TTD TO GO FOR ADVANCED SYSTEM OF CABLE WIRING IN MADA STREETS_ శ్రీవారి ఆలయ మాడవీధుల్లో భూగర్భ కేబుళ్లు ఏర్పాటుచేయాలి : టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌

Tirupati, 20 Dec. 18: To give the precincts of Tirumala temple, the best possible look, TTD is contemplating to go for the advanced system of cable wiring in four mada streets soon.

Senior officers review meeting was held in the conference hall in TTD administrative building in Tirupati on Thursday evening. TTD EO Sri Anil Kumar Singhal who complimented the officers and their staffs for the massive success of Vaikuntha Ekadasi in Tirumala and Tirupati directed all departments to gear up for the next big fete, Radhasapthami which is falling on February 12 next year.

During the review meeting, the EO instructed the SE Electrical Sri Venkateswarulu to coordinate with Radio & Broad Casting, SVBC and Security wings to ensure advance cable wiring network in mada streets. “The cable wires should not be seen outside. Go for advanced system. He also instructed the SE Electrical to set up LED display boards in all vital junctions in Tirumala”, EO directed the concerned.

He instructed the concerned officials to take up the development of SV Museum in Tirumala in a phased manner. “Identify the Hall which need to be developed initially”, he said. The EO has said the plantation in third phase Ring Road should be taken up and for that a clear plan is needed.

As the Teppotsavams are set to take place in March, the EO instructed SE II Sri Ramachandra Reddy to complete the renovation and repair works of brass grills of Pushkarini before the religious event. He also instructed him to come out with an action plan for scaffolding at all vital points in Tirumala akin to the one set up at Vaibhavotsava Mandapam. “Design traditional arches in the place of grill gates to give aesthetic feel for the Saptadwara gates at Rambhagicha”, he added.

As the winter season is in its peak, the EO instructed the concerned to keep ready blankets at the reception counters and directed PRO Dr T Ravi to educate pilgrims on the availability of blankets with the help of Srivari Sevakulu.

The EO said, one lakh laddu boxes with and without the images of Lord shall be introduced soon in the place of plastic covers on trial basis and further decision can be taken based on the feedback from pilgrims.

Later the EO also reviewed on the progress of development works in Sri Kapileswara Swamy temple. The Chief Audit Officer Sri Sesha Sailendra presented a power point upon the development works. The EO also directed the concerned to get ready the wooden chariot for next Ammavari Brahmotsavams at Tiruchanoor.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

శ్రీవారి ఆలయ మాడవీధుల్లో భూగర్భ కేబుళ్లు ఏర్పాటుచేయాలి : టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌

తిరుపతి, 2018 డిసెంబరు 20: తిరుమలలోని శ్రీవారి ఆలయ మాడ వీధుల్లో జరిగే ఊరేగింపుల్లో రేడియో బ్రాడ్‌కాస్టింగ్‌, ఎస్వీబీసీ, సిసిటివిల కేబుళ్లు భక్తులకు అడ్డుపడకుండా భూగర్భ కేబుల్‌ వ్యవస్థను ఏర్పాటు చేయాలని టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ ఇంజినీరింగ్‌ అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో గల సమావేశ మందిరంలో గురువారం సీనియర్‌ అధికారులతో ఈవో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ తిరుమలలో వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాల సందర్భంగా పెద్ద సంఖ్యలో వచ్చిన భక్తులకు విశేషంగా సేవలందించిన అన్ని విభాగాల అధికారులకు, సిబ్బందికి, పోలీసులకు, శ్రీవారి సేవకులకు, స్కౌట్స్‌కు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు. అన్నప్రసాదం, పారిశుద్ధ్య విభాగాల సిబ్బంది సేవలను కొనియాడారు. ఫిబ్రవరి 12న రథసప్తమి పర్వదినానికి విశేషంగా భక్తులు విచ్చేసే అవకాశముండడంతో విస్తృతంగా ఏర్పాట్లు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. తెప్పోత్సవాల సమయానికి శ్రీవారి పుష్కరిణి చుట్టూ నూతన ఇత్తడి గ్రిల్స్‌ ఏర్పాటుతోపాటు ఇతర మరమ్మతులను పూర్తి చేయాలన్నారు. నాలుగు మాడ వీధుల్లో ఇనుప గేట్లకు బదులు సంప్రదాయ ఆర్చిల ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. మూడో దశ రింగ్‌ రోడ్డులో మొక్కల పెంపకాన్ని వేగవంతం చేయాలన్నారు.

ఎస్వీ మ్యూజియాన్ని దశలవారీగా అభివృద్ధి చేయాలని ఈవో సూచించారు. చలికాలం కావడంతో భక్తులకు ఇబ్బంది లేకుండా వసతి గదుల్లో అదనంగా దుప్పట్లు అందుబాటులో ఉంచుకోవాలని, ఈ విషయాన్ని శ్రీవారి సేవకుల ద్వారా భక్తులకు తెలియజేయాలని సూచించారు. తిరుమలలో నూతనంగా నిర్మించిన మరుగుదొడ్ల నిర్వహణకు అవసరమైన కార్యాచరణ సిద్ధం చేయాలన్నారు. లడ్డూ ప్రసాదాల కవర్ల స్థానంలో ప్రయోగాత్మకంగా మొదటిదశలో ఒక లక్ష పేపర్‌ బాక్సులను అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. శ్రీ పద్మావతి అమ్మవారి చెక్కరథానికి అవసరమైన మరమ్మతులు చేపట్టాలన్నారు. ఈ సందర్భంగా శ్రీ కపిలేశ్వరాలయ అభివృద్ధి పనులకు సంబంధించి ఆలయ పర్యవేక్షణాధికారి, సిఏవో శ్రీ శేష శైలేంద్ర పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌ ఇచ్చారు.

ఈ సమావేశంలో టిటిడి తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు, తిరుపతి జెఈవో శ్రీపోల భాస్కర్‌, ఎఫ్‌ఏసిఏవో శ్రీ ఓ.బాలాజి, చీఫ్‌ ఇంజినీర్‌ శ్రీ చంద్రశేఖర్‌రెడ్డి, ఎస్‌ఇ-4 శ్రీరాములు ఇతర అధికారులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.