TTD TEACHERS’ TO GET EXPERT TRAINING _ టిటిడి పాఠశాలల ఉపాధ్యాయులకు రిషివ్యాలీ విద్యా నిపుణులతో ప్రత్యేక శిక్షణ
TIRUPATI, 09 NOVEMBER 2022: The teaching faculty of all Primary Classes in TTD run institutions are being given training with expert teachers from Rishi Valley in the respective institutions on Wednesday.
Multi Grade multi level teaching, Activity based learning etc.and other teaching techniques which helps the children to easily learn the subject.
TTD DEO Sri Bhaskar Reddy and SVETA Director Smt Prasanti Rishi Valley former and present Directors for imparting teaching techniques to the TTD faculty.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
టిటిడి పాఠశాలల ఉపాధ్యాయులకు రిషివ్యాలీ విద్యా నిపుణులతో ప్రత్యేక శిక్షణ
తిరుపతి, 2022 నవంబరు 09: టిటిడి ప్రాథమిక పాఠశాలల్లో విద్యాబోధనను మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ఉపాధ్యాయులకు రిషి వ్యాలీ పాఠశాలలోని విద్యా నిపుణులతో బుధవారం ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఈ శిక్షణా కార్యక్రమంలో రిషీవ్యాలీ విద్యా సంస్థల రూరల్ ఎడ్యుకేషన్ సెంటర్ పూర్వ, ప్రస్తుత డైరెక్టర్లు పాల్గొన్నారు.
మల్టీ గ్రేడ్ మల్టీ లెవెల్ టీచింగ్, యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ బోధనోపకరణాలు, స్కూల్ ఇన్ ఏ బాక్స్ పద్ధతులను ఉపయోగించి విద్యార్థులకు ప్రత్యక్షంగా ఏవిధంగా బోధించాలనే విషయాలపై శిక్షణ ఇచ్చారు. ఇలాంటి బోధనా పద్ధతుల ద్వారా విద్యార్థులు తక్కువ సమయంలో, అన్ని పాఠ్యాంశాలను అవగాహన చేసుకుంటూ, నేర్చుకునేందుకు దోహదపడుతుందన్నారు. దీనివల్ల తరగతి గదులలో బోధన సులభతరమవుతుందని ఉపాధ్యాయులు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.
ఈ శిక్షణా తరగతులకు విచ్చేసి విలువైన సలహాలు, సూచనలను ఇచ్చిన రిషి వ్యాలీ విద్యాసంస్థల విద్యా నిపుణులకు టిటిడి విద్యాశాఖ అధికారి శ్రీ ఎం భాస్కర్ రెడ్డి, శ్వేత డైరెక్టర్ శ్రీమతి ప్రశాంతి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు.
టిటిడి ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.