TTD WOMEN’S DAY IN SPWDPGC ON MARCH 8_ మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి ఏర్పాట్లు పూర్తి

Tirupati, 7 March 2018: The International Women’s Day by TTD Women Employees will be observed with aplomb in the SPW Degree and PG college on March 8.

TTD EO Sri Anil Kumar Singhal, JEOs Sri KS Sreenivasa Raju, Sri P Bhaskar, CVSO Sri A Ravikrishna will grace the occasion.

While the keynote address will be delivered by Telugu Department HoD Dr K Madhujyothi of SPMVV and renowned Diabetologist Dr P Krishnaprasanthi.

There will be felicitation to retired officers as well as the women employees who are going to retire in this year.

In the morning session, there will be cultural programmes while in the afternoon session there will be meeting between 3pm and 6pm.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి ఏర్పాట్లు పూర్తి

తిరుపతి, 2018 మార్చి 07: టిటిడి ఆధ్వర్యంలో మార్చి 8వ తేదీ గురువారం తిరుపతిలోని శ్రీపద్మావతి మహిళా డిగ్రీ మరియు పిజి కళాశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.

ఉదయం 10.30 నుంచి 12.30 గంటల వరకు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు సభా కార్యక్రమం ఉంటుంది. ఈ సందర్భంగా శ్రీపద్మావతి మహిళా వర్సిటీ తెలుగు విభాగాధిపతి ఆచార్య కె.మధుజ్యోతి, ప్రముఖ డయాబెటాలజిస్ట్‌ డా|| పి.కృష్ణప్రశాంతి ప్రసంగిస్తారు. అనంతరం స్విమ్స్‌ కార్డియాలజి ప్రొఫెసర్‌ డా|| వి.వనజాక్షమ్మ, తంజావూరుకు చెందిన ప్రముఖ వీణ కళాకారిణి డా|| ఆర్‌.కౌసల్యను సన్మానిస్తారు. అదేవిధంగా, 2018 మార్చి నుండి 2019 ఫిబ్రవరి వరకు పదవీ విరమణ పొందనున్న మహిళా ఉద్యోగులకు సన్మాన కార్యక్రమం ఉంటుంది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ పాల్గొననున్నారు. టిటిడి సంక్షేమ విభాగం డెప్యూటీ ఈవో శ్రీమతి ఆర్‌.స్నేహలత ఈ కార్యక్రమ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.