TTD RELEASES 56,593 TICKETS ONLINE FOR THE MONTH OF APRIL 2018_ ఆన్‌లైన్‌లో 56, 593 శ్రీవారి ఆర్జితసేవా టికెట్లు విడుదల

DIAL YOUR EO

Tirumala, 5 January 2018: The TTD on Friday released an online quota of 56,593 arjitha seva tickets by 10am for the month of April 2018 to be performed inside the temple of Lord Venkateswara in Tirumala.

Among these tickets, the premiere sevas includes 10,658 which will be made available under the electronic dip system.

Suprabhatam (7,878)

Thomala and Archana (120 each)

Astadalam (240)

Nijapada darshan (2,300)

The other arjitha seva tickets under general category include 45,935.

Visesha puja (1,875)

Kalyanotsavam (11,250)

Unjal seva (3,000)

Arjitha Brahmotsavam (5,805)

Vasanthotsavam (11,180)

Sahasra deepalankara (12,825)

OTHER EXCERPTS

Before taking the calls from the pilgrims, TTD EO Sri Anil Kumar Singhal briefed about the various developmental activities taken by TTD in December 2017.

➢ Henceforth the devotees who prefer to book seva tickets in online quota, will be given time to register for four days in the place of seven days which was in practice earlier. Those who get the tickets confirmed in electronic dip will have to do the payment within three days.

➢ Slotted Sarva Darshan (SSD) was a huge hit among pilgrims when it was launched on an experimental basis in Tirumala for a period of six days from December 18-23 to avoid unnecessary waiting by free darshan pilgrims in queue lines and compartments. TTD has set up 117 counters in 14 locations and issued time slotted darshan tokens. Devotees expressed immense satisfaction with this new system.In six days 96,047 tokens were issued.

➢ Following the feedback from the pilgrims, we will commence this system in a full-fledged manner from second week of March. Counters will be set up both at Tirupati and Tirumala.

➢ Devotees can book accommodation for the month of April from January 9 on wards in advance booking.

➢ Record number of 1.75 lakh pilgrims had Vaikuntha Dwara Darshan on December 29 and December 30. TTD has made elaborate Annaprasadam, beverages, water supply and security cover to devotees.

➢ Special Privilege Darshan to aged and physically challenged on January 9 and 29, for parents with children below five years on January 10 and 30.

➢ Gopuja on January 12 in two Telugu States. On the auspicious occasion of Sarva Ekadasi on this day, the Gopuja will be observed in selected temples.

➢ Rathasapthami or Surya Jayanthi will be observed in Tirumala on January 24. The Lord will take ride on seven vahanams on this day.

➢ Huge reception for TTD’s maiden attempt of sale of diaries and calendars in online. So far more than 30thousand copies were delivered by Postal Department.


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUMALA

ఆన్‌లైన్‌లో 56, 593 శ్రీవారి ఆర్జితసేవా టికెట్లు విడుదల :

‘డయల్‌ యువర్‌ ఈవో’లో టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌

జనవరి 5, తిరుమల 2018: శ్రీవారి ఆర్జిత సేవలకు సంబంధించిన ఏప్రిల్‌ నెల కోటాలో మొత్తం 56,593 టికెట్లను శుక్రవారం ఉదయం 10 గంటలకు విడుదల చేసినట్లు టిటిడి ఈవో శ్రీ అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ తెలిపారు. ఆన్‌లైన్‌ డిప్‌ విధానంలో 10,658 సేవా టికెట్లు విడుదల చేశామని, ఇందులో సుప్రభాతం 7,878 తోమాల 120, అర్చన 120, అష్టదళపాదపద్మారాధన 240, నిజపాద దర్శనం 2,300 టికెట్లు ఉన్నాయని ప్రకటించారు. ఆన్‌లైన్‌లో జనరల్‌ కేటగిరిలో మొత్తం 45,935 సేవాటికెట్లు కాగా, వీటిలో విశేషపూజ 1,875, కల్యాణం 11,250, ఊంజల్‌సేవ 3,000, ఆర్జితబ్రహ్మూెత్సవం 5,805, వసంతోత్సవం 11,180, సహస్రదీపాలంకారసేవ 12,825 ఉన్నాయని వివరించారు.

తిరుమలలోని అన్నమయ్య భవనంలో శుక్రవారం ఉదయం జరిగిన డయల్‌ యువర్‌ ఈవో కార్యక్రమం అనంతరం ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ మీడియాతో మాట్లాడారు.

