TTD WILL ORGANIZE SRIVARI SALAKATLA BRAHMOTSAVAMS THIS YEAR IN A BIG WAY-TTD EO _ అంగరంగ వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తాం

Tirumala, 10 September 2022: All departments in TTD are gearing up to organize the annual Srivari Brahmotsavams in Tirumala this year in a big manner, said TTD EO Sri AV Dharma Reddy. Before taking calls from pilgrims during the Dial your EO programme held at Annamaiah Bhavan in Tirumala on Saturday, the EO informed pilgrim devotees about the ongoing arrangements for the ensuing annual Brahmotsavams and various other development activities taken up by TTD.

 

 

The traditional fete of Koil Alwar Thirumanjanam will be observed ahead of Srivari Brahmotsavam on September  20, from morning 6 am to 11 am.

 

The Ankurarpanam fete will be held on the night of September 26 between 7pm and 8pm.

 

On the first day, September 27th evening the Dwajarohanam will be observed and later at night 9pm and 11pm the first Vahana Seva of Pedda Sesha vahana is held on Mada streets.

 

On the same day, the Honourable CM of AP Sri YS Jaganmohan Reddy will present Pattu Vastrams on behalf of the State Government to Srivari temple.

 

After a gap of 2 years (due to Corona restrictions) all vahana sevas will be held in holy Mada streets daily mornings, between 8am and 10am) and in the evening between 7pm and 9pm.

 

While on Garuda Seva on October 1, the Garuda Vahanam will be carried out from 7pm onwards till 1am or 2am next day till every devotee witnesses the grandeur of Srivaru on His favourite Vahanam.

 

 

All Arjita sevas and privileged Darshans cancelled.

 

 

With regard to accommodations, TTD has decided to increase the online quota to 50% availability. In view of limited rooms at Tirumala, devotees requested to take rooms at Tirupati for night halts.

 

 

ANNA PRASADAM DISTRIBUTION:

 

 

During normal days Anna Prasadam distribution at Matrusri  Tarigonda Vengamamba Anna Prasadam Bhavan is from morning 9am and 11pm.

 

However, during Brahmotsavam Anna Prasadam distribution will be from morning 8am and 11.30 pm.

 

On the Garuda Vahana day it will be till 1.00 am in early morning of next day.

 

 

1342 SV TEMPLES CONSTRUCTION UNDER SRIVANI TRUST

 

 

As part of its mandate for Sanatana Hindu dharma propagation TTD has taken up a mission to construct 1342 Sri Venkateshwara temples in SC/ST/BC/ and Fishermen hamlets in coordination with Samarasata Seva Foundation across AP and Telangana.

 

So far 652 open heart surgeries have been carried out in SP Hridayalaya giving new lease of life to many infants.

 

Sri Venkateswara Vaibhavotsavams to take forward all Arjita Sevas to the doorsteps of devotees at different cities. Successfully conducted in Nellore between August 16 and 20 and will be conducted in Hyderabad between October 11 and 15.

 

Huge demand for Panchagavya Products, Agarbattis and Dry Flower Technology photos of deities.

 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

అంగరంగ వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తాం

  • భక్తులందరికీ సంతృప్తి కరంగా వాహన సేవల దర్శనానికి ఏర్పాట్లు
  • డయల్ యువర్ ఈవో లో టీటీడీ ఈవో శ్రీ ఎ వి ధర్మారెడ్డి

తిరుమల 10 సెప్టెంబరు 2022: కోవిడ్ వల్ల రెండేళ్ళుగా నాలుగు మాడ వీధుల్లో శ్రీవారి శ్రీవారి బ్రహ్మోత్సవాలు నిర్వహించలేక పోయామని టీటీడీ ఈవో శ్రీ ఎ వి ధర్మారెడ్డి తెలిపారు . సెప్టెంబరు 27 నుంచి అక్టోబరు 5వ తేదీ దాకా నాలుగు మాడ వీధుల్లో అంగరంగ వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తామన్నారు . నాలుగు మాడ వీధుల్లో ఉండే ప్రతిభక్తుడికి సంతృప్తి కరంగా వాహన సేవల దర్శనం కల్పించడానికి ఏర్పాట్లు చేస్తామని ఆయన చెప్పారు .

తిరుమల అన్నయ్య భవనంలో శనివారం డయల్ యువర్ ఈవో కార్యక్రమం నిర్వహించారు . ఈ సందర్బంగా ఈవో టీటీడీ చేపట్టిన పలు కార్యక్రమాల గురించి భక్తులకు వివరించారు .

-. సెప్టెంబరు 27 నుండి అక్టోబరు 5వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని సెప్టెంబరు 20న ఉదయం 6 నుంచి 11 గంటల మధ్య సంప్రదాయబద్ధంగా ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహిస్తాం.

