TTD TAKES UP WIDE PUBLICITY FOR SIXTH PHASE OF STATE WIDE KALYANAMASTU _ రాష్ట్రవ్యాప్త 6వ విడత కల్యాణమస్తుపై తితిదే విస్తృత ప్రచారం 

TIRUPATI, MAY 2:  With the sixth phase of state-wide free mass marriages programme by TTD, “Kalyanamastu” set ready to take place on May 20, the temple management has intensified its campaign and deputed its top grade officials to all the 23 districts to take up a massive awareness programme since last one week.

  The important officials deputed by TTD includes Joint EO of Tirumala, FACAO, CVSO, PRO, CE, SE-1 and HDPP secretary.  For Medak, Ranga Reddy, Hyderabad, Warangal and Nalgonda districts, Tirumala Joint EO Sri KS Srinivasa Raju has taken up the campaigning task while for Kurnool and Anantapur district, the FACAO has been deputed for the purpose. In Srikakulam, Vijayanagaram, Visakhapatnam, East Godavari and Guntur districts, the Chief Vigilance and Security Officer of TTD Sri MK Singh taken up the awareness programmes on Kalyanamastu while in Krishna, West Godavari, Guntur districts the PRO of TTDs Sri T.Ravi took up the task. The Chief Engineer of TTD Sri Chandra Sekhara Reddy has been deputed to Nellore, Prakasam and Khammam districts for campaign while SE-I took part in the awareness programme at Chittoor and Kadapa districts. The secretary of Hindu Dharma Prachara Parishad Sri K.Venkat Reddy has been deputed to take up the awareness campaign in Mehaboobnagar, Karimnagar, Adilabad and Nizamabad districts.

  Meanwhile on April 27 the Kalyanamastu awareness campaign has taken place at Medak, Srikakulam and Kurnool districts, on April 28 in Ranga Reddy, Hyderabad, Mehaboobnagar, Vijayanagaram, Anantapur and Nellore districts, on April 29 in Warangal, Visakhapatnam, Kadapa, Prakasam and Karimnagar districts, on April 30 at Nalgonda, East Godavari and Chittoor districts, on May 1 at Adilabad, Khammam and West Godavari districts, while on May 2 at Nizamabad, Krishna and Guntur districts. 

 The officials deputed by TTD to the respective districts have not only co-ordinated with district officials but also took up the awareness campaign in a massive way by involving district officials and elected representatives of the respective districts. The TTD officials during their campaigns have asked tehsildars, MPDOs, anganwadis and village organisations to give wide publicity, and motivate the eligible poor to utilise the opportunity.  The public were told that the last date of submission of applications along with age proof and a letter of consent from parents concerned is May 15.

  The campaign emphasised that brides willing to marry must complete 18 years of age and the groom must be 21 years at the time of marriage. The TTD officials educated the people that “Kalyanamastu” is a marriage performed with the divine blessings of Lord Venkateswara since the talibottu given to the bride would be kept at the golden feet of Lord Venkateswara to seek His blessings. The officials said that TTD would be supplying a pair of thalibottu, mattelu and new clothes besides free food to 60 participating members of each newly-wed couple. 

  Apart from the officers TTD has also appointed an in-charge and a co-ordinator for each district to supervise the sixth phase of Kalyanamastu.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

 
 

రాష్ట్రవ్యాప్త 6వ విడత కల్యాణమస్తుపై తితిదే విస్తృత ప్రచారం

తిరుపతి, మే 02, 2011: తిరుమల తిరుపతి దేవస్థానము ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన మహోన్నత కార్యక్రమం – కల్యాణమస్తు 6వ విడత ఉచిత సామూహిక వివాహాలు మే 20వ తారీఖున రాష్ట్రవ్యాప్తంగా జరుగనున్న నేపధ్యంలో ప్రచార కార్యక్రమాలను తితిదే ముమ్మరంచేసింది.

