TTD TO OBSERVE VARALAKSHMI VRATAM IN A GRAND MANNER AT TIRUCHANOOR ON AUGUST 4_ ఆగస్టు 4న వరలక్ష్మీ వ్రతానికి విస్తృత ఏర్పాట్లు : టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌

JEO TIRUPATI REVIEWS THE ARRANGEMENTS

TTD TO ISSUE 200 TICKETS UNDER CURRENT BOOKING ON AUGUST 3

Tiruchanoor, 27 July, 2017: With just a week’s time left to observe Varalakhsmi Vratam, the first grand celestial and auspicious event in the sacred month Sravanam, TTD is gearing up to celebrate the fest in a big way in the abode of Goddess Padmavathi Devi at Tiruchanoor on August 4.

A review meeting was organised by Tirupati JEO Sri P Bhaskar over the arrangements for the upcoming event with the senior officers of TTD in Asthana Mandapam at Tiruchanoor.

The JEO said, Varalakshmi Vratam is considered to be the most important event in the month of Srvanam especially for women as they believe that by celebrating this festival, Goddess Mahalakshmi will bless them with prosperity and happy marital life. “Goddess Padmavathi Devi being the incarnation of Goddess Mahalakshmi, this festival is being observed by TTD in a grand manner from the past few years in Tiruchanoor. This year also we will celebrate this festival in a big way in Asthana Mandapam between 10am and 12noon on August 4. About 500 couples can sit and watch the religious event. The tickets for the same are available on internet. On August 3 about 200 tickets will be released under current booking”, the JEO added.

He directed the Electrical wing SE Sri Venkateswarulu to make necessary arrangements for the same to enhance the festival fervour by erecting LED screens at Asthana Mandapam and Ratha Mandapam for the sake of devotees. He also instructed the Garden wing chief Sri Srinivasulu to make required arrangements to the platform where the processional deity of Goddess is being seated and Varalakshmi Vratam is observed. “The decorations should provide a colourful vision to the devotees”, he maintained.

The JEO said the HDPP wing of TTD should take up publicity with prachara rathams in the surrounding villages two days prior to the festival. The expert Bhajan troupes should be selected to perform before the procession of Swarna Ratham on the same day evening. The HDPP should also keep enough stock of Kankanams and Varalakshmi vratam pamphlets to be distributed among the devotees. The music college should present the Nadaswaram in a befitting manner for the event”, he directed the concerned.

Adding further the JEO said, “In view of the festival, huge pilgrim crowd is also anticipated on that day. So the security should also be beefed up for crowd management”.

Additional CVSO Sri Siva Kumar Reddy, Temple Spl. Gr. Dy. E. O. Sri Munirathnam Reddy and other officials were also present.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs,TIRUPATI

ఆగస్టు 4న వరలక్ష్మీ వ్రతానికి విస్తృత ఏర్పాట్లు : టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌

తిరుపతి, 2017 జూలై 27: తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఆగస్టు 4న నిర్వహించనున్న వరలక్ష్మీ వ్రతానికి భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని విస్తృత ఏర్పాట్లు చేపడుతున్నట్టు టిటిడి తిరుపతి సంయుక్త కార్యనిర్వహణాధికారి శ్రీ పోల భాస్కర్‌ తెలిపారు. తిరుచానూరులోని ఆస్థానమండపంలో గురువారం ఆయన వరలక్ష్మీ వ్రతం ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ వరలక్ష్మీ వ్రతం టికెట్లను ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉంచామని, భక్తులు బుక్‌ చేసుకోవాలని కోరారు. ఆగస్టు 3వ తేదీన 200 టికెట్లను ఆలయం వద్ద గల కౌంటర్‌లో విక్రయించాలని అధికారులకు సూచించారు. వరలక్ష్మీ వ్రతాన్ని భక్తులు తిలకించేందుకు వీలుగా ఆస్థానమండపంలో, రథమండపం వద్ద ఎల్‌ఇడి స్క్రీన్లు ఏర్పాటుచేయాలని ఆదేశించారు. అమ్మవారి ఆలయం, ఆస్థాన మండపం, ఇతర ప్రాంతాల్లో ఆకట్టుకునేలా పుష్పాలంకరణ, విద్యుద్దీపాలంకరణ చేపట్టాలని సూచించారు. కంకణాలు, కుంకుమ ప్యాకెట్లు, కరపత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలని, భజన బృందాలను ఏర్పాటుచేయాలని హిందూ ధర్మప్రచార పరిషత్‌ అధికారులను ఆదేశించారు.

వ్రతాన్ని ఎస్వీబీసీలో ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు తగిన లైటింగ్‌ ఏర్పాట్లు చేపట్టాలని జెఈవో సూచించారు. ఆస్థానమండపంలో భక్తులకు ఇబ్బందులు లేకుండా క్యూలైన్లు ఏర్పాటుచేయాలన్నారు. అమ్మవారి దర్శనానికి అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసే అవకాశం ఉండడంతో ముందస్తుగా క్యూలైన్లు తదితర ఏర్పాట్లు చేపట్టాలన్నారు. రెండు రోజులు ముందు నుంచి తిరుచానూరు, తిరుపతి పరిసర ప్రాంతాల్లో ప్రచార రథాల ద్వారా వరలక్ష్మీ వ్రతం విశిష్టతను తెలియజేయాలన్నారు.

కాగా, వరలక్ష్మీవ్రతం రోజున ఉదయం 3.30 నుంచి 5.00 గంటల వరకు మూలవర్లకు, ఉత్సవర్లకు అభిషేకం, ఉదయం 10.00 నుంచి 12.00 గంటల వరకు ఆస్థానమండపంలో వరలక్ష్మీవ్రతం, సాయంత్రం 6.00 గంటలకు స్వర్ణరథం ఊరేగింపు నిర్వహిస్తారు. భక్తులు(ఇద్దరు) రూ.500/- చెల్లించి వరలక్ష్మీ వ్రతంలో పాల్గొనవచ్చు. ఈ కారణంగా అభిషేకానంతర దర్శనం, లక్ష్మీపూజ, కల్యాణోత్సవం, కుంకుమార్చన, ఊంజల్‌సేవ రద్దయ్యాయి.

ఈ కార్యక్రమంలో టిటిడి అదనపు సివిఎస్‌వో శ్రీ శివకుమార్‌రెడ్డి, తిరుచానూరు ఆలయ ప్రత్యేకశ్రేణి డెప్యూటీ ఈవో శ్రీ మునిరత్నంరెడ్డి, ఎస్‌ఇ(ఎలక్ట్రికల్స్‌) శ్రీ వేంకటేశ్వర్లు, ఏఈవో శ్రీరాధాకృష్ణ, గార్డెన్‌ సూపరింటెండెంట్‌ శ్రీ శ్రీనివాసులు ఇతర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.