– సెప్టెంబర్‌ 26న రాత్రి 7 నుండి 8 గంటల మధ్య అంకురార్పణ జరుగుతుంది .

-. సెప్టెంబరు 27న మొదటి రోజు సాయంత్రం 5.45 నుండి 6.15 గంటల వరకు మీన లగ్నంలో ధ్వజారోహణం, రాత్రి 9 నుండి 11 గంటల వరకు పెద్ద శేష వాహనం నిర్వహిస్తాం .

-. ధ్వజారోహణం రోజున రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్‌.జగన్‌ మోహన్‌ రెడ్డి శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు.

-. ప్రతిరోజు ఉదయం 8 నుండి 10 గంటల వరకు, రాత్రి 7 నుండి 9 గంటల వరకు స్వామివారి వాహన సేవలు జరుగుతాయి. అయితే గరుడ వాహనం రాత్రి 7 నుండి తెల్లవారుజామున 2 గంటల వరకు నిర్వహిస్తాం.

– అక్టోబర్‌ 5న తొమ్మిదో రోజు ఉదయం 6 గంటలకు చక్రస్నానం, అదేవిధంగా రాత్రి 9 నుండి 10 గంటల వరకు ధ్వజావరోహణం నిర్వహిస్తాం.

-. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు విచ్చేసే సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ సర్వదర్శనం మాత్రమే అమలు చేయాలని టీటీడీ నిర్ణయించింది.

-. భక్తుల రద్దీని దృష్ట్యా విఐపి బ్రేక్‌ దర్శనాలు, వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లల తల్లిదండ్రులు, ఎన్‌ఆర్‌ఐలు, రక్షణ సిబ్బందికి ప్రత్యేక దర్శనం తదితర ప్రివిలేజ్డ్‌ దర్శనాలను రద్దు చేశాం.

-. ఆర్జిత సేవలు, రూ.300/- దర్శన టికెట్లతోపాటు శ్రీవాణి ట్రస్టు దాతలకు, ఇతర ట్రస్టుల దాతలకు దర్శన టికెట్లు రద్దు చేశాం .

-. గదులకు సంబంధించి 50 శాతం ఆన్‌లైన్‌లో భక్తులు బుక్‌ చేసుకునేందుకు వీలుగా అందుబాటులో. ఉంచాము .

-. తిరుమలలో గదుల లభ్యత పరిమితంగా ఉన్న కారణంగా భక్తులు తిరుపతిలోనే గదులు పొంది బస చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం.

-. సాధారణ రోజుల్లో మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో ఉదయం 9 నుండి రాత్రి 11 గంటల వరకు అన్నప్రసాదవితరణ ఉంటుంది.

-. బ్రహ్మోత్సవాల రోజుల్లో ఉదయం 8 నుండి రాత్రి 11.30 గంటల వరకు అన్నప్రసాద వితరణ చేస్తాం.

-. గరుడసేవనాడు రాత్రి 1 గంట వరకు భక్తులకు అన్నప్రసాద వితరణ ఉంటుంది.

-. వాహనసేవల ముందు ఆధ్యాత్మిక భావన ఉట్టిపడేలా ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల నుండి అపురూపమైన కళారూపాల ప్రదర్శనలు ఏర్పాటు చేస్తాం.

-. అదేవిధంగా, తిరుమల ఆస్థానమండపం, తిరుపతిలోని మహతి కళాక్షేత్రం, అన్నమాచార్య కళామందిరం, రామచంద్ర పుష్కరిణి వద్ద సంగీత, నృత్య కార్యక్రమాలు నిర్వహిస్తాం.

-. సనాతన హిందూ ధర్మ వ్యాప్తిలో భాగంగా ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మత్స్యకార ప్రాంతాల్లో శ్రీవాణి ట్రస్టు ఆధ్వర్యంలో సమరసత సేవా ఫౌండేషన్‌ సహకారంతో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1342 ఆలయాల నిర్మాణం చేపట్టేందుకు చర్యలు తీసుకున్నాం.

-. మొదటి దశలో 502 ఆలయాల నిర్మాణం పూర్తయింది. ఇక్కడ భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తున్నాం .

– ఈ ఆలయాల్లో హిందూ ధర్మప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో భజన సామగ్రి, ఈ ఆలయాల్లో అర్చకులుగా నియమించే వారికి శ్వేత ఆధ్వర్యంలో నిత్యపూజా విధానంపై శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నాము .

-. రెండో దశలో రాష్ట్రంలోని 26 జిల్లాల్లో ఎంపిక చేసిన గ్రామాల్లో రూ.10 లక్షల వ్యయంతో 111 ఆలయాలను నిర్మిస్తున్నాము .

-. నమామి గోవింద బ్రాండ్‌తో టిటిడి తయారుచేస్తున్న 15 రకాల పంచగవ్య ఉత్పత్తులకు భక్తుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది.

