PILGRIM FRIENDLY AMENDMENTS IN VQC BY JAN END – TTD EO_ ‘డయల్‌ యువర్‌ ఈవో’లో టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌

Tirumala, 5 January 2018: Pilgrim-friendly improvements will be brought in Vaikuntham Queue Complex to avoid jostling near Elephant bridge by end of January, said TTD EO Sri Anil Kumar Singhal.

Answering to pilgrims callers Sri Lakshmi Venkateswarulu from Tirupati, Sri Subbaiah from Guntur, Sri Chandu from Vijayawada, Sri Santosh from Palakollu, the EO said, in the last eight months, major changes have been brought near Vendi Vakili and now the public are not complaining of jostling in this area. We will take up necessary changes required to avoid congestion near elephant bridge in Vaikuntham Queue Complex by this month end”, he added.

Over the suggestion of a pilgrim Sri Munisubramanyam from Tirupati who brought to the notice of EO to increase the size of font in Telugu Panchangam calendar of TTD, the EO assured him of necessary action after consulting with experts.

Another caller Sri Rama Rao from Karimnagar felt the need to facilitate distribution of Annaprasadam in Srivari Mettu and also suggested for proper signage boards to indicate Sarva Darshan, Divya Darshan and other facilities to pilgrims in Tirumala. The EO said, the possibilities to set up Annaprasadam in Srivari Mettu will be discussed. He said, a team of officials have already submitted a report indicating important places in Tirumala to erect signage boards for the information of the pilgrims.

Answering pilgrims Smt Lakshmikantamma from Bengaluru, Sri Shanmugam from Tirupati, the EO said, the token system for PHC and Aged pilgrims has been started with a noble intention of avoiding long waiting by this category of pilgrims in queue lines. “But some pilgrims are still coming and waiting in the queue lines. Every day some tokens are being left over as the quota is not completely utilised by this category pilgrims. It is not possible to issue tokens during week ends as heavy rush comes to Tirumala. So I appeal to the PHC and aged devotees to know the intention behind introduction of tokens and make use of this facility and avoid long waiting hours in queue lines”, he added.

A pilgrim caller Sri Harish, Smt Lakshmi from Hyderabad requested the EO to consider periodic changes in including the family members and also to issue donor pass books as they are not techno friendly. The EO said, the suggestions will be pursued.

When Sri Raman Rao from Visakhapatnam, brought to the notice of TTD EO to improve the soft skills of employees while tackling with devotees and sevakulu.

GIVE SUGGESTIONS ON PUBLIC ISSUES THAN PERSONAL ISSUES-EO APPEALS DEVOTEES

While answering 25 pilgrim callers from across the country, who called up TTD EO Sri Anil Kumar Singhal to give their complaints and suggestions during monthly Dial Your EO programme, the top brass official appealed to them to focus on public issues in the larger interests of the pilgrims.

The Dial Your Programme was held at Annamaiah Bhavan in Tirumala on Friday. Many pilgrims have given useful feed back while a couple of them called up to seek some information. While attending those pilgrims, the EO requested them to use other information platforms of TTD like 24X7 call centres, website of TTD etc. and use the programme to give important feedback so that necessary amendments can be made to improve the system for the sake of the pilgrims.


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUMALA

‘డయల్‌ యువర్‌ ఈవో’లో టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌

జనవరి 5, తిరుమల 2018: తిరుమలలోని అన్నమయ్య భవనంలో శుక్రవారం డయల్‌ యువర్‌ ఈవో కార్యక్రమం జరిగింది. ఇందులో పలువురు భక్తులు అడిగిన ప్రశ్నలకు ఈవో సమాధానాలు ఇచ్చారు.

1. లక్ష్మీకాంతం – చొప్పదండి.

ప్రశ్న: నడకమార్గంలో గాలిగోపురం వద్ద కల్యాణకట్టను ఏర్పాటు చేయండి?

ఈ.వో. పరిశీలిస్తాం. తిరుమలలో భక్తులు వేచియుండాల్సిన అవసరం లేకుండా తలనీలాలు సమర్పించేందుకు ఏర్పాట్లు ఉన్నాయి.

2. పెరుమాల్‌ – హైదరాబాద్‌ , చంద్రశేఖర్‌ – బెంగుళూరు.

ప్రశ్న: కల్యాణం టికెట్లు ఆన్‌లైన్‌లో దొరకడం లేదు?

