sri Muniramaiah and others were also present.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATi

గరుడ సేవ నాడు వాహనాల పార్కింగ్‌ కోసం తిరుపతిలో విస్తృత ఏర్పాట్లు : టిటిడి జెఈవోలు శ్రీ కెఎస్‌ శ్రీనివాసరాజు, శ్రీ పోల భాస్కర్‌

జూలై 28, తిరుపతి, 2017 : శ్రీవారి బ్రహ్మూెత్సవాల సందర్భంగా నిర్వహించే గరుడసేవకు వాహనాలలో విచ్చేసే భక్తుల సంఖ్య ఏడాదికేడాది పెరుగుతున్న నేపథ్యంలో తిరుపతిలోనే వాహనాలను నిలిపి ఉంచేందుకు విస్తృతంగా పార్కింగ్‌ ఏర్పాట్లు చేపడుతున్నామని టిటిడి తిరుమల జెఈవో శ్రీ కెఎస్‌ శ్రీనివాసరాజు, తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌ తెలిపారు. సివిఎస్‌వో శ్రీ ఎ.రవికృష్ణ, తిరుపతి అర్బన్‌్‌ ఎస్పీ శ్రీ అభిషేక్‌ మహంతితో కలసి శుక్రవారం తిరుపతిలోని పార్కింగ్‌ ప్రదేశాలను జెఈవోలు పరిశీలించారు.

ఈ సందర్భంగా ముందుగా తిరుమల జెఈవో మాట్లాడుతూ జూపార్క్‌ సమీపంలోని దేవలోక్‌ ప్రాంగణం, భారతీయ విద్యాభవన్‌ పాఠశాల మైదానం, ఎస్వీ మెడికల్‌ కళాశాల మైదానాలలో పార్కింగ్‌ ప్రదేశాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. 38 ఎకరాలు గల దేవలోక్‌ ప్రాంగణంలో దాదాపు 25 ఎకరాలలో పార్కింగ్‌ ప్రదేశాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. ద్విచక్రవాహనాల పార్కింగ్‌ కోసం అలిపిరి పాత చెక్‌ పాయింట్‌ వద్ద ఏర్పాట్లు చేపడుతామన్నారు. పార్కింగ్‌ ప్రదేశాలనుంచి భక్తులు తిరుమల చేరుకునేందుకు ప్రత్యేకంగా ఆర్టీసి బస్సులను నడుపుతామని తెలిపారు. ఆగష్టు 15వ తేది తర్వాత మరోసారి పార్కింగ్‌ ఏర్పాట్లపై పరిశీలన చేపడుతామన్నారు.

తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌ మాట్లాడుతూ తిరుమలలో స్థలాభావం కారణంగా నాలుగు చక్రాల వాహనాలను తగ్గించాల్సిన నేపథ్యంలో తిరుపతిలో పార్కింగ్‌ ప్రదేశాలను గుర్తించినట్లు తెలిపారు. పార్కింగ్‌ ప్రదేశాల వద్ద భక్తులకు కల్పించాల్సిన ఏర్పాట్లపై ప్రణాళికలు రూపొందిస్తున్నామని వివరించారు.

తిరుపతి అర్బన్‌ ఎస్పీ శ్రీ అభిషేక్‌ మహంతి మాట్లాడుతూ పార్కింగ్‌ స్థలాలపై ప్రస్తుతం ప్రాథమిక పరిశీలన చేపట్టినట్లు తెలిపారు. ఇక్కడ చేపట్టాల్సిన బారికేడ్లు, రక్షణ వలయం ఇతర సివిల్‌ ఇంజనీరింగ్‌ పనులపై మరోసారి పరిశీలన చేపడతామన్నారు. గరుడసేవకు విచ్చేసే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా భద్రతాపరంగా ఏర్పాట్లు చేపడతామని తెలిపారు.

కాగా, అలిపిరి పాత చెక్‌ పాయింట్‌ వద్ద 3000 ద్విచక్రవాహనాలు, శ్రీవారిమెట్టు వద్ద 1300 ద్విచక్రవాహనాలు, 90 నాలుగు చక్రాల వాహనాలు, దేవలోక్‌ ప్రాంగణంలో 800 నాలుగు చక్రాలవాహనాలు, భారతీయ విద్యాభవన్‌ మైదానంలో 170 నాలుగు చక్రాలవాహనాలు, ఎస్వీ మెడికల్‌ కళాశాల మైదానంలో 100 నాలుగు చక్రాలవాహనాల పార్కింగ్‌ కోసం టిటిడి ప్రణాళికలు రూపొందిస్తోంది.

ఈ కార్యక్రమంలో టిటిడి అదనపు సివిఎస్‌వో శ్రీ శివకుమార్‌ రెడ్డి, ఆర్టీసీ ఆర్‌ఎం శ్రీ నాగశివుడు, తిరుపతి ఈస్ట్‌ డిఎస్పీ శ్రీ మునిరామయ్య, టిటిడి ట్రాన్స్‌ఫోర్ట్‌ జీఎం శ్రీ శేషారెడ్డి, ఎస్‌ఈ ఎలక్ట్రికల్స్‌ శ్రీ వేంకటేశ్వర్లు, బోర్డు సెల్‌ డిప్యూటీ ఈవో శ్రీమతి గౌతమి, ఈఈ శ్రీ మనోహరం ఇతర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.