TTD RELEASES OCTOBER ONLINE QUOTA OF KALYANOTSAVA TICKTES_ ఆన్ లైన్ కల్యాణోత్సవం టికెట్ల అక్టోబర్ కోటా విడుదల
Tirumala, 24 Sep. 20: TTD on Thursday has released, the online quota of Kalyanotsavam tickets for the month of October 2020.
However the Kalyanotsava will not be performed during Navaratri Brahmotsavams between October 16-25.
TTD has appealed to devotees to make note of the above while booking their online Kalyanotsava tickets.
The TTD has also provided the devotees with Srivari darshan facility within 90 days of their seva date.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
ఆన్ లైన్ కల్యాణోత్సవం టికెట్ల అక్టోబర్ కోటా విడుదల
తిరుమల, 2020 సెప్టెంబరు 24: అక్టోబర్ నెలకు సంబంధించిన శ్రీవారి ఆన్ లైన్ కల్యాణోత్సవం టికెట్ల కోటాను టిటిడి గురువారం ఆన్ లైన్లో విడుదల చేసింది.
అక్టోబర్ 16 నుంచి 24వ తేదీ వరకు శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు, అక్టోబరు 25న శ్రీవారి పార్వేట ఉత్సవం ఉన్న కారణంగా ఆ రోజుల్లో కళ్యాణోత్సవం ఉండదు. భక్తులు ఈ విషయాన్ని గమనించి ఆన్ లైన్లో కల్యాణోత్సవం టికెట్లు బుక్ చేసుకోవాలని కోరడమైనది.
టికెట్లు బుక్ చేసుకునే గృహస్తులకు ఉత్తరీయం, రవిక, అక్షింతలు, కలకండ ప్రసాదాన్ని తపాలా శాఖ ద్వారా వారి చిరునామాకు పంపడం జరుగుతుంది.
కాగా, ఆన్‌లైన్ కల్యాణోత్సవంలో పాల్గొనే గృహస్తులు(ఇద్దరు) టికెట్ బుక్ చేసుకున్న తేదీ నుండి 90 రోజుల్లోపు శ్రీవారిని దర్శించుకునే అవకాశాన్ని కూడా టిటిడి కల్పించింది.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.