TTD WAS AWARDED PRESTIGIOUS GREENERY AWARD_ టిటిడికి ప్రతిష్టాత్మక ఎపి గ్రీన్ అవార్డు

Tirumala, 15 July 2018: For its initiative in developing green belt in Tirumala and beautification of its environs, Tirumala Tirupati Devasthanams has been awarded with the prestigious AP Green Awards by State Government.

DFO Sri D Phani Kumar Naidu received the award from Honourable CM of AP Sri N Chandrababu Naidu at an awards ceremony held at Nuziveedu on Saturday.

TTD was given first prize under the category of Public Corporate Institutions.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

టిటిడికి ప్రతిష్టాత్మక ఎపి గ్రీన్ అవార్డు

జూలై 15, తిరుమల 2018: తిరుమలలో పచ్చదనాన్ని అభివృద్ధి చేయడంతోపాటు పరిసరాలను సుందరంగా తీర్చిదిద్దినందుకు గాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మక గ్రీన్ అవార్డును తిరుమల తిరుపతి దేవస్థానానికి ప్రదానం చేసింది.

కృష్ణా జిల్లా నూజివీడులో శనివారం జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గౌ.. శ్రీ నారా చంద్రబాబు నాయుడు నుండి గ్రీన్ అవార్డును టిటిడి డి.ఎఫ్.ఓ శ్రీ డి.ఫణికుమార్ నాయుడు స్వీకరించారు. పబ్లిక్ కార్పొరేట్ ఇనిస్టిట్యూషన్స్ విభాగంలో టిటిడి మొదటి బహుమతిని సాధించింది.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.