SSD IS A HUGE HIT AMONG PILGRIMS-TTD EO_ సమయ నిర్దేశిత సర్వదర్శన విధానంపై భక్తులు పూర్తి సంతృప్తి : టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌

MORE REFORMS SOON IN SSD BASED ON PILGRIM FEEDBACK

Tirumala, 23 December 2017: The Slotted Sarva Darshan (SSD) counter implemented by Tirumala Tirupati Devasthanams (TTD) on a trial-basis from December 18 to 23 received overwhelming response from pilgrims circles said TTD EO Sri Anil Kumar Singhal.

The EO along with Tirumala JEO Sri KS Sreenivasa Raju inspected the counters in Tirumala on Saturday. At ANC counter he interacted with the pilgrims who thronged to book different slot tokens available in Sarva Darshan. The pilgrims welcomed the move of TTD which facilitated them free darshan of Lord Venkateswara within couple of hours without waiting in queue lines and compartments.

Later speaking to media persons, the EO said, the management will soon bring reforms in the SSD based on feed back given by pilgrims. “We have now observed that it is taking nearly 32-33 seconds to capture the photo and aadhaar details per pilgrim. But in future we want to reduce the time further by taking direct Aadhaar authentication as the advise of our technical experts and negotiate the same with UID officers to issue SSD tokens to more number of pilgrims. In future, we are contemplating to establish the counters in Tirupati also. Before we commence this system in a full fledged manner we want to assess the correct number of counters required to establish both at Tirupati and Tirumala, staff needed to run counters and invite works contract. Our aim is to see that pilgrims are not put to any sort of inconvenience”, he added.

SE II Sri Ramachandra Reddy, GM Transport and IT Chief Sri Sesha Reddy, VGO Sri Ravinder Reddy were also present.


ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs,TIRUPATI

సమయ నిర్దేశిత సర్వదర్శన విధానంపై భక్తులు పూర్తి సంతృప్తి : టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌

డిసెంబరు 23, తిరుమల, 2017: తిరుమలకు విచ్చేసే భక్తులకు నిర్ణీత సమయంలో శ్రీవారి దర్శనం కల్పించేందుకు ఉద్దేశించిన సమయ నిర్దేశిత సర్వదర్శన విధానంపై భక్తులు పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారని టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ తెలిపారు. తిరుమలలోని ఏఎన్‌సి ప్రాంతంలో ఏర్పాటుచేసిన సర్వదర్శనం కౌంటర్లను శనివారం జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజుతో కలిసి ఈవో పరిశీలించారు.

ఈ సందర్భంగా ఈవో మీడియాతో మాట్లాడుతూ డిసెంబరు 18 నుంచి 23వ తేదీ వరకు ప్రయోగాత్మకంగా ఆరు రోజుల పాటు కేటాయించిన సమయ నిర్దేశిత సర్వదర్శనం టోకెన్లకు భక్తుల నుంచి విశేష స్పందన లభించినట్టు తెలిపారు. భక్తులకు ఫీడ్‌బ్యాక్‌ పత్రాలను అందించి అభిప్రాయసేకరణ జరిపినట్టు వివరించారు. సోమవారం నుంచి శుక్రవారం వరకు ఐదు రోజుల్లో 60 వేల మంది, శనివారం మధ్యాహ్నం వరకు 18 వేల మంది భక్తులు ఈ విధానం ద్వారా నిర్ణీత సమయంలో స్వామివారి దర్శనం చేసుకున్నారని చెప్పారు. కాలినడక భక్తులకు నిర్దేశించిన 20 వేల టోకెన్లు పూర్తయ్యాక, సమయ నిర్దేశిత సర్వదర్శనం టోకెన్లు జారీ చేశామన్నారు. ఆధార్‌కార్డు లేని భక్తులను పాత విధానంలోనే వైకుంఠం క్యూకాంప్లెక్స్‌ ద్వారా అనుమతించి ఇతర భక్తులతో కలిపి స్వామివారి దర్శనం చేయించామన్నారు.

ప్రస్తుత విధానంలో ఒక్కో భక్తుడికి టోకెన్‌ ఇచ్చేందుకు 33 సెకన్ల సమయం పడుతోందని, యుఐడి అధికారులతో చర్చించి ఈ సమయాన్ని మరింత తగ్గించడం ద్వారా ఎక్కువ మంది భక్తులకు టోకెన్లు మంజూరుచేసేలా చర్యలు తీసుకుంటామని ఈవో తెలిపారు. మార్చి నెల నుంచి శాశ్వతంగా ఈ విధానాన్ని అమలుచేస్తామని, తిరుపతిలోనూ కౌంటర్లు ఏర్పాటుచేస్తామని తెలియజేశారు. తిరుపతిలో టోకెన్లు పొందిన భక్తులు నిర్ణీత సమయం వరకు స్థానికాలయాలను సందర్శించేందుకు వీలుంటుందని, ఎక్కడెక్కడ కౌంటర్లు ఏర్పాటుచేయాలన్న విషయమై అధ్యయనం జరుగుతోందని అన్నారు.

ఈవో వెంట టిటిడి ఎస్‌ఇ-2 శ్రీ రామచంద్రారెడ్డి, ఐటి విభాగాధిపతి శ్రీ శేషారెడ్డి, విజివో శ్రీ రవీంద్రారెడ్డి ఇతర అధికారులు ఉన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.