TULASI VISHNU SAMARADHANAM HELD _ వసంత మండపంలో శ్రీ తులసీ విష్ణు సమారాధనం
Tirumala, 12 Dec. 20: As part of Karthika Masa Deeksha, Tulasi Vishnu Samaradhanam held at Vasantha Mandapam in Tirumala on Saturday.
The significance of this puja is that Tulasi is revered as symbol of sanctity and considered auspicious for women especially married women. It’s also worshipped as Bhooloka Kalpavriksha since it fulfils the desires of devotees.
National Sanskrit Varsity VC Sri Muralidhara Sharma was also present.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
వసంత మండపంలో శ్రీ తులసీ విష్ణు సమారాధనం
తిరుమల, 2020 డిసెంబరు 12: కార్తీక మాసంలో టిటిడి తలపెట్టిన విష్ణుపూజల్లో భాగంగా శనివారం తిరుమల వసంత మండపంలో శ్రీ తులసీ విష్ణు సమారాధనం ఘనంగా జరిగింది. ఉదయం 8.30 నుండి 9.30 గంటల వరకు జరిగిన ఈ పూజా కార్యక్రమాన్ని శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేసింది.
ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు, శ్రీ తులసీ వృక్షాన్నివసంత మండపానికి వేంచేపు చేశారు. ఈ సందర్భంగా వైఖానస ఆగమ సలహాదారులు శ్రీ మోహన రంగాచార్యులు మాట్లాడుతూ తులసీ అంటే శ్రీ మహాలక్ష్మీ రూపమని, తులసీలో సమస్త దేవతలు ఉంటారన్నారు. ప్రతి రోజు ఉదయం, సాయంత్రం తులసీకి భక్తి పూర్వకంగా దీపారాధనతో ప్రార్థించడం వలన జన్మ జన్మల జన్మ జన్మల పాపం నశిస్తుందని, ఆ ఇంట లక్ష్మీదేవి స్థిర నివాసమై ఉంటుందని తెలిపారు. ఎక్కడ లక్ష్మీ ఉంటుందో అక్కడ శ్రీ మహవిష్ణువు కొలువై ఉంటారు కావున ఆ ఇంటి వైపు ఎలాంటి దుష్ట శక్తులు రావని తెలియజేశారు. భూలోక కల్పవృక్షమైన తులసీని విష్ణువుతో కలిసి పూజ చేయడం వలన స్త్రీకి పుత్రపౌత్రాబివృద్ధి కలిగి, దీర్ఘ సుమంగళి యోగం, సమస్త వ్యాధులు నయమవుతాయని తెలిపారు. పవిత్ర కార్తీక మాసంలో తులసీతో కూడిన శ్రీ మహవిష్ణువును పూజించడం వలన సంవత్సరం అంతా పూజ చేసిన ఫలం, సమస్త నదులలో స్నానం చేసిన ఫలితం సిద్ధిస్తుందని వివరించారు.
ముందుగా ఘంటా నాదంతో సకల దేవతలను ఆహ్వానించి, కార్తీక విష్ణుపూజా సంకల్పం చేసి, అష్టదిక్పాలకులు, నవగ్రహాల అనుగ్రహంతో లోక క్షేమం కొరకు ప్రార్థన చేశారు. ఆ తరువాత తులసీ విష్ణు పూజ, నివేదన, హారతి సమర్పించారు. అనంతరం క్షమా ప్రార్థన, మంగళంతో ఈ పూజ ముగిసింది.
ఈ కార్యక్రమంలో రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం ఉపకులపతి ఆచార్య మురళిధర్ శర్మ, శ్రీవారి ఆలయ పేష్కార్ శ్రీ జగన్మోహనాచార్యులు, అర్చకులు, అధికారులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.