TTD SETS UP 30 COUNTERS TO ISSUE SSD TOKENS _ తిరుపతిలో నవంబరు 1 నుండి సర్వదర్శనం టైంస్లాట్ టోకెన్ల జారీ – ఏర్పాట్లను పరిశీలించిన ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి
SSD TOKENS FROM MIDNIGHT ONWARDS-TTD EO
TOKENS FOR SAME DAY DARSHAN TO BE ISSUED
TIRUPATI, 31 OCTOBER 2022: TTD has set up 30 counters with 10 counters each at Bhudevi Complex, Srinivasam and IINC in Tirupati to issue Slotted Sarva Darshanam (SSD) from November 1 onwards, said TTD EO Sri AV Dharma Reddy.
Speaking to the media after inspecting counters in Tirupati on Monday evening, the EO said, following the decision in TTD Trust Board during last meeting, it has been decided to resume issuance of SSD tokens to devotees in Tirupati everyday till the prescribed quota exhausts for the day.
He said, the devotees will get darshan only on the scheduled time on their tokens. Those who did not get tokens will have to go to Vaikuntham 2 and wait in compartments and queue lines till their turn for darshan.
“As informed earlier, on Saturdays, Sundays and Mondays 25000 tokens will be issued while on remaining days 15000 tokens. The issuance of tokens will commence from midnight onwards that is from 00:00H of November 1 and
ID cards to book for darshan tokens is mandatory”, he maintained.
JEO Sri Veerabrahmam, EEs Sri Krishna Reddy, Sri Muralikrishna, Smt Sumati, DyEO Sri Ramesh Babu, CIO Sri Sandeep, VGO Sri Manohar and others were also present.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
తిరుపతిలో నవంబరు 1 నుండి సర్వదర్శనం టైంస్లాట్ టోకెన్ల జారీ – ఏర్పాట్లను పరిశీలించిన ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి
అక్టోబరు 31, తిరుపతి 2022: తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం కాంప్లెక్స్, గోవిందరాజస్వామి సత్రాల వద్ద మంగళవారం నుంచి ప్రయోగాత్మకంగా సర్వదర్శనం టైంస్లాట్ టోకెన్ల జారీ ప్రక్రియ పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో టిటిడి ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి, జెఈవో శ్రీ వీరబ్రహ్మం, ఇతర అధికారులతో కలిసి సోమవారం సాయంత్రం ఏర్పాట్లను పరిశీలించారు. టోకెన్ల జారీ కౌంటర్లు, క్యూలైన్లు, భక్తులకు కల్పించాల్సిన సదుపాయాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా భూదేవి కాంప్లెక్స్ వద్ద ఈవో మీడియాతో మాట్లాడుతూ టిటిడి ధర్మకర్తల మండలి నిర్ణయం మేరకు మంగళవారం నుంచి ప్రయోగాత్మకంగా తిరుపతిలో ఉచిత సర్వదర్శనం టైంస్లాట్ టోకెన్ల జారీని పునఃప్రారంభిస్తున్నామని చెప్పారు. శని, ఆది, సోమవారాల్లో 25 వేల టోకెన్లు, మిగతా రోజుల్లో రోజుకు 15 వేల టోకెన్లు జారీ చేస్తామన్నారు. టోకెన్ లభించిన భక్తుడు అదేరోజు దర్శనం చేసుకునేలా ఏర్పాటు చేసినట్టు చెప్పారు. మూడు ప్రాంతాల్లో 30 కౌంటర్ల ద్వారా టోకెన్లు జారీ చేస్తామని, నిర్దేశిత కోటా పూర్తవగానే కౌంటర్లు మూసివేస్తామని వివరించారు. టోకెన్లు దొరకని భక్తులు నేరుగా తిరుమల చేరుకుని వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2 ద్వారా స్వామివారిని దర్శించుకోవడానికి అవసరమైన ఏర్పాట్లు చేశామన్నారు. టోకెన్ల జారీ ప్రక్రియలో ఎదురయ్యే లోటుపాట్లను సరిదిద్దుకుంటూ క్రమంగా టోకెన్ల సంఖ్యను పెంచుతామని తెలిపారు. ఆధార్ నమోదు చేసుకుని టోకెన్లు జారీ చేయడం వల్ల భక్తులు దర్శనం చేసుకున్నా, చేసుకోకపోయినా నెలకు ఒకసారి మాత్రమే టోకెన్ పొందే అవకాశం ఉంటుందన్నారు.
తిరుమలలో వసతికి సంబంధించి ఒత్తిడి తగ్గించడం కోసం డిసెంబర్ 1వ తేదీ నుంచి శ్రీవాణి ట్రస్ట్ దాతలకు తిరుపతిలోని మాధవంలో ఆఫ్ లైన్ టికెట్లు జారీ చేస్తామని, అక్కడే గదులు కేటాయిస్తామని చెప్పారు.
ఈవో వెంట ఎస్ఈ (ఎలక్ట్రికల్) శ్రీ వెంకటేశ్వర్లు, శ్రీవారి ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ రమేష్‌బాబు, విజివో శ్రీ మనోహర్, ఈ ఈలు శ్రీ మురళీ కృష్ణ ,శ్రీమతి సుమతి ,శ్రీ కృష్ణారెడ్డి, చీఫ్ ఇన్‌ఫర్మేషన్ ఆఫీసర్ శ్రీ సందీప్ తదితరులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.