TTD TO CONDUCT KARTHIKA MASA HOMAMS AT SRI KAPILESWARA SWAMY TEMPLE FROM NOVEMBER 10 _ న‌వంబ‌రు 10 నుంచి డిసెంబరు 8వ తేదీ వరకు శ్రీకపిలేశ్వరాలయంలో కార్తీకమాస విశేష పూజ హోమ మహోత్సవాలు

Tirupati, October 26, 2026: TTD will conduct month-long Karthika Masa special pujas and homams at Sri Kapileswara Swamy Temple, Tirupati, from November 10 to December 8 for the well-being of the world.

The rituals include Ganapathi, Subramanya, Navagraha, Chandi and Rudra Homams, among others. The Valli-Devasena Sametha Subramanya Swamy Kalyanam will be held on November 15, and the Sri Sivaparvathi Kalyanam on December 7.

Devotees can participate in each homam or Kalyanam by paying ₹500 for two persons. Traditional attire is mandatory for homam participants.

TTD has been organising these collective homams since 2012 to enable devotees to participate in the rituals conveniently.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER

న‌వంబ‌రు 10 నుంచి డిసెంబరు 8వ తేదీ వరకు శ్రీకపిలేశ్వరాలయంలో కార్తీకమాస విశేష పూజ హోమ మహోత్సవాలు

తిరుపతి, 2026 అక్టోబ‌రు 26 : పవిత్రమైన కార్తీక మాసాన్ని పురస్కరించుకుని లోక కల్యాణం కోసం తిరుపతిలోని శ్రీకపిలేశ్వరస్వామివారి ఆలయంలో న‌వంబ‌రు 10 నుంచి డిసెంబరు 8వ తేదీ వరకు నెల రోజుల పాటు విశేషపూజ హోమ మహోత్సవాలు జరుగనున్నాయి. న‌వంబరు 10వ తేదీన హోమ మహోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ జరుగనుంది.

న‌వంబరు 11వ తేదీ వరకు మొదటగా శ్రీగణపతిస్వామివారి హోమం, న‌వంబరు 12 నుండి 13వ‌ తేదీ వ‌ర‌కు శ్రీసుబ్రమణ్యస్వామివారి హోమం, న‌వంబరు 14న ధ‌ర్మ‌శాస్త్ర‌ హోమం, న‌వంబరు 15న శ్రీ నవగ్రహ హోమం జరుగనున్నాయి.

అదేవిధంగా న‌వంబరు 16న శ్రీదక్షిణామూర్తి స్వామివారి హోమం, న‌వంబరు 17న శ్రీకాలభైరవ స్వామివారి హోమం, న‌వంబరు 18 నుంచి 26వ తేదీ వరకు శ్రీ కామాక్షి అమ్మవారిహోమం(చండీహోమం), న‌వంబరు 27 నుంచి డిసెంబ‌రు 7వ తేదీ వరకు శ్రీ కపిలేశ్వర స్వామివారి హోమం(రుద్రహోమం), డిసెంబ‌రు 8న శ్రీచండికేశ్వరస్వామివారి హోమం, త్రిశూలస్నానం, పంచమూర్తుల తిరువీధి ఉత్సవం నిర్వహించనున్నారు.

గృహస్తులు (ఇద్దరు) రూ.500/- చెల్లించి ఒక రోజు హోమంలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, అన్నప్రసాదం అందజేస్తారు. ఈ హోమాల్లో పాల్గొనే గృహస్తులు కచ్చితంగా సంప్రదాయ వస్త్రధారణలో రావాల్సి ఉంటుంది.

ఈ హోమాల్లో భాగంగా న‌వంబరు 15న శ్రీ వళ్లి దేవసేన సమేత శ్రీ సుబ్రమణ్యస్వామివారి కల్యాణం, డిసెంబరు 7న మాస శివరాత్రి నాడు శ్రీ శివపార్వతుల కల్యాణోత్సవం జరుగనున్నాయి.  గృహస్తులు (ఇద్దరు) రూ.500/- చెల్లించి ఒక్కో కల్యాణంలో పాల్గొనవచ్చు.

హోమ మహోత్సవాలకు విశేష ఆదరణ :

శ్రీ కపిలేశ్వరాలయంలో టీటీడీ నిర్వహిస్తున్న హోమ మహోత్సవాలకు భక్తుల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. 2012వ సంవత్సరంలో ఈ హోమాలను టీటీడీ ప్రారంభించింది.  ఈ హోమాల్లో పాల్గొంటున్న భక్తుల సంఖ్య ప్రతి ఏడాదీ పెరుగుతోంది. ఈ హోమాలను సొంతంగా చేయించుకోవాలంటే ఖర్చుతో కూడుకున్న పనికావడంతో భక్తుల సౌకర్యార్థం సామూహికంగా ఈ హోమాలను టీటీడీ నిర్వహిస్తోంది.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది