TTD RELEASES ONLINE ARJITHA SEVA TICKETS_ ఆన్‌లైన్‌లో 70,512 శ్రీవారి ఆర్జితసేవా టికెట్లు విడుదల
Tirumala, 7.Dec: The on-line quota of Arjitha seva tickets for the month of March 2019 were released on Friday by TTD.
Out of 70,512 arjitha seva tickets that were released on Friday, 11,537 tickets in electronic dip while the remaining 58,975 under general category.
Electronic dip
Suprabhatam 8,182
Tomala 120
Archana 120
Astadala Pada Padmaradhana 240,
Nijapada 2,875
General Category
Visesha Puja 2,000
Kalyanam 14,725
Usual seva 4,650
Arjitha Brahmotsavam 7,700,
Vasanthotsavam 14,300
Sahasra Deepalankara Seva 15,600
ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI
ఆన్‌లైన్‌లో 70,512 శ్రీవారి ఆర్జితసేవా టికెట్లు విడుదల
డిసెంబరు 07, తిరుమల, 2018: శ్రీవారి ఆర్జిత సేవలకు సంబంధించి 2019, మార్చి నెల కోటాలో మొత్తం 70,512 ఆర్జితసేవా టికెట్లను శుక్రవారం ఉదయం 10 గంటలకు టిటిడి విడుదల చేసింది.
ఆన్‌లైన్ డిప్ విధానంలో 11,537 సేవా టికెట్లు ఉన్నాయి. ఇందులో సుప్రభాతం 8,182, తోమాల 120, అర్చన 120, అష్టదళపాదపద్మారాధన 240, నిజపాదదర్శనం 2,875 టికెట్లు ఉన్నాయి.
ఆన్‌లైన్ జనరల్ కేటగిరిలో 58,975 సేవాటికెట్లు ఉన్నాయి. వీటిలో విశేషపూజ 2,000, కల్యాణం 14,725, ఊంజల్‌సేవ 4,650, ఆర్జితబ్రహ్మోత్సవం 7,700, వసంతోత్సవం 14,300, సహస్రదీపాలంకారసేవ 15,600 టికెట్లు ఉన్నాయి.
ఎలక్ట్రానిక్ డిప్ కోసం డిసెంబరు 7వ తేదీ ఉదయం 10 గం||ల నుండి డిసెంబరు 11వ తేదీ ఉదయం 10 గం||ల వరకు నమోదు చేసుకోవచ్చు. డిసెంబరు 11వ తేదీ మధ్యాహ్నం 12గం||లకు ఎలక్ట్రానిక్ డిప్ తీస్తారు. డిసెంబరు 11వ తేదీ మధ్యాహ్నం 12 గం||ల నుండి 14వ తేదీ మధ్యాహ్నం 12 గం||ల వరకు నగదు చెల్లించేందుకు గడువు ఉంటుంది. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని టిటిడి కోరుతోంది.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.