ఈ.వో. ప్రతినెలా మొదటి శుక్రవారం ఆన్‌లైన్‌లో శ్రీవారి ఆర్జితసేవా టికెట్లు విడుదల చేస్తున్నాం.

3. లక్ష్మీ – హైదరాబాద్‌.

ప్రశ్న: దాతలకు ఆన్‌లైన్‌లో కాకుండా పాసు పుస్తకాలు ఇవ్వండి?

ఈ.వో. పరిశీలిస్తాం.

4. రమణరావు – విశాఖపట్నం.

ప్రశ్న: పరకామణి సేవకు వచ్చాను, సిబ్బంది ప్రవర్తన సరిగా లేదు ?

ఈ.వో. సిబ్బందికి తగిన శిక్షణ ఇవ్వడం ద్వారా ఇకపై అలా జరుగకుండా చూస్తాం.

5. రామారావు – కరీంనగర్‌.

ప్రశ్న: శ్రీవారి మెట్టు వద్ద అన్నదానం చేయండి, తిరుమలలో సూచిక బోర్డులు ఏర్పాటు చేయండి, సమాచార కేంద్రాల వద్ద ఓర్పుతో సమాధానం చెప్పేలా సిబ్బందికి సూచనలు ఇవ్వండి. శ్రీవారి సేవలో పది మందికి తక్కువగా వచ్చినా సేవ చేసే అవకాశం కల్పించండి?

ఈ.వో. శ్రీవారి మెట్టు వద్ద అన్నదానం చేస్తాం. ఈ నెలాఖరులోపు తిరుమలలో సూచిక బోర్డులు ఏర్పాటు చేస్తాం. సమాచార కేంద్రాలలో శిక్షణ పొందిన సిబ్బంది సేవలు అందిస్తున్నారు. శ్రీవారి సేవలో 3 రోజులు, 4 రోజులు, 7 రోజులు, ప్రత్యేక పర్వదినాల సమయంలో పదిమంది కంటే తక్కువ మంది అయినా సేవ చేసేందుకు అవకాశం ఉంది.

6. హరీష్‌ – బెంగళూరు.

ప్రశ్న: దాతలు జీవిత కాలంలో మూడు సార్లు మాత్రమే దర్శనానికి వచ్చే సభ్యుల పేర్లను మార్చుకునేలా నిబంధన ఉంది. దీనిని సడలించండి. దాతలు శ్రీవారి దర్సనం చేసుకుంటేనే లడ్డూ ప్రసాదాలు పొందేలా ఉన్న నిబంధనను మార్చండి?

ఈ.వో. పరిశీలించి నిర్ణయం తీసుకుంటాం.

7. రామకృష్ణ – విశాఖ.

ప్రశ్న: ఆన్‌లైన్‌లో విడుదల చేసే ఆర్జితసేవలను కుటుంబసభ్యులు కలిసి బుక్‌ చేసుకునే అవకాశం కల్పించండి?

ఈ.వో. ఎక్కువమంది భక్తుల కోరికమేరకే ఇలా చేస్తున్నాం.

8. లక్ష్మీకాంతమ్మ – బెంగళూరు, షణ్మగం – తిరుపతి.

ప్రశ్న: వృద్ధులు, దివ్యాంగులు దర్శన టోకెన్ల కోసం ఎక్కువ సమయం వేచి ఉండాల్సి వస్తోంది?

ఈ.వో. వృద్ధులు, దివ్యాంగులకు ఉదయం 7 గంటల నుంచి టోకెన్లు జారీ చేస్తున్నాం. మధ్యాహ్నం వరకూ టోకెన్లు అందుబాటులో ఉంటాయి. ఉదయం నుంచి వేచియుండాల్సిన అవసరం లేదు.

9. సురేంద్ర – కడప

ప్రశ్న: నేను దివ్యాంగుడిని. లక్కీడిప్‌లో సుప్రభాతం వచ్చింది. దగ్గర నుంచి ఆలయంలోకి పంపండి?

ఈ.వో. మహాద్వారం వద్ద ఉన్న బయోమెట్రిక్‌ మార్గం ద్వారా అనుమతిస్తాం.

10. మునిసుబ్రమణ్యం – తిరుపతి

ప్రశ్న: పంచాంగంలో అక్షరాలు చిన్నవిగా ఉన్నాయి?

ఈ.వో. పరిశీలిస్తాం.

11. లక్ష్మీవేంకటేశ్వర్లు – తిరుపతి, సుబ్బయ్య – గుంటూరు, చందూ – విజయవాడ.

