TTD’S TRIAL-RUN OF SSD A HUGE SUCCESS-THANKS TO PILGRIMS-TIRUMALA JEO_ ప్రయోగాత్మక సమయ నిర్దేశిత సర్వదర్శనం విజయవంతం

Tirumala, 23 December 2017: Describing the six-day trial run of Slotted Sarva Darshan (SSD) counters a huge success, Tirumala JEO Sri KS Sreenivasa Raju thanked the pilgrims for understanding the goal of TTD and co-operating with the management.

Curtains came down to the six-day trial run of SSD by 6pm on Saturday in Tirumala. In this connection, speaking to media persons, Tirumala JEO said, according to the instructions of honourable Chief Minister of Andhra Pradesh Sri N Chandrababu Naidu who wished to provide hassle-free and easy darshan to pilgrims without long hours of waiting, TTD mulled this innovative idea of SSD on an experimental basis which received rousing reception from pilgrim circles.

In the last five days about 60 thousand pilgrims utilised this Aadhaar-based free darshan facility while on Saturday (up to 5pm) over 25 thousand pilgrims have taken the SSD. I compliment all the TTD officers and employees who were deployed for this massive task for making it a unanimous success with their team work. I also thank our Executive Officer Sri Anil Kumar Singhal who had faith in us and given us full freedom to execute the innovative idea in a successful manner”, he maintained.

Adding further the JEO said, based on the feedback from pilgrims, we will implement this system on totto by setting up counters in Tirupati also likely in second week of March”, he informed.


ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs,TIRUPATI

ప్రయోగాత్మక సమయ నిర్దేశిత సర్వదర్శనం విజయవంతం

సహకరించిన భక్తులందరికీ ధన్యవాదాలు :టిటిడి తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు

డిసెంబరు 23, తిరుమల, 2017: తిరుమలలో ఆరు రోజుల పాటు ప్రయోగాత్మకంగా అమలుచేసిన సమయ నిర్దేశిత సర్వదర్శన విధానం విజయవంతమైందని టిటిడి తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు తెలిపారు. ఈ విధానాన్ని అర్థం చేసుకుని సహకరించిన భక్తులకు ఈ సందర్భంగా జెఈవో ధన్యవాదాలు తెలియజేశారు.

ఆరు రోజులపాటు చేపట్టిన ప్రయోగాత్మక సమయ నిర్దేశిత సర్వదర్శన విధానం శనివారం సాయంత్రం 6 గంటలకు ముగిసింది. ఈ సందర్భంగా జెఈవో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌ|| శ్రీ నారా చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు భక్తులు ఎక్కువ సమయం కంపార్ట్‌మెంట్లలో వేచి ఉండకుండా సులభతరంగా శ్రీవారిని దర్శించుకునేలా ఏర్పాట్లు చేపట్టినట్టు తెలిపారు. టిటిడి ప్రయోగాత్మకంగా అమలుచేసిన సమయ నిర్దేశిత సర్వదర్శన విధానానికి భక్తుల నుంచి విశేష స్పందన లభించిందన్నారు. మొదటిరోజు 12,255, రెండో రోజు 11,964, మూడోరోజు 12,920, నాలుగో రోజు 14,386, ఐదో రోజు 17,649, ఆరో రోజైన శనివారం 26,873 కలిపి మొత్తం 96,047 టోకెన్లు జారీ చేసినట్టు తెలిపారు. భక్తుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని మార్చి రెండో వారం నుంచి పూర్తిస్థాయిలో అమలుచేస్తామన్నారు. తిరుపతిలోనూ సర్వదర్శనం కౌంటర్లను ఏర్పాటుచేస్తామన్నారు. మొత్తం 117 కౌంటర్లలో 500 మంది సిబ్బంది డెప్యుటేషన్‌పై విధులు నిర్వహించారని తెలిపారు.

టిటిడి అధికారులకు, సిబ్బందికి ధన్యవాదాలు :

సమష్టిగా పనిచేసి ఈ విధానాన్ని విజయవంతం చేసిన టిటిడి అధికారులకు, సిబ్బందికి ఈ సందర్భంగా జెఈవో ధన్యవాదాలు తెలియజేశారు. తమపై నమ్మకంతో పూర్తి స్వేచ్ఛనిచ్చిన ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు. అదేవిధంగా, ఐటి, శ్రీవారి ఆలయం, రిసెప్షన్‌, ట్రాన్స్‌పోర్టు, విజిలెన్స్‌, ఇంజినీరింగ్‌, రేడియో బ్రాడ్‌కాస్టింగ్‌, ప్రజాసంబంధాల విభాగం, ఎలక్ట్రికల్‌ విభాగాల అధికారులకు, సిబ్బందికి ప్రత్యేక అభినందనలు తెలిపారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.