TTD PUPIL SELECTED FOR NATIONAL FENCING _ జాతీయ ఫెన్సింగ్ పోటీలకు శ్రీ కోదండ రామస్వామి పాఠశాల విద్యార్థిని ఎంపిక

TIRUPATI, 07 JANUARY 2022:  Kumari Ramyasri, a student of Sri Kodandaramaswami English Medium High School run by TTD has been selected to participate in the 24th sub-junior National Fencing Championship slated to begin at Cochin, Ernakulam from January 10-13.

Complementing the student on Saturday the TTD DEO Sri M Bhaskar Reddy said students should shine equally in studies and sports.

The Head Master of the school Sri M Surendra Babu and the coach for Fencing and Taekwondo Sri Gopi Naidu were present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

 

జాతీయ ఫెన్సింగ్ పోటీలకు శ్రీ కోదండ రామస్వామి పాఠశాల విద్యార్థిని ఎంపిక

తిరుపతి, 07 జనవరి 2023: కొచ్చిన్ లో జరుగనున్న 24వ సబ్ జూనియర్ జాతీయ ఫెన్సింగ్ ఛాంపియన్ షిప్ పోటీలకు టిటిడి ఆధ్వర్యంలోని శ్రీ కోదండరామస్వామి ఆంగ్ల ఉన్నత పాఠశాల విద్యార్థిని రమ్యశ్రీ ఎంపికైంది. కేరళ రాష్ట్రం కొచ్చిన్ లోని రాజీవ్ గాంధీ ఇండోర్ స్టేడియంలో జనవరి 10 నుండి 13వ తేదీ వరకు ఈ పోటీలు జరుగనున్నాయి. 

ఈ సందర్భంగా టిటిడి జేఈవో శ్రీమతి సదా భార్గవి విద్యార్థిని అభినందించారని విద్యాశాఖాధికారి శ్రీ ఎం.భాస్కర్ రెడ్డి  చెప్పారు. విద్యార్థులు  చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలని  ఆయన ఆకాంక్షించారు. అదేవిధంగా ఫెన్సింగ్, టైక్వాండో టిటిడి కోచ్ శ్రీ గోపి నాయుడును అభినందించారు. 
 
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ ఎం.సురేంద్ర బాబు పాల్గొన్నారు.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.