 
తితిదేకి చెందిన ఏడుగురు అత్యున్నత స్థానాల్లోని అధికారులను వివిధ జిల్లాలకు పర్యవేక్షకులుగా నియమించి వారితో ఆయా జిల్లాల్లో విస్తృత స్థాయి ప్రచారాలను చేపట్టినది. అందులో భాగంగా తిరుమల జె.ఇ.ఓ. శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు మెదక్‌, రంగారెడ్డి హైదరాబాదు, వరంగల్లు, నల్గొండ జిల్లాల్లో పర్యటించి కల్యాణమస్తు అవగాహన కార్యక్రమాల్లో పాల్గొని ప్రచారం చేసారు. ఇక ముఖ్య భద్రతా మరియు నిఘాధికారి శ్రీ యమ్‌.కె.సింగ్‌ శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, గుంటూరు జిల్లాల్లో ప్రచారం చేయగా, అర్థిక – గణాంకాధికారి శ్రీ భాస్కర్‌రెడ్డి కర్నూలు, అనంతపురం జిల్లాల్లో అవగాహనా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తితిదే ప్రజాసంబంధాల అధికారి శ్రీ టి.రవి కృష్ణా, పశ్చిమగోదావరి, గుంటూరు జిల్లాల్లో పాల్గోని ప్రచారం చేసారు. తితిదే ఛీఫ్‌ ఇంజనీరు శ్రీ చంథ్రేఖర్‌రెడ్డి నెల్లూరు, ప్రకాశం, ఖమ్మం జిల్లాల్లో అవగాహనా సదస్సుల్లో పాల్గొన్నారు. యస్‌.ఇ.-1 శ్రీ సుధాకర్‌ కడప, చిత్తూరు జిల్లాల్లో అవగాహనా సదస్సుల్లో పాల్గొన్నారు. ఇక హిందూధర్మప్రచార పరిషత్‌ కార్యదర్శి శ్రీ కసిరెడ్డి వెంకటరెడ్డి మహబూబ్‌నగర్‌, కరీంనగర్‌, అదిలాబాద్‌, నిజామాబాద్‌లల్లో కల్యాణమస్తు అవగాహనా సదస్సులను నిర్వహించారు.
 
కాగా ఈ అవగాహనా సదస్సులు ఏప్రిల్‌ 27 నుండి మే 2వ తారీఖు వరకు రాష్ట్రములోని 23 జిల్లాల్లో నిర్వహించడం జరిగినది. అందులో భాగంగా ఏప్రిల్‌ 27న మెదక్‌, శ్రీకాకుళం, కర్నూలు జిల్లాలు, ఏప్రిల్‌ 28న రంగారెడ్డి, హైదరాబాదు, మహబూబ్‌నగర్‌, విజయనగరం, అనంతపురం, నెల్లూరు ఏప్రిల్‌ 29న వరంగల్‌, వైజాగ్‌, కడప, ప్రకాశం, ఏప్రిల్‌ 30న కరింనగర్‌, నల్గొండ, తూర్పుగోదావరి, చిత్తూరు, మే 1న అదిలాబాద్‌, ఖమ్మం, గుంటూరు, పశ్చిమగోదావరి మే 2న కృష్ణా, నిజామాబాద్‌ జిల్లాల్లో ఈ అవగాహనా సదస్సులు జరిగాయి.
 
ఈ అవగాహనా సదస్సులో పాల్గొన్న తితిదే అధికారులు ఆయా ప్రాంతాలలోని శాసనసభ్యులతోను, జిల్లా కలెక్టర్లతోను, ఇతర అధికారులతోను సమన్వయం గావించుకొంటూ 6వ విడత కల్యాణమస్తులో ఎక్కువ మంది పేద జంటలు స్వామి కృపాకటాక్షాలతో దంపతులయ్యేందుకు విశేష కృషి చేస్తున్నారు. ఈ అవగాహనా సదస్సుల్లో వారు కల్యాణమస్తు ముఖ్యోద్ధేశ్యాన్ని, ఇందులో పేరు నమోదుచేసుకొనే జంటలు అనుసరించాల్సిన నియమ నిబంధనలను చక్కగా విశదీకరించారు.
 
సాక్షాత్తు శ్రీ వేంకటేశ్వరస్వామి పాదాలచెంత వుంచిన తాళిబొట్లను పెళ్ళికుమార్తెకు అందించడం జరుగుతుందని వారు ప్రచారం చేసారు. అంతేకాకుండా కల్యాణమస్తును సవ్యంగా నిర్వహించడానికి పెళ్లికుమారునికి 21 సంవత్సరములు, పెళ్లికుమార్తెకు 18 సంవత్సరములు పూర్తి అయినట్లు తెలిపే ధృవీకరణపత్రాలు, వారి తల్లిదండ్రుల వివాహ అంగీకార పత్రాలను కల్యాణమస్తులో తమ పేర్లను నమోదుచేసుకొనే సమయాన చూపించవలసి వుంటుందని వారు ప్రజలకు తెలిపారు. కాగా కల్యాణమస్తు దరఖాస్తునకు చివరి తేది మే15 అని వారు తెలిపారు.
 
కల్యాణమస్తు కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి ఆయా జిల్లాల్లోని ఐ.కె.పి., అంగన్‌వాడి, మహిళా సంఘాలు, ఇతర స్వచ్ఛందసేవాసంస్థలు, ఇతర జిల్లా యంత్రాంగం కలిసికట్టుగా పనిచేసి ప్రజలను ఈ కార్యక్రమంపట్ల చైతన్యవంతులను గావించాలని వారు పిలుపునిచ్చారు.
 
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.