VILAMBI UGADI CELEBRATIONS ON MARCH 18_ మార్చి 18న శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఉగాది వేడుకలు

Tirupati, 7 March 2018: Koil Alwar Tirumanjanam in Sri Govinda Raja Swamy temple will be observed on March 13 in connection with Sri Vilambi Nama Ugadi on March 18.

The entire temple will be cleansed with “Parimalam” mixture, which is a traditional way of cleaning the temple premises.

This fete will be observed from 6am to 8:30am and devotees will be allowed for darshan from 9am onwards.

Meanwhile Ugadi Asthanam will be performed on March 18 between 5:30pm to 7pm along with Panchanga Sravanam.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

మార్చి 18న శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఉగాది వేడుకలు

మార్చి 13న కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

తిరుపతి, 2018 మార్చి 07: ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుపతిలో వెలసిన శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో మార్చి 18వ తేదీ ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

ఇందులో భాగంగా ఉదయం 5.00 గంటలకు సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాల, కొలువు, పంచాంగ శ్రవణం, అర్చన నిర్వహిస్తారు. సాయంత్రం 5.30 నుండి రాత్రి 7.00 గంటల వరకు పంచాంగ శ్రవణం, ఉగాది ఆస్థానం నిర్వహించనున్నారు.

కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో మార్చి 13వ తేదీ మంగళవారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం ఘనంగా నిర్వహించనున్నారు. ఉగాదికి ముందు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ.

ఈ సందర్భంగా మంగళవారం తెల్లవారుజామున సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాలసేవ, కొలువు, పంచాంగశ్రవణం నిర్వహిస్తారు. ఉదయం 6.00 నుండి 8.30 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జరుగనుంది. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అని వస్తువులను నీటితో శుద్ధి చేసిన అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేస్తారు. అనంతరం భక్తులను ఉదయం 9.00 గంటల నుండి సర్వదర్శనానికి అనుమతిస్తారు.

తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.