CETPERCENT UTILIZATION OF NON CONVENTIONAL ENERGY SOURCES IN NEXT THREE YEARS-EO_ ఆన్‌లైన్‌లో 63,311 శ్రీవారి ఆర్జితసేవా టికెట్లు విడుదల :’డయల్‌ యువర్‌ ఈవో’లో టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌

Tirumala, 4 January 2019: The TTD will go for cent percent utilization of non conventional sources of energy in the next two or three years said TTD EO Sri Anil Kumar Singhal.

While answering the pilgrim callers during Dial your EO program held at Annamayya Bhavan in Tirumala, the EO told Sri Lakshman from Bengaluru who suggested on non conventional sources of energy, the EO said, TTD is already utilizing wind mills and solar energies. We are also negotiating on Rooftop solar power generation. In next two or three years TTD will reach 100% on non conventional energy utility, he asserted.

Later a pilgrim caller Sri KVN Sharma suggested EO to display the TTD publications whenever there are book fairs and festivals. In Vijayawada, right now a huge expo is underway. When other faiths are selling their publications at discount rates, I have not even seen TTD book stall. Replying the caller, EO said, hid suggestion is well taken. However the EO cleared him that TTD will never sell it’s publications on profits. Even our discounts is on cost of the book only but not profit. In online all our publications are free for download, he added.

A pilgrim caller Sri Rama Rao from Tadikal brought to the notice of EO the delay in Sarva Darshanam and the hardships the pilgrims faced during his visit to Tirumala on December 24. He also suggested EO to keep more luggage counters. Answering the caller EO said his suggestion will be looked into.

Sri Mukunda from Bengaluru suggested EO to operate the pilgrim queue lines from Varaha Swamy temple for which EO answered it is not feasible for operation.

When Sri DVR Sharma from Visakhapatnam sought EO to reduce the waiting hours for aged to which EO responded that already TTD is issuing 1400 tokens every day for this category of pilgrims and 4000 tokens on any two lean days in a month. There is no need to wait for long hours now, he informed.

Smt.Lavanya from nellore urged EO to reduce the waiting hours for pedeatrian pilgrims for which EO said, TTD is issuing 14 thousand tokens in Alipiri and 6000 tokens in Srivari Mettu footpath routes every day to avoid inconvenience to pedestrian pilgrims.

Sri Satish Kumar from Hyderabad, Smt Yasodha from Bengaluru asked EO about not getting online sevas in lucky dip to which EO said, for 5000 seva tickets 1,50,000 pilgrims are trying in online and he suggested them to keep on trying.

Tirupati JEO Sri P Bhaskar, CVSO Sri Gopinath Jetti and other senior officers were also present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs TIRUPATI

ఆన్‌లైన్‌లో 63,311 శ్రీవారి ఆర్జితసేవా టికెట్లు విడుదల :’డయల్‌ యువర్‌ ఈవో’లో టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌

జనవరి 04, తిరుమల 2019: శ్రీవారి ఆర్జిత సేవలకు సంబంధించి ఏప్రిల్‌ నెల కోటాలో మొత్తం 63,311 టికెట్లను శుక్రవారం ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేసినట్లు టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ తెలిపారు. ఆన్‌లైన్‌ డిప్‌ విధానంలో 10,061 సేవా టికెట్లు విడుదల చేశామని, ఇందులో సుప్రభాతం 7,836, తోమాల 130, అర్చన 130, అష్టదళపాదపద్మారాధన 240, నిజపాద దర్శనం 1,725 టికెట్లు ఉన్నాయని ప్రకటించారు. ఆన్‌లైన్‌లో జనరల్‌ కేటగిరిలో 53,250 సేవాటికెట్లు ఉండగా, వీటిలో విశేషపూజ 2,500, కల్యాణం 11,875, ఊంజల్‌సేవ 3,750, ఆర్జితబ్రహ్మోత్సవం 6,875, వసంతోత్సవం 12,650, సహస్రదీపాలంకారసేవ 15,600 టికెట్లు ఉన్నాయని వివరించారు.