-. అదేవిధంగా, అగరబత్తులను భక్తులు విశేషంగా కొనుగోలు చేస్తున్నారు.

– పంచగవ్య ఉత్పత్తులు, అగరబత్తుల విక్రయాల ద్వారా వస్తున్న ఆదాయాన్ని గోశాల అభివృద్ధికి వినియోగిస్తున్నాం.

-. టిటిడి ఆలయాల్లో వినియోగించిన పుష్పాలను ఉపయోగించి డ్రైఫ్లవర్‌ టెక్నాలజీతో తయారుచేస్తున్న శ్రీవారి చిత్రపటాలు, కీచైన్లు, ఇతర ఉత్పత్తులను కూడా భక్తులు విరివిగా కొనుగోలు చేస్తున్నారు.

-. తిరుమలకు వచ్చే భక్తులందరూ స్వామివారికి జరిగే నిత్య, వారోత్సవాలు, సేవలు తిలకించడం సాధ్యంకాదు. వయోభారం, ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా అనేక మంది స్వామివారిని ఎక్కువ సార్లు చూసి తరించే అవకాశం ఉండదు.
వ భక్తులకు ఇబ్బంది లేకుండా చేయడం కోసం తిరుమల శ్రీవారి ఆలయంలో నిర్వహించే నిత్య, వార సేవలు , ఉత్సవాలు ఇతర ప్రాంతాల్లోని భక్తులు దర్శించేందుకు వీలుగా టిటిడి పలు ప్రాంతాల్లో శ్రీవేంకటేశ్వర వైభవోత్సవాలను నిర్వహిస్తోంది.

-. ఆగస్టు 16 నుండి 20వ తేదీ వరకు నెల్లూరులో వైభవోత్సవాలు నిర్వహించాం.

-. అక్టోబరు 11 నుండి 15వ తేదీ వరకు హైదరాబాద్‌లోని ఎన్‌టిఆర్‌ స్టేడియంలో శ్రీ వేంకటేశ్వర వైభవోత్సవాలు నిర్వహిస్తాం. భక్తులు ఈ ఉత్సవాల్లో పాల్గొని స్వామివారి సేవలను తిలకించి ఆశీస్సులు పొందాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము .

-. చిన్నపిల్లలకు వచ్చే అనేక వ్యాధులకు ఉచితంగా శస్త్రచికిత్సలు, వైద్యసేవలు అందించడం కోసం భక్తుల విరాళాలతో శ్రీ పద్మావతి చిన్నపిల్లల సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి త్వరలో నిర్మాణం కానుంది.

-. ప్రస్తుతం ఉన్న చిన్నపిల్లల ఆసుపత్రిలో ఇప్పటివరకు 652 గుండె శస్త్రచికిత్సలు నిర్వహించి పేద పిల్లల ప్రాణాలు కాపాడాం. శ్రీవారి దయతో సుదూర ప్రాంతమైన బంగ్లాదేశ్‌ వంటి దేశాల నుండి తల్లిదండ్రులు తమ పిల్లలను తీసుకొచ్చి ఉచితంగా గుండె ఆపరేషన్లు చేయించుకుని వెళ్లారు.

-. గో ఆధారిత ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులతో తిరుమల శ్రీవారికి నైవేద్యం, ఇతర ప్రసాదాలు తయారుచేసేందుకు వీలుగా 12 రకాల ఉత్పత్తులు సేకరించేందుకు రాష్ట్ర రైతు సాధికార సంస్థ, మార్క్‌ఫెడ్‌తో ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది.

-. ప్రకృతి వ్యవసాయ రైతులను ప్రోత్సహించేందుకు కనీస మద్దతు ధర కంటే కొంత ఎక్కువ చెల్లిస్తున్నాం.

-. తిరుమలలో అన్నప్రసాదాల తయారీకి 2004వ సంవత్సరం నుండి ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుండి దాదాపు 17 మంది దాతలు రూ.200 కోట్లకుపైగా విలువైన కూరగాయలను విరాళంగా అందించారు. ప్రకృతి వ్యవసాయంతో కూరగాయలు పండించాలని రైతులకు విజ్ఞప్తి చేస్తున్నాం.

ఆగస్టు నెలలో నమోదైన వివరాలు :

దర్శనం :

– శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య – 22.22 లక్షలు.

హుండీ :
– హుండీ కానుకలు – రూ.140.34 కోట్లు.

లడ్డూలు :
– విక్రయించిన శ్రీవారి లడ్డూల సంఖ్య – 1.05 కోట్లు.

అన్నప్రసాదం :
– అన్నప్రసాదం స్వీకరించిన భక్తుల సంఖ్య – 47.76 లక్షలు.

కల్యాణకట్ట :
– తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య – 10.85 లక్షలు.

టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది