TTD TO TRAIN SORTERS IN SORTING AND SEGREGATION OF HUMAN HAIR_ త‌ల‌నీలాలను వేరుచేసి స‌రికూర్చ‌డంపై సిబ్బందికి శిక్ష‌ణ‌

Tirumala, 20 January 2018: To enhance the efficiency of sorting and segregation of human hair which is being collected after the pilgrims offers their hair, the temple management of TTD is decided to train its sorters.

A meeting was held by Tirumala JEO Sri KS Sreenivasa Raju in Annamaiah Bhavan on Saturday evening with the human hair bidders and Human Hair and Hair Products Members and Exporters Association (HHHPMEA) in this regard and the deliberations went on for over two hours.

GM Auctions Sri Srinivasa Rao earlier given power point presentation on the sorting, drying, segregation processes involved. Later the JEO invited suggestions from the bidders to improve the quality of processes involved. The bidders expressed that the sorters of TTD should be given professional training in the methods involved in sorting and segregation which will help TTD as well bidders when they go for e-auction.

JEO directed the GM auctions to give training to the sorters in professional way of sorting, drying and segregation methods of human hair with the experts deployed by HHHPMEA from January 22 on wards for 20 days.

FACAO Sri O Balaji, DyEO Smt Nagarathna, over 17 bidders from AP, TS, TN, Karnataka were also present.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

త‌ల‌నీలాలను వేరుచేసి స‌రికూర్చ‌డంపై సిబ్బందికి శిక్ష‌ణ‌

తిరుమ‌ల‌, జ‌న‌వ‌రి 20, 2018: శ్రీ‌వారికి భ‌క్తులు స‌మ‌ర్పిస్తున్న త‌ల‌నీలాల‌ను మ‌రింత మెరుగ్గా వేరుచేసి, స‌రికూర్చ‌డంపై సిబ్బందికి(సార్ట‌ర్లు) శిక్ష‌ణ ఇవ్వాల‌ని టిటిడి నిర్ణ‌యించింది.

తిరుమ‌ల‌లోని అన్న‌మ‌య్య భ‌వ‌నంలో జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీ‌నివాస‌రాజు శ‌నివారం సాయంత్రం త‌ల‌నీలాల కొనుగోలుదారులు, హ్యూమ‌న్ హెయిర్ అండ్ హెయిర్ ప్రాడ‌క్ట్స్ మెంబ‌ర్స్ అండ్ ఎక్స్‌పోర్ట‌ర్స్(HHHPMEA)తో స‌మావేశం నిర్వ‌హించారు. ముందుగా జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్(వేలం) శ్రీ శ్రీ‌నివాస‌రావు త‌లనీలాలను ఆర‌బెట్ట‌డం, వేరుచేయ‌డం, నిల్వ ఉంచ‌డంపై ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జంటేష‌న్ ద్వారా వివ‌రించారు. అనంత‌రం జెఈవో కొనుగోలుదారుల నుంచి సూచ‌న‌లు సేక‌రించారు. కొనుగోలుదారులు మాట్లాడుతూ సార్ట‌ర్ల‌కు శిక్ష‌ణ ఇచ్చి మెరుగ్గా త‌ల‌నీలాల‌ను స‌రికూర్చ‌డం ద్వారా ఈ-వేలంలో మంచి ధ‌ర వ‌స్తుంద‌న్నారు. HHHPMEA నిపుణుల స‌హ‌కారంతో టిటిడిలోని సార్ట‌ర్ల‌కు జ‌న‌వ‌రి 22 నుంచి 20 రోజుల పాటు శిక్ష‌ణ ఇప్పించాల‌ని జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్‌(వేలం)ను జెఈవో ఆదేశించారు.

ఈ స‌మావేశంలో టిటిడి ఎఫ్ఏ,సిఏవో శ్రీ బాలాజి, క‌ల్యాణ‌క‌ట్ట డెప్యూటీ ఈవో శ్రీ‌మ‌తి నాగ‌ర‌త్న‌, ఏఈవో శ్రీ భాస్క‌ర్‌, ఎపి, తెలంగాణ‌, త‌మిళ‌నాడు, క‌ర్ణాట‌క రాష్ట్రాల నుంచి 17 మంది త‌ల‌నీలాల కొనుగోలుదారులు పాల్గొన్నారు.

టిటిడి ప్ర‌జాసంబంధాల అధికారిచే విడుద‌ల చేయ‌బ‌డిన‌ది.