TTD TRUST BOARD MEET _ తి.తి.దే పాలకమండలి సమావేశంలోని పలు కీలక నిర్ణయాలు
Tarigonda Vengamamba Annaprasada Bhavan on April 16 have been sent to the state food laboratory for verification and directed the concerned officials to claim for the damages from the United India Insurance Company soon.
ISSUED BY THE TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI.
తి.తి.దే పాలకమండలి సమావేశంలోని పలు కీలక నిర్ణయాలు
తిరుమల, 13 జూలై 2013 : తి.తి.దే పాలకమండలి అధ్యకక్షులు శ్రీ కనుమూరు బాపిరాజు నేతృత్వంలో తిరుమలలోని అన్నమయ్య భవనంలో శనివారంనాడు పాలకమండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాలకమండలి సభ్యులు శ్రీ చిట్టూరి రవీంద్ర, శ్రీ శ్రీనాథరెడ్డి, తి.తి.దే ఇ.ఓ శ్రీ ఎం.జి.గోపాల్, జె.ఇ.ఓలు శ్రీ కె.ఎస్.శ్రీనివాసరాజు, శ్రీ పి.వెంకట్రామిరెడ్డి, ముఖ్య నిఘా మరియు భద్రతాధికారి శ్రీ జివిజి.అశోక్‌కుమార్ తదితర అధికారులు పాల్గొన్నారు.
పాలకమండలి సమావేశంలో తీసుకున్న ముఖ్య నిర్ణయాలు
1. తితిదేలో రెండేళ్ల పాటు కార్యనిర్వహణాధికారిగా విశిష్టసేవలందించి బదిలీపై వెళ్లిన శ్రీ ఎల్వీ సుబ్రహ్మణ్యం సేవలను గుర్తు చేసుకుంటూ వీడ్కోలు పలుకుతూ తీర్మానం. అదేవిధంగా నూతన ఈవో శ్రీ ఎం.జి.గోపాల్‌కు స్వాగతం పలుకుతూ తీర్మానం.
2. ఉద్యోగుల ఇళ్లస్థలాలకు సంబంధించి కోర్టు కేసులను సత్వరమే పరిష్కరించడానికి కృషి చేయాలని అధికారులకు ఆదేశం. శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయానికి ఇచ్చిన స్థలానికి బదులుగా ప్రభుత్వం పేరూరు చెరువు ప్రాంతాన్ని తితిదేకి ఇచ్చిన విషయం విదితమే. అయితే ప్రాంతానికి బదులుగా మరొక ప్రాంతంలో స్థలం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరాలని నిర్ణయం. ఉద్యోగులకు సంబంధించి ఇతర న్యాయమైన కోరికలను పరిష్కరించేందుకు అధికారులు కృతనిశ్చయంతో ఉన్నారు.
3. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో శ్రేష్టమైన తిరుమంజన పీఠానికి వెండి తొడుగు చేయించాలని నిర్ణయించాము. గోవిందరాజస్వామివారికి అభిషేకం జరగదన్న విషయం విదితమే. కావున ఉత్సవమూర్తులకు జరిగే తిరుమంజన సేవ ముఖ్యమైనది. అందుకే చెక్కతో చేసిన తిరుమంజన పీఠాన్ని 53 లక్షలా 78 వేలా 429 రూపాయల ఖర్చుతో చేయించాలని నిర్ణయించాము. ఇందుకోసం 119.388 గ్రాముల వెండి అవసరం.
4. శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో చెక్కతో కూడిన ”చిన్నశేషవాహనం”, ”కల్పవృక్ష వాహనం”, ”తిరుచ్చి”, ”మకరతోరణం”లకు బంగారు తాపడం చేయించాలని నిర్ణయం. ఇందుకోసం 3 కోట్లా 20 లక్షలా 91 వేలా 728 రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా. 10.690 కేజీల 24 కేరట్ల బంగారం అవసరం అవుతుంది. (ఇందుకోసం 318 లక్షలా 24 వేల రూపాయలు ఖర్చు అవుతుంది. మిగిలిన మొత్తం తయారీ కూలీకి కేటాయించడమైనది)
5. తిరుమలలోని నిత్యాన్నప్రసాద భవనంలో ఏప్రిల్ 16వ తేదీ ఉదయం 5.15 గంటలకు జరిగిన అగ్నిప్రమాదంలో కాలిపోయిన ఆహార పదార్థాల నమూనాలను హైదరాబాద్‌లోని న్యాయవైద్య శాస్త్ర ప్రయోగశాలకు పంపాము. ఆ రిపోర్టులతో పాలసీ నంబరు : 051200 ద్వారా ”యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్” పరిధిలోకి వచ్చే డబ్బుకు వెంటనే క్లెయిమ్ చేయాలని అధికారులను ఆదేశించడమైనది.
6. శ్రీ వేంకటేశ్వర ఉన్నత వేదాధ్యయన సంస్థ ఆధ్వర్యంలో రాజమండ్రిలో తితిదే నిర్వహించిన ”శ్రీనివాస వేద విద్వత్” సదస్సులను ముందుండి నడిపించిన శ్రీ శృంగేరి శారదాపీఠం అధిపతి శ్రీశ్రీశ్రీ భారతీతీర్థస్వామికి ఒక లక్షలా నూట పదహారు రూపాయలు(1,00,116/-) గురుదక్షిణగా ఇవ్వాలని నిర్ణయం.
7. తిరుచానూరులో ప్రతిష్టాత్మకంగా నిర్మించతలపెట్టిన యాత్రికుల వసతి సముదాయం డిజైన్‌కు సంతృప్తి చెంది ఆమోదం. రూ.68 కోట్లతో నిర్మించనున్న ఈ సముదాయంలో చిన్న కల్యాణ మండపం, డార్మెటరీలు, వసతిగదులు, క్యాంటీన్‌లను కూడా నిర్మించడానికి తీర్మానించడమైనది. విశాలమైన 5.5 ఎకరాల స్థలంలో అవసరమైన పార్కింగ్ స్థలాలను, చిన్న కల్యాణకట్టలను కూడా ఏర్పాటు చేస్తున్నాము.
8. వైఎస్‌ఆర్ జిల్లాలోని గండి క్షేత్రం నందు గల శ్రీ వీరాంజనేయస్వామివారి ఆలయాన్ని తిరిగి రాష్ట్ర దేవాదాయ శాఖకు అప్పగించాలని నిర్ణయం.
9. తితిదే స్థానిక ఆలయాల అభివృద్ధి కోసం తిరుపతి జెఈవో శ్రీ పి.వెంకట్రామిరెడ్డి కన్వీనర్‌గా, పాలకమండలి సభ్యులు శ్రీ చిట్టూరి రవీంద్ర, శ్రీ శ్రీనాథరెడ్డి సభ్యులుగా కమిటీ ఏర్పాటు. అభివృద్ధి పనులపై వచ్చే పాలకమండలి సమావేశంలోగా నివేదిక సమర్పించాలని ఆదేశం.
కాగా తితిదే శ్రీ వేంకటేశ్వర నిత్యాన్నదానం ట్రస్టుకు తిరుపతికి చెందిన శ్రీ చేతన కన్‌స్ట్రక్షన్స్ ప్రతినిధులు రూ.10 లక్షల చెక్కును ఛైర్మన్ శ్రీ కనుమూరు బాపిరాజు చేతులమీదుగా విరాళంగా అందించారు.
తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.