TTD TO SELL SADHU SUBRAHMANYA SASTRY’S EPIGRAPHICAL WORK ON 50% DISCOUNT _ తితిదే పుస్తక భాండాగారంలో శ్రీవారి శాసనాల గ్రంథరాజం

TIRUPATI, AUGUST 11:  Now the rare inscriptional works brought out by
famous epigraphist Late Sri Sadhu Subrahmanya Sastry will be made
easily available to the book lovers, as TTD has decided to sell eight
volumes of Tirumala inscriptions at 50% discount rates.
 
 It may be mentioned here that Sadhu Subrahmanya Sastry was
instrumental in bringing to light the copper plates containing the
inscriptions of Annamayya keertans from the ‘Bhandagaram’ in the
Tirumala temple.
 
As ‘Parupathyadar’, ‘Peishkar’ and epigraphist of the TTD, Sastry
meticulously researched on Tirumala’s history to bring out a
comprehensive volume on inscriptional works on TTD. These volumes
includes, The Early Inscriptions, The Inscriptions of Saluvaraya
Times, The Inscriptions of Krishnaraya Times, The inscriptions of
Achutaraya Times, The Inscriptions of Sadasivaraya Times, The
Inscriptions of Venkatapathyraya Times, Epigraphical Glossary on
Tirumala Tirupati Devasthanams Inscriptions, Report on the
Inscriptions of Devasthanams Collections with Illustrations.
 
 The great voluminous work by Sri Sastry includes the rare offering
made by different dynasties viz. Pallavas, Cholas, Pandyas,
Yadavarayas and many more. There are also rare interesting and
fascinating facts regarding Sri Tirumala and Sri Govindaraja Swamy
temple embedded in these volumes. Apart from the great work by Sri
Sastry also provided space to the Mahants, trademen,
commanders-in-chief of various dynasties, saint poets, sevas being
performed in the temple during that time in Srivari temple etc. This
book will act as a masterpiece to the historians, research scholars
and those who are eager to know the history of Tirumala shrine.
 
The price of a set of eight volumes of this great literary
masterpiece is Rs.990. However, TTD has now decided to sell these
books at a subsidised rate of Rs.495 only offering 50% discount.
 
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

తితిదే పుస్తక భాండాగారంలో శ్రీవారి శాసనాల గ్రంథరాజం

తిరుపతి, ఆగస్టు 11, 2013: శ్రీవారి ఆలయ చరిత్రను కళ్లకు కట్టేలా పలువురు రాజులు వేయించిన శాసనాల సమగ్ర సమాచారం ఎనిమిది సంపుటాల్లో తితిదే పుస్తక భాండాగారంలో పాఠక భక్తులకు అందుబాటులో ఉంది. తితిదేలో పురావస్తు శాస్త్రవేత్తగా పనిచేసిన శ్రీ సాధు సుబ్రమణ్యశాస్త్రి, శాసన అధ్యయనకారుడిగా పనిచేసిన శ్రీ విజయ రాఘవాచార్య ఈ గ్రంథాలను ఆంగ్లంలో రచించారు. వీటిని శ్రీ ఎం.ఆర్‌.కె.వినాయక్‌ తితిదే కార్యనిర్వహణాధికారిగా ఉన్న సమయంలో మొదటిసారిగా ముద్రించారు. ఈ ఎనిమిది పుస్తకాల సెట్‌ ధర రూ.990/- కాగా తితిదే 50 శాతం రాయితీపై రూ.495/-లకు విక్రయిస్తోంది.

ఇందులో 1. ఎర్లీ ఇన్‌స్క్రిప్షన్స్‌, 2. ఇన్‌స్కిప్షన్స్‌ ఆఫ్‌ సాలువ నరసింహ టైమ్‌, 3. ఇన్‌స్క్రిప్షన్స్‌ ఆఫ్‌ కృష్ణరాయ టైమ్‌, 4. ఇన్‌స్క్రిప్షన్స్‌ ఆఫ్‌ అచ్యుతరాయ టైమ్‌, 5. ఇన్‌స్క్రిప్షన్స్‌ ఆఫ్‌ సదాశివరాయ టైమ్‌, 6. ఇన్‌స్క్రిప్షన్స్‌ ఆఫ్‌ వెంకటపతిరాయ టైమ్‌, 7. ఎపిగ్రాఫికల్‌ గ్లాసరీ ఆన్‌ తిరుమల తిరుపతి దేవస్థానమ్స్‌ ఇన్‌స్క్రిప్షన్స్‌, 8. రిపోర్ట్‌ (ఆన్‌ ది ఇన్‌స్క్రిప్షన్స్‌ ఆఫ్‌ ది దేవస్థానం కలెక్షన్‌ విత్‌ ఇల్లస్ట్రేషన్స్‌) శీర్షికలతో పుస్తకాలున్నాయి.

తిరుమల శ్రీవారి ఆలయం, తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం, ఇతర ఆలయాల నుండి సేకరించిన శాసనాల సమగ్ర సమాచారాన్ని ఇందులో పొందుపరిచారు. పల్లవులు, చోళులు, పాండ్యులు, తెలుగు పల్లవులు, యాదవరాయలు, విజయనగరరాజుల్లో సంగమ వంశం, సాలువ వంశం, తులువ వంశం రాజులు, అరవీడు రాజుల కాలం నాటి శాసనాల వివరాలు ఉన్నాయి. ప్రతి శాసనాన్ని కక్షుణ్ణంగా పరిశోధించి అందులోని అంశాన్ని ఆంగ్లంలో అందరికీ అర్థమయ్యేలా పొందుపరిచారు. అంతేగాక ఆయా కాలాల్లో రాజులు శ్రీవారికి సమర్పించిన కానుకలు, స్వామివారిని దర్శించుకున్న ప్రముఖులు, ఆచార్య పురుషులు,  మహంతులు, అర్చకులు, ఆలయ అకౌంటెంట్లు, వివిధ దేశాల పౌరులు, వర్తకులు, శ్రీవారిని తమ సంగీత, సాహిత్యాలతో కీర్తించిన వాగ్గేయకారులు, కవులు, ప్రభువులు, రాణులు, ముఖ్యమంత్రులు, మంత్రులు, సైన్యాధ్యకక్షులు, అప్పట్లో జరుగుతున్న సేవలు, ఉత్సవాలు, శ్రీవారి వాహనాలు, ఉద్యానవనాలు, స్వామివారికి కానుకగా అందించిన అగ్రహారాలు, భూములు, ఆలయాల అభివృద్ధి, మరమ్మతులు తదితర విషయాలతో రూపొందించిన శాసనాలు ఈ గ్రంథాల్లో నిక్షిప్తమయ్యాయి. శ్రీవారి ఆలయ చరిత్రను తెలుసుకోవాలనుకునే భక్తులకు, పరిశోధకులకు ఈ గ్రంథాలు ఎంతగానో ఉపయోగపడతాయి. వీటిలో ఎంతో విలువైన, విస్తృతమైన సమాచారం ఉంది.
           
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.