JYESTABHISHEKAM FETE AT SRIVARI TEMPLE FROM JUNE 2 TO JUNE 4 _ జూన్ 2 నుండి 4వ తేదీ వరకుశ్రీవారి ఆలయంలో జ్యేష్ఠాభిషేకం
Tirumala,30, May 2023: TTD is organising the holistic fete of Jyestabisekam in Srivari temple from June2-4 to ensure the longevity of festivities of Abhisekam, Snapana Tirumanjanam etc.
The vaikhanasa Agama tradition also called Abhidayaka abisekam is observed during Jyesta nakshatra of jyesta ninth every year at the Kalyana Mandapams of the Srivari temple.
On Day-1 the utsava idols of Sri Malayappaswami and his consorts were offered Homas, Abhisekam and panchamruta snapana thirumanjanam and later paraded in full decorations and ornamentation.
On Day-2 the utsava idols are paraded in pearl dressing and with gold dressing on the third day. These gold covers are retained on the utsava idols till Jyestabisekam next year.
In view of the three-day fete TTD has cancelled all arjita Sevas like Kalyanotsavam, unjal Seva and Arjita Brahmotsavam on June 4 and the Tomala and Archana Sevas are performed in Ekantam.
జూన్ 2 నుండి 4వ తేదీ వరకుశ్రీవారి ఆలయంలో జ్యేష్ఠాభిషేకం
తిరుమల, 2023 మే 30: తిరుమల శ్రీవారి ఆలయంలో జూన్ 2వ తేదీ నుండి 4వ తేదీ వరకు మూడు రోజుల పాటు జ్యేష్ఠాభిషేకం జరుగనుంది.
అభిషేకాలు, పంచామృత స్నపనతిరుమంజనాల కారణంగా శ్రీదేవి, భూదేవి, శ్రీ మలయప్పస్వామివారి ఉత్సవమూర్తులు అరిగిపోకుండా జాగ్రత్తలు తీసుకునేందుకు వైఖానసాగమోక్తంగా నిర్వహించే ఉత్సవమే జ్యేష్ఠాభిషేకం. ప్రతి సంవత్సరం జ్యేష్ఠ మాసంలో జ్యేష్ఠా నక్షత్రానికి ముగిసే విధంగా స్వామివారికి ఈ ఉత్సవం నిర్వహిస్తారు. ఆలయంలోని సంపంగి ప్రదక్షిణంలో గల కల్యాణ మండపంలో ఈ ఉత్సవం చేపడతారు. దీనిని ‘అభిధేయక అభిషేకం’ అని కూడా అంటారు.
మొదటిరోజు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారికి హోమాలు, అభిషేకాలు, పంచామృత స్నపనతిరుమంజనం నిర్వహిస్తారు. తర్వాత స్వామి, అమ్మవార్లకు వజ్రకవచం అలంకరించి పురవీధుల్లో ఊరేగిస్తారు.
రెండో రోజు ముత్యాల కవచ సమర్పణ చేసి ఊరేగిస్తారు. మూడో రోజు కూడా తిరుమంజనాదులు పూర్తిచేసి బంగారు కవచాన్ని సమర్పించి ఊరేగింపు నిర్వహిస్తారు. ఈ బంగారు కవచాన్ని మళ్లీ జ్యేష్ఠాభిషేకంలోనే తీస్తారు. అంతవరకు సంవత్సరం పొడవునా శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు బంగారు కవచంతోనే ఉంటారు.
జ్యేష్ఠాభిషేకం కారణంగా శ్రీవారి ఆలయంలో జూన్ 4 వ తేదీ కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది. తోమాల, అర్చన సేవలను ఏకాంతంగా నిర్వహిస్తారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.