TTD TO RESUME LADDU PRASADAM SALE ON SUBSIDY TO DEVOTEES DURING LOCKDOWN- TTD CHAIRMAN _ లాక్‌డౌన్ ముగిసే వ‌ర‌కు సగం ధరకే శ్రీ‌వారి ల‌డ్డూ ప్ర‌సాదం

Tirupati, 20 May 20: In view of uncertainty existing over ending of Corona COVID -19 Virus lockdown even after 2 months and resuming Srivari Darshan, TTD has decided to commence distribution of sacred Tirupati laddu Prasadam soon to devotees on reduced rates, said TTD Trust Board Chairman Sri YV Subba Reddy.

Speaking to media persons at Sri Padmavathi Rest House in Tirupati on Wednesday, the TTD Board Chief said the resuming of of Srivari darshan to devotees depends on the Central Government decision to lift the lockdown. “We have been receiving mails and phones on when would we resume darshan. But it all depends on the Government’s decision of lifting lockdown”, he maintained.

Adding further, the Chairman said, inspite of lockdown restrictions, the devotees are generously contributing through e-hundi and expressing their immense devotion towards Srivaru though they did not get to see Lord for over 60days as of now”, he said.

The Chairman said, during April 2020, the e-hundi collection stood at Rs 1.97 crore against the previous year’s Rs1.79 crore for the same month with an increase by Rs18 lakhs. Responding to devotees generous contributions to e-Hundi, TTD has decided to resume laddu Prasadam sales and offered 50 % discount rates of Rs 25 per laddu for 175 gm instead of Rs50 which will continue till the darshan of Srivaru resumes.

“The laddu Prasadam will be made available at all TTD Kalyana Mandapams and information centres present in all the 13 District Head Quarters in Andhra Pradesh along with Hyderabad of TS, Chennai of TN and Bengaluru of Karnataka state shortly”, he said.

Devotees requiring bulk quantity shall have to contact the Srivari Temple Deputy EO on 9849575952 and Potu Peishkar on 9701092777 for their additional requirement whose delivery would be made at the said TTD centers. The commencement of Laddu sale by TTD will be decided in two or three days time.

The Chairman ruled out the reports by a section of media and rumours in Social Media about the crunch of funds in TTD coffers for maintenance of the temple administration and even to pay salaries for its employees. “I have already clarified on this and reiterating now that we have no scarcity of funds and there will not be any problem to pay salaries and pensions to our employees as well for maintenance. As per State Government norms, we have paid March and April salaries and are ready to pay May salaries”, he asserted.

Additional EO Sri AV Dharma Reddy was also present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI  

లాక్‌డౌన్ ముగిసే వ‌ర‌కు  సగం ధరకే  శ్రీ‌వారి ల‌డ్డూ ప్ర‌సాదం
 
దర్శనం లేకపోయినా ఈ హుండీ ద్వారా భక్తుల కానుకల సమర్పణ 
 
టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధ్య‌క్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డి 
 
తిరుప‌తి, 20 మే 2020: లాక్డౌన్ కారణంగా భక్తులకు శ్రీవారి దర్శనం నిలిపి వేసి సుమారు రెండు నెలలైందని టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్ష్యులు శ్రీ వైవి సుబ్బారెడ్డి చెప్పారు. భక్తులకు స్వామి వారి దర్శనాలు ఎప్పటి నుంచి ప్రారంభిస్తామో ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి ఉందన్నారు.  ఈ నేపథ్యంలో తమకు స్వామివారి లడ్డూ ప్రసాదం అయినా అందించాలని తనకు అనేక విజ్ఞప్తులు వచ్చినట్లు ఆయన చెప్పారు. భక్తుల విజ్ఞప్తి మేరకు అధికారులతో చర్చించి లాక్డౌన్ ముగిసే వరకు రూ.25 కే లడ్డూ ప్రసాదం అందించాలని నిర్ణయించినట్లు ఆయన చెప్పారు.  ఈ పంపిణీ ఎప్పటి నుంచి ప్రారంభం అయ్యేది, రెండు  మూడు రోజుల్లో చెబుతామన్నారు.
 
అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డితో క‌లిసి ఛైర్మ‌న్ బుధ‌వారం  శ్రీ ప‌ద్మావ‌తి విశ్రాంతి గృహంలో మీడియాతో మాట్లాడారు. భ‌క్తుల నుండి అభ్య‌ర్థ‌న‌లు  పరిగణనలోకి తీసుకుని, లాభ నష్టాలను చూడకుండా రూ.50/- ల‌డ్డూను రూ.25/- కు త‌గ్గించి భ‌క్తుల‌కు అందించాల‌ని నిర్ణ‌యించిన‌ట్టు తెలిపారు. రాష్ట్ర‌వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లా కేంద్రాల్లోని టిటిడి క‌ల్యాణ‌మండ‌పాలు,చెన్నై, బెంగ‌ళూరు, హైద‌రాబాద్‌ నగరాల్లో ఉన్న స‌మాచార కేంద్రాల్లో శ్రీ‌వారి ల‌డ్డూ ప్ర‌సాదాన్ని అందుబాటులో ఉంచుతామ‌న్నారు. ఎవ‌రైనా ఎక్కువ మోతాదులో ల‌డ్డూ ప్ర‌సాదం తీసుకుని భ‌క్తుల‌కు పంచ‌ద‌ల‌చుకుంటే వారు శ్రీ‌వారి ఆల‌య డెప్యూటీ ఈవో  శ్రీ హరీంద్ర నాథ్ 9849575952 లేదా ఆల‌య పోటు పేష్కార్ శ్రీ శ్రీనివాస్ 9701092777ను సంప్ర‌దించాల‌ని కోరారు. 
 
ఈ హుండి ద్వారా పెరిగిన కానుకలు 
 
2019 ఏప్రిల్ నెల‌లో ఇ-హుండీ ద్వారా  స్వామి వారికి   రూ.1.79 కోట్లు కానుకలు అందయన్నారు., ఈ ఏడాది ఏప్రిల్ నెల‌లో రూ.1.97 కోట్లు కానుక లు వచ్చాయని చైర్మన్ చెప్పారు. లాక్‌డౌన్ కార‌ణంగా  శ్రీ‌వారి ద‌ర్శ‌నానికి రాలేక‌పోయినా ఇ-హుండీ ద్వారా కానుక‌లు స‌మ‌ర్పించిన భ‌క్తులంద‌రికీ ఈ సంద‌ర్భంగా కృతజ్ఞ‌త‌లు తెలియ‌జేశారు.
 
టిటిడికి నిధుల కొర‌త లేదు
 
టిటిడి నిర్వ‌హ‌ణ‌కు గానీ, ఉద్యోగుల వేత‌నాలు చెల్లించేందుకు గానీ ఎలాంటి నిధుల కొర‌త లేద‌ని చైర్మన్ తెలిపారు. శ్రీ‌వారి అనుగ్ర‌హంతో భ‌విష్య‌త్తులో కూడా ఆ పరిస్థితి  రాదని  వెల్ల‌డించారు. రాష్ట్ర ప్ర‌భుత్వ నిబంధ‌న‌ల మేర‌కు  ఉద్యోగులకు  మార్చి, ఏప్రిల్ వేత‌నాలు చెల్లించామ‌ని, మే నెల వేత‌నాల చెల్లింపున‌కు సిద్ధంగా ఉన్నామన్నారు. టిటిడి ఉద్యోగుల‌కు వేత‌నాలు చెల్లించ‌లేని స్థితిలో ఉంద‌ని కొన్ని మీడియాల్లోనూ, సామాజిక మాధ్యమాల్లోను ఇటీవ‌ల జ‌రిగిన ప్రచారం అవాస్తవమని  చైర్మన్ చెప్పారు. 
 
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.