తిరుమలలోని అన్నమయ్య భవనంలో శుక్రవారం డయల్‌ యువర్‌ ఈవో కార్యక్రమం జరిగింది. ఇందులో పలువురు భక్తులు అడిగిన ప్రశ్నలకు ఈవో సమాధానాలు ఇచ్చారు.

1. రామారావు – తాడికల్లు.

ప్రశ్న : శ్రీవారి దర్శనానికి క్యూలైన్లలో ఎక్కువ సమయం వేచియుండాల్సి వస్తోంది. దర్శనానికి పట్టే సమయాన్ని ముందుగా ప్రకటించండి. లగేజీ కౌంటర్లు పెంచండి. టైంస్లాట్‌ సర్వదర్శనం టోకెన్లు మరిన్ని పెంచండి. కంపార్ట్‌మెంట్ల నుంచి వెలుపలికి వచ్చిన తర్వాత ఉన్న క్యూలలో మరుగుదొడ్ల వద్ద భక్తుల రద్దీని అరికట్టండి. తెలుగు పంచాంగం క్యాలెండర్లు ఎక్కువగా ముద్రించండి?

ఈ.వో : శ్రీవారి దర్శనానికి పడుతున్న సమయాన్ని రేడియో బ్రాడ్‌కాస్టింగ్‌ ద్వారా, ప్రసార మాధ్యమాల ద్వారా ఎప్పటికప్పుడు భక్తులకు తెలియజేస్తున్నాం. అవసరమైన చోట్ల లగేజీ కౌంటర్లను ఏర్పాటు చేస్తాం. టైంస్లాట్‌ టోకెన్లు పొందిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే కంపార్ట్‌మెంట్ల వద్దకు చేరుకోవాలి. మరుగుదొడ్ల వద్ద భక్తుల రద్దీ నియంత్రణకు తగిన చర్యలు చేపడుతాం. కంపార్ట్‌మెంట్ల నుండి వెలుపలకు వచ్చే భక్తులు మూడు వరుసల్లో మహాద్వారం వరకు వెళ్లేందుకు త్వరలో క్యూలైన్లు ఏర్పాటు చేస్తాం.

2. ముకుంద – బెంగుళూరు

పశ్న : భక్తులు ముందుగా వరాహస్వామివారిని దర్శించుకున్నాక శ్రీవారిని దర్శించుకునేలా క్యూలైన్లు మార్చండి ?

ఈ.వో : అలా చేయడం సాధ్యం కాదు. పలువురు భక్తులు ముందుగా వరాహస్వామివారిని దర్శించుకున్నాక శ్రీవారి దర్శనం కోసం క్యూలైన్లలోకి ప్రవేశిస్తున్నారు.

3. డి.వి.ఆర్‌.శర్మ – విశాఖ

పశ్న : వృద్ధులు, దివ్యాంగులు దర్శనం కోసం వేచియుండే సమయాన్ని తగ్గించండి ?

ఈ.వో : వృద్ధులు, దివ్యాంగులు దర్శనం కోసం వేచియుండే సమయాన్ని ఇప్పటికే బాగా తగ్గించాం. నెలలో రెండురోజుల పాటు అదనంగా కేటాయిస్తున్న టికెట్లలో కొన్నింటిని ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచేందుకు చర్యలు చేపడుతాం.

4. లక్ష్మీనారాయణ – బెంగుళూరు

పశ్న : తిరుమలలో శ్రీవారి కల్యాణం టికెట్‌ బుక్‌ చేసుకున్నాను. ఒకరి బదులు మరొకరు రావచ్చా?

ఈ.వో : సాధ్యం కాదు.

5. కె.వి.ఎన్‌.శర్మ – విజయవాడ

పశ్న : విజయవాడలో జరుగుతున్న పుస్తక మహోత్సవంలో టిటిడి పుస్తక ప్రదర్శనశాల పెట్టలేదు. టిటిడి ప్రచురణలకు రాయితీలు ఇవ్వండి.?

