TTD SECURITY ACTIVITIES BRIEFED TO TRAINEE IPS OFFICERS _ టిటిడి భద్రతా వ్యవస్థపై ట్రైనీ ఐపీఎస్ లకు అవగాహన
Tirumala, 31 Mar. 21: Two dozen trainee IPS officers hailing from different states across the country including two women police officers from Nepal were briefed on TTD policing activities.
Chairing the session jointly, both TTD Chief Vigilance and Security Officer Sri Gopinath Jatti along with Tirupati Urban SP Sri Venkatappala Naidu briefed the Trainee IPS officers on TTD Vigilance and Security system and Policing in the district with a special focus on Tirumala respectively.
The briefing session was held at Annamaiah Bhavan in Tirumala on Wednesday evening. Earlier the IPS trainees went on a field visit to Vaikuntam Queue Complex, temple, laddu counters etc. and observed the checking, scrutiny and foolproof security set up adopted by TTD.
VGOs Sri Bali Reddy, Sri Prabhakar and Tml DSP Sri Prabhakar was also present.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
టిటిడి భద్రతా వ్యవస్థపై ట్రైనీ ఐపీఎస్ లకు అవగాహన
తిరుమల, 2021 మార్చి 31: దేశంలోని వివిధ రాష్ట్రాల నుండి విచ్చేసిన 24 మంది ట్రైనీ ఐపిఎస్ అధికారులకు టిటిడి సీవీఎస్వో శ్రీ గోపీనాథ్ జెట్టి, అర్బన్ ఎస్పీ శ్రీ వెంకట అప్పలనాయుడు కలిసి భద్రతా వ్యవస్థ పై బుధవారం సాయంత్రం అవగాహన కల్పించారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో ఈ కార్యక్రమం జరిగింది. ట్రైనీ ఐపిఎస్ ల బృందంలో నేపాల్ కు చెందిన ఇద్దరు మహిళా అధికారులు ఉన్నారు.
ఈ సందర్భంగా టిటిడి నిఘా మరియు భద్రతా విభాగం కార్యకలాపాలు, తిరుమల భద్రతకు సంబంధించి అర్బన్ పోలీసులు తీసుకునే చర్యలను వివరించారు.
అంతకుముందు ట్రైనీ ఐపీఎస్ అధికారులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్, శ్రీవారి ఆలయం, లడ్డూ కౌంటర్లు తదితర ప్రదేశాలను పరిశీలించారు. ఆయా ప్రాంతాల్లో భక్తుల భద్రతకు సంబంధించి టిటిడి అవలంబిస్తున్న విధానాలను పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో విజిఓ శ్రీ బాలిరెడ్డి ఉన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.