TTD TEMPLES GETTING READY FOR OPENING OUTSIDE_ ‘డయల్‌ యువర్‌ ఈవో’ ముఖ్యాంశాలు

Tirumala, 4 January 2019: Sri Venkateswara Swamy temples coming up in different states are hearing up for opening this year, said TTD EO Sri Anil Kumar Singhal.

After Dial your EO at Annamayya Bhavan in Tirumala, the EO talking to media said, while the Maha Kumbhabhishekam at Kanya kumari temple is on January 27, the one at Hyderabad is fixed on March13.

He said, Rs.100 crores have been sanctioned under master plan of Vonti mitta temple. Out of 60.65crores grant, so far Rs.15.70lakhs worth works have been completed another 9crores works under pipeline, Rs.36 crores works to be carried out. Remaining 40crores to develop a project which is under negotiation.

The EO said with the introduction of online booking of accommodation and anitha seva tickets for local temples including sri Padmavathi Ammavari temple, Sri Srinivasa and Sri Suryanarayana Swamy temple at Tiruchanoor, Appalayagunta and Srinivasa Mangapuram yielding huge response from devotees.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs TIRUPATI

‘డయల్‌ యువర్‌ ఈవో’ ముఖ్యాంశాలు

జనవరి 04, తిరుమల 2019: తిరుమలలోని అన్నమయ్య భవనంలో శుక్రవారం జరిగిన డయల్‌ యువర్‌ ఈవో కార్యక్రమంలో ముందుగా టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ భక్తులను ఉద్దేశించి ప్రగించారు. ఆ వివరాలు.

జనవరి 27న కన్యాకుమారిలో శ్రీవారి ఆలయ విగ్రహప్రతిష్ఠ, మహాకుంభాభిషేకం: తమిళనాడు రాష్ట్రంలోని కన్యాకుమారిలో రూ.22.50 కోట్లతో నూతనంగా నిర్మించిన శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయంలో జనవరి 27వ తేదీన విగ్రహప్రతిష్ఠ, మహాకుంభాభిషేకం నిర్వహిస్తాం.

– మార్చి 13న హైదరాబాద్‌లో శ్రీవారి ఆలయ విగ్రహప్రతిష్ఠ జరుగనుంది.

ప్రత్యేక దర్శనాలు : జనవరి 8, 22వ తేదీల్లో వ ద్ధులు, దివ్యాంగులకు దర్శనం కల్పిస్తాం.

– జనవరి 9, 23వ తేదీల్లో 5 ఏళ్ల లోపు చంటిపిల్లల తల్లిదండ్రులకు దర్శనం కల్పిస్తాం.

ఒంటిమిట్టలోని శ్రీకోదండరామాలయం : పురాతన ప్రాశస్త్యం గల ఒంటిమిట్టలోని శ్రీకోదండ రామాలయాన్ని 2015, సెప్టెంబరు 9న టిటిడి పరిధిలోకి తీసుకోవడం జరిగింది.

– ఈ ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు రూ.100 కోట్లతో మాస్టర్‌ప్లాన్‌ రూపొందించాం. ఇందులో రూ.60.65 కోట్లతో వివిధ రకాల అభివృద్ధి పనులు చేపట్టాం.

– ఆలయంలో అభివృద్ధి పనుల కోసం ఇప్పటివరకు రూ.15.70 కోట్లు ఖర్చు చేశాం.

– రూ.9 కోట్లతో ఆలయం వద్ద వాహనమండపం, మహారథం మరమ్మతులు, వేచి ఉండే గదులు, టికెట్‌ కౌంటర్లు, నూతన ధ్వజస్తంభం, కార్యాలయ భవనం, వసతి భవనం నిర్మాణ పనులు జరుగుతున్నాయి.

– రూ.36 కోట్ల వ్యయంతో శాశ్వత కల్యాణవేదిక నిర్మాణంతోపాటు అక్కడ మరుగుదొడ్లు, వంటగదులు, పార్కింగ్‌ స్థలాలు, ప్రహరీ నిర్మాణం, ప్రవేశ ఆర్చి, నీటి వసతి, లైటింగ్‌ తదితర పనులు చేపడతాం.

– ఆలయ నిర్మాణం దెబ్బతినకుండా గోపురాల పునరుద్ధరణ, ఫ్లోరింగ్‌, లైటింగ్‌ ఏర్పాటు పనుల కోసం పురావస్తు శాఖతో ఒప్పందం కుదుర్చుకున్నాం.

ఆన్‌లైన్‌లో టిటిడి స్థానికాలయాల ఆర్జితసేవా టికెట్లు :

– భక్తుల సౌకర్యార్థం తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం, శ్రీనివాస మంగాపురంలోని శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయం, అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయం, తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం, శ్రీ శ్రీనివాస ఆలయం, శ్రీసూర్యనారాయణస్వామివారి ఆలయాల్లో ఆర్జితసేవా టికెట్లను ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకునే అవకాశం కల్పించాం. వీటికి భక్తుల నుండి విశేష స్పందన లభిస్తోంది.

– సర్వదర్శనం టైంస్లాట్‌, ఆన్‌లైన్‌లో ఆర్జితసేవల బుకింగ్‌, రూ.300/- టికెట్ల బుకింగ్‌ సౌకర్యం కల్పించడం వల్ల భక్తులు ముందస్తుగా ప్రణాళిక రూపొందించుకుని తిరుమల యాత్రకు వస్తున్నారు.

తిరుచానూరులో గదులకు ఆన్‌లైన్‌ బుకింగ్‌ సౌకర్యం :

– తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి దర్శనార్థం వచ్చే భక్తుల కోసం తోళప్పగార్డెన్‌లో మొత్తం 30 గదులు(ఏసి 19, నాన్‌ ఏసి 11) అందుబాటులో ఉన్నాయి. డిసెంబరు 20వ తేదీ నుండి ఆన్‌లైన్‌లో భక్తులు బుక్‌ చేసుకునేందుకు 20 గదులు(ఏసి 14, నాన్‌ ఏసి 6) అందుబాటులో ఉంచాం. ఈ గదులను ప్రతిరోజూ 100 శాతం భక్తులు వినియోగించుకుంటున్నారు.

టిటిడి డైరీలు, క్యాలెండర్లు :

– 2019లో ముద్రించిన డైరీలు, క్యాలెండర్లలో ఇప్పటివరకు దాదాపు 80 వేలను(12 పేజీల క్యాలెండర్లు 41,560, పెద్ద డైరీలు 27,552) భక్తులు ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకున్నారు.

– టిటిడి సమాచార కేంద్రాల్లో డైరీలు, క్యాలెండర్లు దొరకని పక్షంలో ఆన్‌లైన్‌లో భక్తులు బుక్‌ చేసుకోవచ్చు.

వైకుంఠ ఏకాదశి, ద్వాదశి :

– తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబరు 18న వైకుంఠ ఏకాదశినాడు 75 వేలు, ద్వాదశినాడు 92 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఈ పర్వదినాల్లో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా విస్తృతంగా ఏర్పాట్లు చేశాం.

– ఇదేస్ఫూర్తితో ఫిబ్రవరి 12న రథసప్తమినాడు విచ్చేసే భక్తులకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేపడతాం. భక్తులు గ్యాలరీల్లో చివరలో కూర్చున్నప్పటికీ ఎలాంటి అడ్డంకులు లేకుండా స్పష్టంగా వాహనసేవలు తిలకించేలా అవకాశం ఉన్నంతవరకు షెడ్లు ఏర్పాటుచేస్తాం.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.