TTD THINK TANK FOR SHIRDI SAMSTHAN FOR RESUMING DARSHAN _ షిర్డీలో దర్శనం పునరుద్ధరణపై టిటిడి సలహాలు స్వీకరణ

Tirupati, 6 September 2020: The famous temple of Sri Sai Baba at Shiridi in Maharashtra will be resuming darshan shortly after closing the shrine for over six months due to the COVID pandemic and invited think-tank from TTD on the guidelines and mechanism to be followed while providing darshan to pilgrims.

Upon the invitation from Shiridi Board, the TTD Chairman Sri YV Subba Reddy, Board Member Sri K.Siva Kumar, EO Sri Anil Kumar Singhal and Additional EO Sri AV Dharma Reddy reached Shiridi on Sunday evening.

On their arrival, they were received by the Shiridi Board Secretary and Chief Executive Officer Sri Kanhuraj Harischandra Bhagate and others.

A meeting was held on Sunday evening where the modalities of darshan to be followed in view of the Covid pandemic were discussed. As TTD has been successfully implementing darshan for pilgrims since June 11 following all COVID norms, the Shiridi board has sought TTD to provide them guidance as they are contemplating to resume darshan soon. 

The TTD Chairman and EO informed them about the various precautions taken up by TTD while resuming darshan. They said, both the TTD staff and the pilgrims have been strictly observing COVID norms by wearing masks, using sanitizers and maintaining two-meter social distance between persons apart from mandatory screening at Alipiri, before entering Tirumala, sanitizing the rooms, queue lines at regular intervals etc.

“Over six lakh pilgrims had darshan till date starting from June 11 and not even a single positive case registered among visiting pilgrims so far because of strictly implementing the COVID norms in Tirumala temple”, TTD Chairman asserted.

The Shiridi board authorities thanked TTD for providing valuable suggestions on the precautions to be taken while resuming darshan in COVID pandemic conditions. Deputy CEO Sri Ravindra Thakre, Executive Engineer Sri Raghunath were also present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

షిర్డీలో దర్శనం పునరుద్ధరణపై టిటిడి సలహాలు స్వీకరణ
 
తిరుమల, 2020 సెప్టెంబరు 06: కరోనా వ్యాప్తి నేపథ్యంలో భక్తులకు దర్శనం పునరుద్ధరించేందుకు చేపట్టాల్సిన చర్యలపై షిర్డీలోని శ్రీ సాయిబాబా సంస్థాన్ ఆదివారం టీటీడీ నుండి సూచనలు, సలహాలు స్వీకరించింది. 
 
భక్తులకు దర్శనాలు కల్పించే సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తల విషయంలో మార్గనిర్దేశకత్వం చేయవలసిందిగా శ్రీ సాయిబాబా సంస్థాన్, షిర్డీ ఆహ్వానం మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి చైర్మన్ శ్రీ వై.వి. సుబ్బారెడ్డి, సభ్యులు శ్రీ కె.శివ కుమార్, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీ అనిల్ కుమార్ సింఘాల్,  అడిషనల్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీ  ఏ.వి.ధర్మారెడ్డి ఆదివారం సాయంత్రం షిర్డీ చేరుకుని అధికారులతో సమావేశమయ్యారు. 
 
 ఈ సందర్భంగా భక్తులకు దర్శనం కల్పించడంలో తీసుకున్న జాగ్రత్తలు తదితర వివరాలను టిటిడి ఛైర్మన్, ఈవో తెలియజేశారు. అలిపిరి చెక్ పాయింట్ వద్ద భక్తులకు థర్మల్ స్క్రీనింగ్ చేసి వాహనాలు శానిటైజ్ చేసి అనుమతించామన్నారు. శ్రీవారి ఆలయం, భక్తులు వేచి ఉండే వైకుంఠం క్యూ కాంప్లెక్స్ తదితర ప్రాంతాల్లో ప్రతి రెండు గంటలకు ఒకసారి శానిటైజ్ చేశామని చెప్పారు. క్యూలైన్లలో భక్తులు భౌతిక దూరం పాటించేలా 2 మీటర్ల దూరంలో మార్కింగ్ చేశామన్నారు. గదులు పొందే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఆల్టర్నేట్ పద్ధతిలో కేటాయించామని, ఖాళీ చేసిన అనంతరం పూర్తిగా శానిటైజ్ చేసిన తర్వాతే చాలా మరొకరికి కేటాయించేలా జాగ్రత్తలు తీసుకున్నామని వివరించారు. భక్తులకు దగ్గరగా ఉండే సిబ్బందికి పిపిఇ కిట్లు అందజేశామని, అదేవిధంగా మాస్కులు, గ్లౌజులు, శానిటైజర్లు అందించామని తెలిపారు.
 
ఈ కార్యక్రమంలో షిరిడి సంస్థాన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీ తనురాజ్ హరిశ్చంద్ర భగటే, డెప్యూటి సిఈఓ శ్రీ రవీంద్ర, ఇఇ శ్రీ రఘునాథ్ తదితరులు పాల్గొన్నారు.
 
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.