SERVICE CHARGES REDUCED ON ONLINE SERVICES_ టిటిడి ఆన్‌లైన్‌ సేవల సర్వీస్‌ ఛార్జీలు తగ్గింపు

Tirupati, 16 Mar. 18: TTD has taken initiative to reduce service charges on online services which has come into effect from March 14 onwards. The reduced service charges would apply to all on-line services of TTD including Arjitha Sevas, Accommodation, Rs.300 special entry darshan, e-Hundi, e-Donation etc.,

The Executive Officer of TTD, Sri Anil Kumar Singhal, on receiving complaints from pilgrims has persuaded the public and private sector banks to charge the minimal service charges.

In this regard the revised service charges have come into effect from March 14 onwards. The service charges on credit cards is now reduced from 1.5% to 0.5% while on Debit cards the service charges up to Rs.2000 is Nil and more than Rs.2000 is charged at 0.5% as against 1%. For the payments through net banking, currently Rs.16 is charged for every Rs.1000 which will be now charged at Rs.7.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

టిటిడి ఆన్‌లైన్‌ సేవల సర్వీస్‌ ఛార్జీలు తగ్గింపు

మార్చి 16, తిరుమల, 2018: ప్రపంచ ప్రఖ్యాత ధార్మిక సంస్థ టిటిడి అందిస్తున్న ఆన్‌లైన్‌ సేవలను వినియోగించుకునే భక్తులకు మార్చి 14వ తేదీ నుండి సర్వీస్‌ ఛార్జీలు తగ్గాయి. ఆర్జితసేవలు, వసతి, రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు, ఈ-హుండీ, ఈ-డొనేషన్‌ తదితర సేవలకు ఈ తగ్గించిన ఛార్జీలు వర్తిస్తాయి.

టిటిడి అందిస్తున్న ఆన్‌లైన్‌ సేవలకు సర్వీస్‌ ఛార్జీల భారం అధికంగా ఉందని భక్తుల నుండి సూచనలు, ఫిర్యాదులు అందాయి. ఈ మేరకు టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ ప్రభుత్వ, ప్రయివేటు బ్యాంకులతో సంప్రదింపులు జరపడంతో సర్వీసు ఛార్జీలు తగ్గాయి.

ఆన్‌లైన్‌ సేవలకు తగ్గించిన సర్వీస్‌ ఛార్జీల వివరాలు ఇలా ఉన్నాయి. క్రెడిట్‌ కార్డు ద్వారా చెల్లింపులు చేస్తున్న భక్తులకు సర్వీస్‌ ఛార్జీని 1.5 శాతం నుండి 0.5 శాతానికి తగ్గించారు. డెబిట్‌కార్డు ద్వారా చెల్లింపులు చేస్తున్న భక్తులకు రూ.2 వేల వరకు ఎలాంటి సర్వీస్‌ ఛార్జీ లేదు. రూ.2 వేలు పైన చెల్లించేవారికి సర్వీస్‌ ఛార్జీని 1 శాతం నుండి 0.5 శాతానికి తగ్గించారు. అదేవిధంగా, నెట్‌ బ్యాంకింగ్‌ ద్వారా చెల్లింపులు చేస్తున్న భక్తులకు సరాసరి రూ.1000/-కి రూ.16/- వసూలు చేస్తుండగా, ఇకపై రూ.7/- వసూలు చేస్తారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.