TTD TO CELEBRATE UGADI UTSAVAM_ మార్చి 18న టిటిడి ఆధ్వర్యంలో మహతిలో ఉగాది సంబరాలు

TTD SUB-TEMPLES TO OBSERVE UGADI FEST

Tirupati, 16 March 2018: All the sub-temples under the umbrella of TTD are gearing up to observe “Sri Vilambi Nama Ugadi” on Sunday in a big way.

After the morning rituals and special pujas in the temples of Sri Padmavati Devi, Sri Kodanda Ramaswamy, Sri Govindaraja Swamy, Panchanga Sravanam will be recited in the evening.

Sri Venkateswara Swamy temple at Anantavaram is also sprucing up to observe Telugu New Year Day.

TTD TO CELEBRATE UGADI UTSAVAM

On Sunday, TTD will observe Sri Vilambi Nama Ugadi Utsavam in Mahati Auditorium at Tirupati.

The day commenced with Mangala Dhwani, Nadaswaram, Veda Parayanam.

TTD has also organised Panchanga Sravanam and Astavadhanam on the occasion. The children of employees will present a show wearing the guises of “Telugu Vaitalikulu” (renowned scholars of Telugu Literature) which will be followed by prize ceremony. Later the famous “Ugadi Pacchadi” will be distributed.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

మార్చి 18న టిటిడి ఆధ్వర్యంలో మహతిలో ఉగాది సంబరాలు

మార్చి 16, తిరుపతి, 2018: టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌, సంక్షేమ విభాగం సంయుక్త ఆధ్వర్యంలో శ్రీవిళంబినామ సంవత్సర ఉగాది వేడుకలు మార్చి 18వ తేదీ ఆదివారం తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో ఘనంగా జరుగనున్నాయి.

ఇందులో భాగంగా ఉదయం 9.30 గంటలకు కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. ముందుగా ఎస్‌.వి.సంగీత, నృత్య కళాశాల ఆధ్వర్యంలో మంగళధ్వని, టిటిడి ఎస్‌.వి ఉన్నత వేదాధ్యయన సంస్థవారిచే వేదపారాయణం నిర్వహిస్తారు. పంచాంగ శ్రవణం, అష్టావధానం చేపడతారు. టిటిడి ఉద్యోగుల పిల్లలతో ”తెలుగువైతాళికులు” వేషధారణ పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. పలు పోటీల్లో విజేతలుగా నిలిచిన ఉద్యోగులకు బహుమతులు ప్రదానం చేస్తారు. అనంతరం ఉగాది పచ్చడి ప్రసాద వితరణ ఉంటుంది.

మార్చి 18న టిటిడి అనుబంధ ఆలయాల్లో ఉగాది వేడుకలు

టిటిడికి అనుబంధంగా ఉన్న ఆలయాల్లో మార్చి 18వ తేదీ ఆదివారం ఉగాది వేడుకలు ఘనంగా జరుగనున్నాయి. భక్తులు పెద్దసంఖ్యలో విచ్చేయనుండడంతో ప్రత్యేకంగా క్యూలైన్లు తదితర ఏర్పాట్లు చేపట్టారు.

తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో…

తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఉగాది పర్వదినం సందర్భంగా ఆదివారం ప్రత్యేక కార్యక్రమాలు జరుగనున్నాయి. ఇందులో భాగంగా సాయంత్రం 3 నుండి 4 గంటల వరకు శ్రీకృష్ణ ముఖ మండపంలో స్నపనతిరుమంజనం నిర్వహిస్తారు. సాయంత్రం 6.00 నుంచి 7.30 గంటల వరకు పుష్పపల్లకీలో అమ్మవారు వేంచేసి ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పిస్తారు. రాత్రి 8.00 నుంచి 8.30 గంటల వరకు పంచాంగ శ్రవణం, ఉగాది ఆస్థానం నిర్వహిస్తారు.

తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో…

తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఉగాది సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాల, కొలువు, అర్చన నిర్వహిస్తారు. సాయంత్రం 5.30 నుంచి రాత్రి 7.00 గంటల వరకు పంచాంగ శ్రవణం, ఉగాది ఆస్థానం నిర్వహించనున్నారు.

శ్రీ కోదండరామాలయంలో..

తిరుపతిలోని శ్రీ కోదండరామాలయంలో వార్షిక బ్రహ్మూెత్సవాల్లో భాగంగా మార్చి 18న ఉగాది సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా సాయంత్రం 3.30 నుండి 4.30 గంటల వరకు ఉగాది ఆస్థానం, పంచాంగ శ్రవణం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌ స్వామివారు మూలవర్లకు, ఉత్సవర్లకు వస్త్రసమర్పణ చేస్తారు.

అనంతవరంలోని శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో..

టిటిడికి అనుబంధంగా ఉన్న గుంటూరు జిల్లా అనంతవరంలోని శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో మార్చి 18న ఉగాది సందర్భంగా ఉదయం 4 గంటలకు మూలవర్లకు అభిషేకం చేస్తారు. సాయంత్రం 5 నుండి రాత్రి 7 గంటల వరకు పంచాంగ శ్రవణం, ఉగాది ఆస్థానం నిర్వహించనున్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.