TTD TO OBSERVE RENOWNED SCHOLARS BIRTH AND DEATH ANNIVERSARY FETES _ సెప్టెంబర్ 10న అన్నమాచార్య కళామందిరంలో శ్రీ సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి 42వ వర్ధంతి

STATUE INAUGURATION

 

TIRUPATI, 07 SEPTEMBER 2023: TTD is all set to observe the birth and death anniversaries of renowned scholars on September 10.

 

The statue of Sri Gauripeddi Rama Subba Sharma will be inaugurated in the premises of SV Oriental College in Tirupati on the occasion of his 101st Birth Anniversary.

 

While Pushpanjali will be rendered to the life-size bronze statue of Sri Sadhu Subrahmanya Shastry located in front of the SVETA building on the occasion of his 42nd death anniversary.

 

Later literary sessions will take place at Annamacharya Kalamandiram in the morning and in the evening on the same day which will be attended by TTD top brass officials and scholars.

 
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

సెప్టెంబర్ 10న అన్నమాచార్య కళామందిరంలో శ్రీ సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి 42వ వర్ధంతి

– శ్రీ గౌరిపెద్ది రామసుబ్బశర్మ గారి 101వ జయంతి ఉత్సవాలు

తిరుపతి, 2023 సెప్టెంబరు 07: టీటీడీ హిందూ ధార్మిక ప్రాజెక్టులు, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో సెప్టెంబర్ 10వ తేదీన తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో శ్రీ సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి 42వ వర్ధంతి, శ్రీ గౌరిపెద్ది రామసుబ్బశర్మ 101వ జయంతి కార్యక్రమాలు జరగనున్నాయి.

ఈ సందర్భంగా ముందుగా ఉదయం 10 గంటలకు శ్వేత భవనం ఎదురుగా గల శ్రీ సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి విగ్రహానికి పుష్పాంజలి కార్యక్రమం ఉంటుంది. అనంతరం ఉదయం 10.45 గంటలకు ఎస్వీ ఓరియంటల్ కళాశాలలో శ్రీ గౌరిపెద్ది రామసుబ్బ శర్మ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. ఆ తర్వాత ఉదయం 11 గంటలకు అన్నమాచార్య కళామందిరంలో శ్రీ సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి వర్ధంతి సందర్భంగా సభా కార్యక్రమం నిర్వహిస్తారు. అదేవిధంగా అన్నమాచార్య కళామందిరంలో సాయంత్రం 6 గంటలకు శ్రీ గౌరిపెద్ది రామసుబ్బశర్మ 101వ జయంతి సందర్భంగా సభా కార్యక్రమం ఉంటుంది.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.