సమయ నిర్దేశిత సర్వదర్శనం విజయవంతం : భక్తులు ఎక్కువ సమయం కంపార్ట్‌మెంట్లలో వేచి ఉండకుండా సులభతరంగా శ్రీవారిని దర్శించుకునేందుకు డిసెంబరు 18 నుంచి 23వ తేదీ వరకు 6 రోజుల పాటు ప్రయోగాత్మకంగా అమలుచేసిన సమయ నిర్దేశిత సర్వదర్శన విధానానికి భక్తుల నుంచి విశేష స్పందన లభించింది. ఈ 6 రోజుల్లో మొత్తం 96,047 టోకెన్లు జారీ చేశాం. మార్చి రెండో వారం నుంచి తిరుమలతోపాటు తిరుపతిలోనూ పూర్తిస్థాయిలో ఈ విధానాన్ని అమలుచేస్తాం. తిరుపతిలో భక్తులు బస చేసేందుకు వీలుగా విశ్రాంతిగృహాల నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నాం.

ఆర్జితసేవల లక్కీడిప్‌ నమోదులో స్వల్ప మార్పు : శ్రీవారి ఆర్జితసేవల ఆన్‌లైన్‌ లక్కీడిప్‌ నమోదు ప్రక్రియలో స్వల్పమార్పు చేపట్టాం. గతంలో నమోదు చేసుకునేందుకు 7 రోజుల సమయం ఉండేది. భక్తుల సౌకర్యార్థం ప్రస్తుతం ఈ నమోదు సమయాన్ని 4 రోజులకు కుదించాం. లక్కీడిప్‌లో టికెట్లు పొందిన భక్తులు ఆ తరువాత 3 రోజుల్లోపు చెల్లింపులు చేయాల్సి ఉంటుంది.

రికార్డు స్థాయిలో వైకుంఠ ద్వార దర్శనం : వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాల సందర్భంగా రికార్డుస్థాయిలో 1.75 లక్షల మంది భక్తులకు వైకుంఠద్వార దర్శనం కల్పించాం. ఈ అనుభవంతో భవిష్యత్తులో మరింత మెరుగైన సౌకర్యాలను భక్తులకు అందిస్తాం.

ప్రత్యేక దర్శనాలు : జనవరి 9, 29వ తేదీల్లో వ ద్ధులు, దివ్యాంగులకు ఉదయం 10 గంటలకు 1000, మధ్యాహ్నం 2 గంటలకు 2000, మధ్యాహ్నం 3 గంటలకు 1000 మందికి కలిపి మొత్తం 4 వేల మందికి దర్శనం కల్పిస్తాం. ఈ సౌకర్యాన్ని వ ద్ధులు, దివ్యాంగులు వినియోగించుకోవాలి. రద్దీ రోజుల్లో వచ్చి ఇబ్బందులు పడకుండా ఈ రెండు రోజుల్లో స్వామివారిని దర్శించుకోవాలని కోరుతున్నాం.

– జనవరి 10, 30వ తేదీల్లో 5 ఏళ్ల లోపు చంటిపిల్లలకు, వారి తల్లిదండ్రులకు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు సుపథం ప్రవేశమార్గం ద్వారా స్వామివారి దర్శనం కల్పిస్తాం.

జనవరి 24న రథసప్తమి : జనవరి 24న సూర్యజయంతిని పురస్కరించుకుని శ్రీవారి ఆలయంలో రథసప్తమి జరుగనుంది. ఈ సందర్భంగా ఒకేరోజు 7 ప్రధాన వాహనాలపై శ్రీమలయప్పస్వామివారు భక్తులకు దర్శనమిస్తారు. దీనిని ఒకరోజు బ్రహ్మూెత్సవంగా వ్యవహరిస్తారు.

టిటిడి డైరీలు, క్యాలెండర్ల ఆన్‌లైన్‌ బుకింగ్‌కు విశేష స్పందన: ఈ ఏడాది మొదటిసారిగా ఆన్‌లైన్‌లో ప్రవేశపెట్టిన డైరీలు, క్యాలెండర్ల బుకింగ్‌కు భక్తుల నుండి విశేష స్పందన లభిస్తోంది.

– ఇప్పటికే 33 వేలకు పైగా డైరీలు, క్యాలెండర్లను పోస్టల్‌ శాఖ ద్వారా సకాలంలో భక్తులకు చేరవేయడమైనది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.