TTD’S DARSHAN FOR AGED AND PHC GETS PAT _ వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లల దర్శనానికి టిటిడి ప్రాధాన్యం

Tirumala, 17 May 2018: The special arrangements initiated for the Physically Handicapped and Aged pilgrims by TTD under the instructions of TTD EO Sri Anil Kumar Singhal has been receiving laurels from the pilgrims falling under this category.

After taking reigns as TTD EO Sri AK Singhal inspected the aged and PHC line and immediately instructed for some amendments. Special counters were constructed opposite SV Museum for these pilgrims to issue darshan tokens on their Aadhaar or Voter ID cards. Every day 1400 tokens are issued with 700 in morning slot darshan at 10am and another 700 in evening slot darshan at 3pm. The pilgrims will get two ladduson subsidy on payment of Rs.20 or four laddus on payment of Rs.70.

SPECIAL ARRANGEMENTS

TTD has also arranged special transportation facility in 2 battery cars and a van for these pilgrims to drop them at south mada street. A massive complex with three waiting halls with over 1000 seat capacity was also constructed with toilet facility. The cell phone and luggage deposit counter is also arranged where they can get back from same place after darshan.

SRIVARI SEVAKULU ASSIST THEM FOR DARSHAN

The pilgrims of this category are sent through a separate queue line and for those who cannot walk, srivari sevakulu will assist such pilgrims. The pilgrims falling under this category are ensured hassle free darshan.

ANNAPRASADAMS SERVED

During morning darshan slot, these pilgrims are provided with coffee, milk and breakfast while for those who wait in the halls for evening slot darshan are being served with sambar rice and curd rice.

TWO SLOTS ON ALL DAYS EXCEPT ON FRIDAYS

Except for Fridays and during Koil Alwar Tirumanjanam, on all other days, darshan is provided in two slots. Where as on Fridays only evening slot is available.

SPECIAL PRIVILEGE DARSHAN CANCELLED IN MAY AND JUNE

TTD has also introduced Special Privilege Darshan enabling this darshan to 4000 pilgrims on any two lean days in a month since August last apart from the daily issuance of 1400 tokens to this category pilgrimed.

In the wake heavy summer rush, TTD has cancelled this special Privilege tokens for the months of May and June where as the regular issuance 1400 tickets is continuing.

Similarly TTD has also cancelled Privilege Darshan for the parents with children below five years of age on these two months where as allowing parents with infants below one year every day between 9am and 7pm through Supadham entry as usual.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లల దర్శనానికి టిటిడి ప్రాధాన్యం

మే 17, తిరుమల 2018 ; ప్రపంచప్రఖ్యాత ధార్మిక సంస్థ అయిన తిరుమల తిరుపతి దేవస్థానం భక్తుల సేవే పరమావధిగా అనేక వసతులు కల్పిస్తోంది. తిరుమలకు వచ్చే భక్తులు ఏమాత్రం ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా ఉచితంగా దర్శనం, అన్నప్రసాదాలు, తాగునీరు అందిస్తోంది. వయసు పైబడిన(65 సం||ల పైన)వారు, శారీరక, మానసిక వైకల్యంతో బాధపడుతున్నవారు, ఏడాదిలోపు చంటిపిల్లల తల్లిదండ్రులకు ఉన్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని టిటిడి మరింత జాగ్రత్తగా వ్యవహరించి దర్శనం విషయంలో ప్రాధాన్యం కల్పిస్తోంది.

తిరుమలలోని ఎస్వీ మ్యూజియం ఎదురుగా వృద్ధులు, దివ్యాంగులకు టోకెన్లు ఇచ్చేందుకు 7 కౌంటర్లను టిటిడి ఏర్పాటుచేసింది. ఇక్కడ ఉదయం 10 గంటల స్లాట్‌కు 700 మందికి, మధ్యాహ్నం 3 గంటల స్లాట్‌కు 700 మందికి టోకెన్లు జారీ చేస్తారు. ఉదయం 7 గంటల నుండి టోకెన్ల జారీ మొదలవుతుంది. రెండు స్లాట్లకు కలిపి ఉదయం నుండే టోకెన్లు మంజూరుచేస్తారు. శుక్రవారం, కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం రోజుల్లో మాత్రం ఉదయం 10 గంటల స్లాట్‌ ఉండదు. మధ్యాహ్నం 3 గంటల స్లాట్‌లో 700 మందిని మాత్రమే అనుమతిస్తారు.