ఈ.వో : ప్రస్తుతం టిటిడి డైరీలు, క్యాలెండర్ల సీజన్‌ కావడంతో సిబ్బంది అంతా ఆ పనిలో ఉన్నారు. పుస్తకమహోత్సవాలలో తప్పకుండా టిటిడి పుస్తకప్రదర్శనశాలను ఏర్పాటుచేస్తాం. ధర్మప్రచారంలో భాగంగా లాభాపేక్ష లేకుండా పుస్తక ముద్రణ చేపడుతున్నాం. పలు సందర్భాలలో భక్తులకు ఉచితంగా పుస్తక ప్రసాదం అందిస్తున్నాం. టిటిడి వెబ్‌సైట్‌లో పుస్తకాలను చదువు కోవడంతోపాటు ఉచితంగా డౌన్‌లోడ్‌ చేసుకునే అవకాశం కల్పించాం.

6. లావణ్య – నెల్లూరు

పశ్న : నడిచి వచ్చేవారు ఎక్కువ సమయం వేచి ఉండకుండా త్వరగా దర్శనం కల్పించండి?

ఈ.వో : నడిచి వచ్చే భక్తుల కోసం రోజుకు 20 వేల టోకెన్లు జారీ చేస్తున్నాం. ఈ టోకెన్లు పొందిన భక్తులు ఎక్కువ సమయం వేచియుండకుండా నిర్దేశిత సమయంలో స్వామివారిని దర్శించుకోవచ్చు.

7. రమేష్‌ – గద్వాల

పశ్న : శ్రీవారి సేవకు వయసు పైబడిన వారు వస్తున్నారు?

ఈ.వో : 18 నుండి 60 ఏళ్లలోపు వయసుగల ఆరోగ్యవంతులను శ్రీవారి సేవకు అనుమతిస్తున్నాం.

8. లక్ష్మణ్‌ – బెంగుళూరు

పశ్న : టిటిడి భవనాలపై తగిన ఏర్పాట్లు చేసి సౌర విద్యుత్‌ను ఉత్పత్తి చేయండి?

ఈ.వో : ఇప్పటికే 10 మెగావాట్ల సౌరవిద్యుత్‌ ప్లాంట్‌ను నిర్వహిస్తున్నాం. టిటిడి భవనాలపైన సౌరవిద్యుత్‌ పరికరాల ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. రాబోవు రోజుల్లో టిటిడి అవసరాలకు పూర్తిగా సౌర, పవన విద్యుత్‌ను వినియోగిస్తాం.

9. సతీష్‌కుమార్‌్‌ – హైదరాబాద్‌, యశోద – బెంగుళూరు

పశ్న : ఆన్‌లైన్‌ లక్కీడిప్‌లో శ్రీవారి ఆర్జితసేవా టికెట్లు లభించడం లేదు?

ఈ.వో : శ్రీవారి ఆర్జిత సేవల కోసం లక్షా 20 వేల మంది వరకు నమోదు చేసుకుంటున్నారు. 5వేల మందికి మాత్రమే టికెట్లు లభ్యం అవుతున్నాయి. ఆన్‌లైన్‌లో ప్రయత్నించండి.

10. సురేష్‌ – బెంగుళూరు

పశ్న : శ్రీవారి ఆభరణాలను ప్రదర్శించండి?

ఈ.వో : ఈ విషయానికి సంబంధించి ఆగమ పండితుల సూచనల ప్రకారం నడుచుకుంటాం.

ఈ కార్యక్రమంలో టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌, సివిఎస్‌వో శ్రీ గోపినాథ్‌జెట్టి, చీఫ్‌ ఇంజినీర్‌ శ్రీ చంద్రశేఖర్‌రెడ్డి, ఎస్‌ఇ-2 శ్రీ రామచంద్రారెడ్డి, ఎస్‌ఇ(ఎలక్ట్రికల్స్‌) శ్రీ వేంకటేశ్వర్లు ఇతర అధికారులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.