TTD TO ANNOUNCE ANJANADRI AS HANUMAN BIRTH PLACE ON APRIL 21 _ హ‌నుమంతుని జ‌న్మ‌స్థానం స‌ప్త‌గిరుల్లోని అంజ‌నాద్రిగా ఏప్రిల్ 21న

Tirupati, 12 Apr. 21: Tirumala Tirupati Devasthanams is all set to declare Anjanadri hills of Tirumala as the Birth place of Anjaneya Swamy by presenting mythological, epigraphically and astrological evidences on the auspicious day of Sri Ramanavami on April 21.

TTD EO Dr KS Jawahar Reddy has constituted a committee in December last to study in detail about the evidences confirming Anjanadri Hills as birth place of Hanuman with eminent scholars including VCs of Vedic Varsity and National Sanskrit Varsity, two professors from National Sanskrit Varsity and Project Officer of Higher Vedic studies as Convenor under the supervision of Additional EO Sri AV Dharma Reddy. 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

తిరుమ‌ల‌, 2021 ఏప్రిల్ 12: హ‌నుమంతుని జ‌న్మ‌స్థానం స‌ప్త‌గిరుల్లోని అంజ‌నాద్రిగా ఏప్రిల్ 21న శ్రీ‌రామ‌న‌వ‌మి ప‌ర్వ‌దినాన పురాణాలు, శాస‌నాలు, శాస్త్రీయ‌ ఆధారాల‌తో స‌హా నిరూపించేందుకు ‌టిటిడి సిద్ధ‌మైంది.

టిటిడి ఈవో డాక్టర్ కె.ఎస్. జవహర్ రెడ్డి గత ఏడాది డిసెంబర్‌లో అంజనాద్రి కొండలను హనుమంతుడి జన్మస్థలంగా ధృవీకరించే సాక్ష్యాల గురించి స‌మ‌గ్రంగా అధ్యయనం చేయడానికి ఒక కమిటీని ఏర్పాటుచేసిన విష‌యం విదిత‌మే. ఈ క‌మిటీలో ఎస్వీ వేద విశ్వ‌విద్యాల‌యం ఉప‌కుల‌ప‌తి ఆచార్య స‌న్నిధానం సుదర్శ‌న‌శ‌ర్మ‌, జాతీయ సంస్కృత విశ్వ‌విద్యాల‌యం ఉప‌కుల‌ప‌తి ఆచార్య ముర‌ళీధ‌ర శ‌ర్మ‌, ఆచార్య రాణి స‌దాశివ‌మూర్తి, ఆచార్య జాను‌మ‌ద్ది రామ‌కృష్ణ‌, ఆచార్య శంక‌ర‌నారాయ‌ణ‌, ఇస్రో శాస్త్రవేత్త శ్రీ రేమెళ్ల మూర్తి, రాష్ట్ర పురావ‌స్తు శాఖ డెప్యూటీ డైరెక్ట‌ర్ శ్రీ విజ‌య్‌కుమార్ స‌భ్యులుగా ఉన్నారు. టిటిడి ఎస్వీ ఉన్న‌త వేదాధ్య‌య‌న సంస్థ ప్రాజెక్టు అధికారి డా. ఆకెళ్ల విభీష‌ణ‌శ‌ర్మ స‌మ‌న్వ‌య‌క‌ర్త‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.