TTD PANCHAGAVYA PRODUCTS ON ANVIL- TTD EO _ త్వరలో పంచగవ్య ఉత్పతుల తయారీ- టిటిడి ఈవో డాక్టర్ కెఎస్.జవహర్‌రెడ్డి
Tirupati, 30 July 2021: TTD Executive Officer, Dr KS Jawahar Reddy on Friday directed the officials concerned to speed up the production of herbal products from Panchagavya (cow dung and urine) and also their sale in Tirumala and Tirupati at the earliest.
Addressing a review meeting with officials of SV Goshala at Sri Padmavati Rest House, the EO said among probable products from Panchagavya like Dhoopam, Soaps, Agarbattis, Detergents should be taken up for production as soon as possible.
He said the Coimbatore based Ashirwad Ayurveda Pharmacy India Pvt. Ltd have said that Pancha gavya could be used to make many medicinal products as well. The EO also said the sale of few Panchagavya products used in daily pujas in temples like dhoopachurnam, Agarbattis, Sambrani cups, Dhoop sticks, Dhoop cones and Vibhuti should be sold for use by devotees in their households and also in the temples.
Similarly, other Panchagavya products like tooth powder, face pack, face powder, herbal shampoo, nasal drops, should be made available for sale. Pancha gavya herbal floor cleaner should be used in TTD rest house, offices and other external areas. He also wanted cow dung bricks be used in Homas and all the products be stored in DPW stores at Tirupati.
TTD EO said the Panchagavya products shall be first made available for sale in Tirumala and Tirupati and later in other regions.
CE Sri Nageswara Rao, FA & CAO Sri O Balaji, SV Goshala Director Dr Harnath Reddy and others were present.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
త్వరలో పంచగవ్య ఉత్పతుల తయారీ- టిటిడి ఈవో డాక్టర్ కెఎస్.జవహర్‌రెడ్డి
తిరుపతి, 2021 జూలై 30: దేశీయ గోవుల ద్వారా సేకరించే పంచగవ్యాలతో హెర్బల్ ప్రొడక్ట్స్ తయారీని వేగ వంతం చేయాలని టిటిడి ఈవో డాక్టర్ కెఎస్.జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని శ్రీ పద్మావతి విశ్రాంతి గృహంలో శుక్రవారం ఈవో ఎస్వీ గోశాల అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ పంచగవ్యాలలో ధూపం, సబ్బులు, అగరబత్తీలు, పరిశుభ్రతా సామగ్రి లాంటి ఉత్పత్తుల్లో వీలైనన్ని టిటిడి గోశాలలో త్వరిత గతిన తయారీకి చర్యలు తీసుకోవాలని ఎస్వీ గోశాల అధికారులను ఆదేశించారు. కోయంబత్తూర్‌లోని ఆశీర్వాద్ ఆయుర్వేద ఫార్మసీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వారు వివిధ పంచగవ్య ఆధారిత మూలికా ఉత్పత్తుల తయారీకి అర్హత కలిగి ఉన్నట్లు తెలిపారు.
పూజలో వినియోగించే పంచగవ్య ఉత్పత్తులైన ధూప్‌చూర్ణం, అగరబత్తీలు, సాంబ్రాణి కప్‌లు, ధూప్ స్టిక్స్, ధూప్ కోన్‌లు టిటిడి, గృహ, శైవ దేవాలయాలలో వినియోగం కోసం విబూదిని తయారుచేసి త్వరలో విక్రయాలు ప్రారంభించాలన్నారు. అదేవిధంగా పంచగవ్య టూత్ పౌడర్, ఫేస్‌ప్యాక్, సోప్, మూలికా షాంపూలు, నాజల్ డ్రాప్స్, గో ఆర్క్ అందుబాటులో ఉంచాలన్నారు. టిటిడి వసతి సముదాయాలు, కార్యాలయాలు, బహిరంగ ప్రదేశాలలో పంచగవ్య హెర్బల్ ఫ్లోర్ క్లీనర్‌ను ఉపయోగించాలన్నారు. హోమ కార్యక్రమాల్లో వినియోగించే ఆవు పేడతో చేసిన పిడకలు తదితర వాటిని సిద్ధంచేయాలన్నారు. వీటి స్టోరెజ్ కొరకు తిరుపతిలోని డిపిడబ్ల్యు స్టోర్‌ను ఉపయోగించుకోవాలని సూచించారు. పంచగవ్య ఉత్పత్తులను మొదట తిరుమల, తిరుపతిలలో, తరువాత బయట ప్రాంతాల్లో విక్రయించాలని ఈవో సూచించారు.
ఈ సమీక్షలో సిఇ శ్రీ నాగేశ్వరరావు, ఎఫ్ఎ అండ్ సిఏవో శ్రీ బాలాజి, ఎస్వీ గోశాల డైరెక్టర్ డాక్టర్ హరనాథరెడ్డి, గోశాల అధికారులు పాల్గొన్నారు.
అంతకుముందు ఈవో గోసంరక్షణ శాల కార్యకలాపాలపై అధికారులతో సమీక్షించారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.