TULASI DHATRI SAHITA DAMODARA PUJA HELD _ వ‌సంత మండ‌పంలో ఆగ‌మోక్తంగా శ్రీ తులసి ధాత్రి స‌హిత దామోద‌ర పూజ‌

TIRUPATI, 16 NOVEMBER 2021: On the auspicious day of Uttana Dwadasi, as part of ongoing Vishnupujanam at Vasantha Mandapam at Tirumala, Tulasi Dhatri sahita Damodara puja held on Tuesday.

On one side Sridevi Bhudevi sameta Sri Malayappa were seated. Facing them, replicas of Lakshmi, Narayana were placed along with Tulasi and Amla trees.

Later Karthika Vishnupuja Sankalpam, Sri Krishna Astottara Satanamavaili were recited and Mangala Harati was rendered.

This fete was telecasted live on SVBC between 3:15pm to 4:30pm.

Chief Priest Sri Krishna Seshachala Deekshitulu, temple OSD P Seshadri were also present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

వ‌సంత మండ‌పంలో ఆగ‌మోక్తంగా శ్రీ తులసి ధాత్రి స‌హిత దామోద‌ర పూజ‌
 
తిరుమల‌, 2021 నవంబరు 16: కార్తీక మాసంలో టిటిడి త‌లపెట్టిన విష్ణుపూజల్లో భాగంగా క్షీరాబ్ది ద్వాద‌శిని పుర‌స్క‌రించుకుని మంగ‌ళ‌వారం తిరుమ‌ల వ‌సంత మండ‌పంలో శ్రీ తులసి ధాత్రి స‌హిత దామోద‌ర పూజ‌ ఘనంగా జరిగింది. మ‌ధ్యాహ్నం 3.15 గంట‌ల‌ నుండి 4.30 గంట‌ల వ‌ర‌కు జ‌రిగిన ఈ పూజా కార్య‌క్ర‌మాన్ని శ్రీ వేంక‌టేశ్వ‌ర భ‌క్తి ఛాన‌ల్ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేసింది.
 
ముందుగా శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామివారిని వ‌సంత మండ‌పానికి వేంచేపు చేశారు. ఎదురుగా ల‌క్ష్మీ, నారాయ‌ణుల ప్ర‌తిమ‌ల‌ను, తుల‌సి, ఉసిరి వృక్షాల‌ను కొలువుదీర్చారు. ఈ సంద‌ర్భంగా వైఖానస ఆగ‌మ స‌ల‌హాదారులు శ్రీ మోహ‌న రంగాచార్యులు మాట్లాడుతూ శ్రీ తుల‌సీ ధాత్రి స‌హిత దామోద‌ర పూజ విశిష్ట‌త‌ను తెలియ‌జేశారు. కార్తీక మాసంలో ఈ పూజ చేయ‌డం వ‌ల్ల పితృదేవ‌త‌లు విష్ణుసాన్నిధ్యాన్ని చేరుతార‌ని, కోటి జ‌న్మ‌ల పుణ్య‌ల ల‌భిస్తుంద‌ని చెప్పారు. తుల‌సిని పూజిస్తే గ్ర‌హ‌బాధ‌లు తొల‌గుతాయ‌ని, స‌క‌ల ఐశ్వ‌ర్యాలు చేకూరుతాయ‌ని వివ‌రించారు.
 
అనంత‌రం కార్తీక విష్ణుపూజా సంక‌ల్పం, బ్ర‌హ్మాది దేవ‌త‌ల‌కు ఆరాధ‌న చేశారు. ఈ సంద‌ర్భంగా పండితులు కృష్ణ అష్టోత్త‌ర శ‌త‌నామావ‌ళిని పారాయ‌ణం చేశారు. నివేద‌న‌, క్షమా ప్రార్థ‌న‌, మంగ‌ళంతో ఈ పూజ ముగిసింది.
 
ఈ కార్య‌క్ర‌మంలో శ్రీ‌వారి ఆల‌య ప్ర‌ధానార్చ‌కులు శ్రీ కృష్ణ‌శేషాచ‌ల దీక్షితులు, ఓఎస్‌డి శ్రీ పాల శేషాద్రి త‌దిత‌రులు పాల్గొన్నారు.
 
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.