TTD PUBLICATIONS-A TOOL FOR DHARMIC PROPAGATION_ టిటిడి ప్రచురణల ద్వారా విస్తృతంగా సనాతన ధర్మ ప్రచారం – డా… తాళ్లూరు ఆంజనేయులు

Tirumala, 15 October 2018: The spiritual and devotional books published by TTD acts as one of the important tools for the propagation of Hindu Sanatana Dharma, said Sri Anjaneyulu, special officer, TTD Publications.

Speaking to media at the media centre in Rambhageecha Rest House 2 on Monday, he said, TTD established the Publication wing in 2011. So far 3800 devotional works in Telugu, Tamil, Kannada, Hindi, English and Sanskrit were published by the wing and many of them are given for reprint following huge demand from book lovers, he added.

During Salakatla Brahmotsavams in September, publication wing has released 30 books during Vahana Sevas while during the ongoing Navarathri Brahmotsavams 22 while another 36 publications are getting ready for release after the annual event.


ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

టిటిడి ప్రచురణల ద్వారా విస్తృతంగా సనాతన ధర్మ ప్రచారం – డా… తాళ్లూరు ఆంజనేయులు

అక్టోబ‌రు 15, తిరుమల 2018: టిటిడి ప్రచురణల విభాగం ద్వారా విస్తృతంగా సనాతన ధర్మప్రచారం చేస్తున్నామని ప్రచురణల విభాగం ప్రత్యేకాధికారి డా.తాళ్లూరి ఆంజనేయులు అన్నారు. తిరుమలలోని రాంభగీచా-2లో గల మీడియా సెంటర్‌లో సోమవారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టిటిడి ప్రచురణలను మరింత వేగవంతం చేయాలనే ఉద్దేశంతో 2011లో ప్రత్యేకంగా ప్రచురణల విభాగాన్ని ఏర్పాటు చేశారన్నారు. ధార్మిక సంబంధమైన వివిధ గ్రంథాలను ముద్రించి బ్రహ్మోత్సవాల సమయంలో ఆవిష్కరిస్తున్నామన్నారు. వాటిలో ముఖ్యంగా వేదవాఙ్మ‌యానికి సంబంధించిన గ్రంథాలు, ఆర్షవిజ్ఞాన సర్వస్వం, వేంకటేశ్వర మహాత్యం, తిరుమల క్షేత్రాన్నిపరిచయం చేసే క్షేత్రదర్శిని గ్రంథాలు, భ‌గవత్ భక్తుల జీవిత చరిత్రలను పరిచయం చేసే బ్రహ్మమొక్కటే గ్రంథాలు ఇతర అనేక ధార్మిక గ్రంథాలను తెలుగుతోపాటు హిందీ,తమిళం, కన్నడం, ఆంగ్లం, సంస్కృతం భాషలలో ముద్రిస్తున్నామన్నారు. అదేవిధంగా, పోతన భాగవతానికి సరళ వ్యాఖ్యానం రాయించి 8 సంపుటాలలో భక్తులకు అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. ఇప్పటి వరకు టిటిడి పక్షాన 3,800 గ్రంథాలను ముద్రించామన్నారు. వ్యాసభారతం మూలాలను 36 సంపుటాలుగా తెలుగు,సంస్కృతం లిపిలలో త్వరలో ఆవిష్కరిస్తామన్నారు. అలాగే వ్యాసభారతంను తెలుగులో తాత్పర్య సహితంగా ముద్రించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని అన్నారు. టిటిడి ముద్రించిన గ్రంథాలన్నీ ebooks.tirumala.org వెబ్ సైట్ లో ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చన్నారు. టిటిడి పుస్తక విక్రయశాలలో గ్రంథాలన్నీ భక్తులకు అందుబాటులో ఉన్నాయన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.