ఇక్కడ వ్యక్తిగతంగా ఫొటో తీసుకోవడంతోపాటు ఆధార్‌ లేదా ఓటర్‌ గుర్తింపుకార్డును నమోదు చేసుకుంటారు. రాయితీపై రూ.20/-కి రెండు లడ్డూలు లేదా రూ.70/-కి నాలుగు లడ్డూలు కొనుగోలు చేయవచ్చు. ఈ కౌంటర్ల వద్ద వృద్ధులు, దివ్యాంగులు కూర్చునేందుకు బెంచీలు ఏర్పాటుచేశారు. ఇక్కడినుండి 2 బ్యాటరీ వాహనాలు, ఒక వ్యాన్‌ ద్వారా వృద్ధులు, దివ్యాంగులను దక్షిణ మాడ వీధి వద్దగల వేచి ఉండే హాళ్లకు తీసుకెళతారు. మొత్తం 3 హాళ్లలో వెయ్యి మందికిపైగా కూర్చునేందుకు కుర్చీలు ఏర్పాటుచేశారు. మరుగుదొడ్ల వసతి ఉంది. ఉదయం పాలు, అల్పాహారం, మధ్యాహ్నం అన్నప్రసాదాలను పంపిణీ చేస్తారు. ఈ హాళ్లలో టివి ద్వారా ఆధ్యాత్మిక కార్యక్రమాలను ప్రసారం చేస్తున్నారు. సెల్‌ఫోన్లు, లగేజి డిపాజిట్‌ చేసే సౌకర్యం కూడా ఉంది. దర్శనం తరువాత తిరిగి ఇక్కడే వీటిని పొందొచ్చు. వేచి ఉండే హాళ్ల నుండి ప్రత్యేక క్యూలైన్‌ ద్వారా దర్శనానికి పంపుతారు. నడవలేనివారికి శ్రీవారి సేవకులను సహాయకులుగా పంపుతారు.

ఏడాదిలోపు చంటిపిల్లల దర్శనం :

ఒక సంవత్సరంలోపు చంటిపిల్లలకు, వారి తల్లిదండ్రులకు సుపథం మార్గం ద్వారా ప్రవేశం కల్పిస్తారు. ఉదయం 9 నుండి రాత్రి 7 గంటల వరకు ఈ మార్గం ద్వారా దర్శనానికి అనుమతిస్తారు. చంటిపిల్లల తల్లిదండ్రులకు ఇద్దరికి కలిపి నాలుగు లడ్డూలను రాయితీపై రూ.40/-కి అందిస్తారు.

అదనపు ప్రత్యేక దర్శనాలు రద్దు :

గత ఏడాది ఆగస్టు నెల నుండి టిటిడి ప్రతినెలా రెండు సాధారణ రోజుల్లో 4 వేల మంది వృద్ధులు, దివ్యాంగులకు, అదేవిధంగా 5 సంవత్సరాలలోపు చిన్నారుల తల్లిదండ్రులకు శ్రీవారి ప్రత్యేక దర్శనం కల్పిస్తున్న విషయం విదితమే.

వేసవి సెలవుల నేపథ్యంలో తిరుమలలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని మే, జూన్‌ నెలల్లో వయోవృద్ధులు, దివ్యాంగులు, 5 సంవత్సరాలలోపు చంటి పిల్లలు, వారి తల్లిదండ్రులకు కల్పించే రెండు రోజుల ప్రత్యేక దర్శనాలను టిటిడి రద్దు చేసింది.

ప్రతిరోజూ వృద్ధులు, దివ్యాంగులు, ఏడాది లోపు చంటిపిల్లల తల్లిదండ్రులకు కల్పించే దర్శన విధానాన్ని యధావిధిగా టిటిడి అమలుచేస్తోంది.


టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.