ప్రశ్న: వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని కారిడార్‌లో కొన్నిచోట్ల ద్వారాల వెడల్పు తక్కువగా ఉంది. దీంతో భక్తులు ఇబ్బంది పడుతున్నారు. శ్రీవారి మెట్టు వద్ద దర్శన టోకెన్ల జారీ కౌంటర్ల సంఖ్యను పెంచండి?

ఈ.వో. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్ట్‌మెంట్లలో భక్తులు తోపులాటలు లేకుండా దర్శనానికి వెళ్లేలా శాస్త్రీయమైన విధానాలను రూపొందిస్తున్నాం. కౌంటర్ల పెంపు విషయాన్ని పరిశీలిస్తాం.

12. కిషోర్‌ – రాజమండ్రి

ప్రశ్న: ఆన్‌లైన్‌ లక్కీడిప్‌లో సేవా టికెట్లు పొందిన భక్తులకు 6 నెలల వరకు తిరిగి అనుమతి లేదు. ఈ సమయాన్ని తగ్గించండి?

ఈ.వో. ఎక్కువమంది భక్తులు ఈ సమయాన్ని ఒక సంవత్సరానికి పెంచాలని కోరుతున్నారు. ఈ విషయాన్ని పరిశీలిస్తాం.

13. లవకుమార్‌్‌ – తిరుపతి

ప్రశ్న: విఐపి బ్రేక్‌ దర్శనాలు సామాన్యభక్తులు పొందడం ఎలా ?

ఈ.వో. బ్రేక్‌ దర్శన టికెట్లను చాలా వరకు తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నాం. ప్రముఖ రోజులలోనూ శ్రీవారి దర్శనానికి సామాన్య భక్తులకే మొదట ప్రాధాన్యం కల్పిస్తున్నాం.

14. బుచ్చిరెడ్డి – వరంగల్‌.

ప్రశ్న: అఖండ హరినామ సంకీర్తన వేదికను నాదనీరాజనం తరహాలో అభివృద్ధి చేయండి ?

ఈ.వో. త్వరలో నిర్ణయం తీసుకుంటాం.

15. ప్రశాంతి – విజయవాడ.

ప్రశ్న: తిరుమలలో శ్రీవారి నామాలు వినిపించండి ?

ఈ.వో. తప్పకుండా వినిపిస్తాం.

16. శ్రీనివాస్‌ – విజయవాడ

ప్రశ్న: సప్తగిరి అతిథి గృహం నిర్వహణ సరిగాలేదు, రథసప్తమి ముందు రోజు ఆన్‌లైన్‌లో గదులు కేటాయించండి?

ఈ.వో. సప్తగిరి అతిథి గృహాన్ని పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటాం. పర్వదినాల సమయంలో ఎక్కువమంది భక్తులు వచ్చే అవకాశం ఉండటంతో ఆన్‌లైన్‌లో గదులు కేటాయింపు ఉండదు.

17. రవికాంత్‌ – నెల్లూరు

ప్రశ్న: రద్దీ తక్కువ ఉన్న రోజుల్లో లఘు దర్శనం కల్పించండి, కరెంట్‌ బుకింగ్‌లో రూ.300/- టికెట్లు ఇవ్వండి?

ఈ.వో. భక్తుల రద్దీ రోజు రోజుకు పెరుగుతున్న తరుణంలో లఘు దర్శనం సాధ్యం కాదు. తిరుపతిలోని శ్రీనివాసం కాంప్లెక్స్‌లో రూ.300/- టికెట్లను కరెంట్‌ బుకింగ్‌లో భక్తులకు అందుబాటులో ఉంచాం.

ఈ కార్యక్రమంలో టిటిడి సివిఎస్‌వో శ్రీ ఎ.రవికృష్ణ, ప్రాజెక్టుల ప్రత్యేకాధికారి శ్రీ ఎన్‌.ముక్తేశ్వరరావు, చీఫ్‌ ఇంజినీర్‌ శ్రీచంద్రశేఖర్‌రెడ్డి, ఎస్‌ఇ-2 శ్రీ రామచంద్రారెడ్డి, విఎస్‌వోలు శ్రీ రవీంద్రారెడ్డి, శ్రీమతి సదాలక్ష్మీ, డిప్యూటీ ఈవోలు శ్రీ వేణుగోపాల్‌, శ్రీ ఈసీ శ్రీధర్‌, శ్రీమతి నాగరత్న ఇతర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.