TTD TO MAINTAIN STRAY ANIMALS AT SV GOSHALA _ ఎస్వీ గోశాలకు వీధి పశువుల తరలింపు – వాటి సంరక్షణకు ఈవో ఆదేశం
Tirupati, 15 April 2021: TTD will henceforth maintain stray animals roaming at Alipiri, Balaji link bus stand, Ruia, BIRRD and SVIMS hospitals at the SV Go Samrakshanashala in Tirupati.
TTD EO Dr KS Jawahar Reddy on Thursday directed officials to round up all stray animals in these locations and shift them to SV Goshala for their upkeep.
In order to ensure the safety of devotees and patients in these places, EO directed the officials concerned to move all stray animals to SV Goshala and provide water, fodder and shelter to them.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
ఎస్వీ గోశాలకు వీధి పశువుల తరలింపు
– వాటి సంరక్షణకు ఈవో ఆదేశం
తిరుపతి, 2021 ఏప్రిల్ 15: తిరుపతిలోని అలిపిరి, బాలాజీ లింక్ బస్టాండ్, రుయ, బర్డ్, స్విమ్స్ ఆసుపత్రుల వద్ద తిరుగుతున్న వీధి పశువులను గోశాలకు తరలించాలని టీటీడీ ఈవో డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
ఈ ప్రాంతాల్లో సంచరించే పశువుల వల్ల భక్తులు, రోగులు, వారి సహాయకులకు ఇబ్బంది కలుగకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈవో ఆదేశాల మేరకు ఎస్వీ గోశాల సిబ్బంది గత రెండు రోజులుగా పశువులను గోశాలకు తరలించి నీరు, మేత, వసతి సౌకర్యాలు కల్పిస్తున్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.