TTD SUSPENDS ASST. TECHNICIAN FOR BROADCAST OF OTHER CHANNELS _ తిరుమలలో ఇతర చానళ్ళ ప్రసారాల సంఘటనపై అసిస్టెంట్ టెక్నిషియన్ సస్పెన్షన్
– AE GIVEN SHOW CAUSE NOTICE
Tirumala, 25 April 2022: TTD has suspended a Grade-1 Assistant technician Sri P Ravi Kumar, holding him responsible for broadcasting three other channels on Five LED screens of at Tirumala on April 22 between 5.12pm and 6.12 pm.
While the suspension orders of Ravi Kumar were issued on Sunday show cause notice was also issued to Sri AVV Krishna Prasad, Assistant engineer of the Radio & Broadcasting wing of TTD.
TTD EO Dr KS Jawahar Reddy reacted strongly on the incident and directed the CVSO Sri Narasimha Kishore to investigate and submit a report immediately.
In this connection, the vigilance officials inspected the footage in the control room at Asthana Mandapam and Command Control Room and CC cameras of PAC-4 and also other concerned TTD employees.
They identified that Assistant Technician Ravi Kumar and his friend Gopikrishna entered the TV section control room of Radio and broadcasting wing. It was identified that when all the staff members left Gopikrishna had alone remained in the control room till 5.28 pm during the period in which the incident occurred.
Thereafter suspension orders were slapped on Ravi Kumar and show cause notice was issued to Assistant Engineer AVV Krishna Prasad.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
తిరుమలలో ఇతర చానళ్ళ ప్రసారాల సంఘటనపై అసిస్టెంట్ టెక్నిషియన్ సస్పెన్షన్
– ఏఈకి షోకాజ్ నోటీసు
తిరుమల, 2022 ఏప్రిల్ 25: తిరుమలలోని ఎస్వీబిసికి చెందిన ఐదు ఎల్ఈడి స్క్రీన్‌లలో ఏప్రిల్ 22వ తేదీ సాయంత్రం 5.12 గంటల నుండి 6.12 గంటల వరకు మూడు ఇతర చానళ్ళ కార్యక్రమాలు ప్రసారమైన సంఘటనకు బాధ్యుడైన గ్రేడ్ – 1 అసిస్టెంట్ టెక్నిషియన్ శ్రీ పి.రవికుమార్‌ను సస్పెండ్ చేస్తూ ఏప్రిల్ 24వ తేదీ టీటీడీ ఉత్తర్యులు జారీ చేసింది.
రేడియో అండ్ బ్రాడ్ కాస్టింగ్ విభాగానికి చెందిన అసిస్టెంట్ ఇంజినీర్ శ్రీ ఎవివి.కృష్ణ ప్రసాద్‌కు షోకాజ్ నోటిసు జారీ చేసింది.
తిరుమలలో ఏప్రిల్ 22వ తేదీ సాయంత్రం ఎస్వీబిసికి చెందిన ఎల్ఈడి స్క్రీన్‌లలో ఇతర చానళ్ళ కార్యక్రమాలు ప్రసారమైన సంఘటనపై టీటీడీ ఈవో డాక్టర్ కె.ఎస్.జవహర్‌రెడ్డి వెనువెంటనే స్పందించారు. ఈ సంఘటనపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని సివిఎస్వో శ్రీ నరసింహ కిషోర్‌ను ఆదేశించారు. ఈ మేరకు సంబంధిత విజిలెన్స్ అధికారులు తిరుమల ఆస్థాన మండపంలోని బ్రాడ్ కాస్టింగ్ విభాగం కంట్రోల్ రూం, కమాండ్ కంట్రోల్ రూం సెంటర్, పిఏసి – 4లోని సిసి టివి ఫుటేజ్‌లను పరిశీలించి సంబంధిత అధికారులు, సిబ్బందిని విచారించారు. సంఘటన జరిగిన సమయంలో అసిస్టెంట్ టెక్నిషియన్ శ్రీ పి.రవికుమార్ కర్నూల్‌కు చెందిన తన స్నేహితుడు శ్రీ గోపిక్రిష్ణతో కలిసి బ్రాడ్ కాస్టింగ్ టివి సెక్షన్ కంట్రోల్ రూంలోకి ప్రవేశించారని గుర్తించారు. కొంత సమయం తరువాత శ్రీ రవికుమార్‌తో పాటు అక్కడి ఉద్యోగులు అందరు బయటకి వచ్చారని సాయంత్రం 5.28 గంటల వరకు శ్రీ గోపికృష్ణ మాత్రమే కంట్రోల్ రూంలో ఉన్నట్లు గుర్తించారు. ఈ సమయంలోనే ఈ సంఘటన జరిగినట్లు విచారణలో నిర్థారణ అయింది.
ఈ మేరకు శ్రీ పి.రవికుమార్‌ను సస్పెండ్ చేయడం జరిగింది.అసిస్టెంట్ ఇంజినీర్ శ్రీ ఎవివి.కృష్ణ ప్రసాద్‌కు షోకాజ్ నోటిసు జారీ చేయడమైనది.
టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.