TUMBURU TEERTHA MUKKOTI ON MARCH 31_ మార్చి 31న తిరుమలలో తుంబురుతీర్థ ముక్కోటి
Tirumala, 17 March 2018: Tumburu Teertha Mukkoti will be observed with religious fervour on March 31in Tirumala.
Tumburu teertham is located about16km from Tirumala temple in the deep forests of Seshachala Ranges.
As per the temple legend there are over 3.50 crore teerthas located in Tirumala ranges and among them seven are said to be most auspicious which includes, Swamy Pushkarini, Tumburu, RamaKrishna, Gogarbha, Akasa Ganga, Papavinasanam and Pandava teertham.
Devotees strongly believe that a holy dip in these sacred teerthas during their specified auspicious hour in a year, will wash away all the sins and physical impurities and make them free from re-births.
So tens of thousands of devotees hailing from other states take part in these torrential water festivals every year in Tirumala.
On the auspicious full moon day with in incidence of Uttara Phalguni star, Tumburuteertha mukkoti is observed every year in Tirumala.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI
మార్చి 31న తిరుమలలో తుంబురుతీర్థ ముక్కోటి
మార్చి 17, తిరుమల 2018: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయానికి ఏడున్నర మైళ్ళ దూరములో వెలసివున్న ప్రముఖ పుణ్యతీర్థమగు శ్రీ తుంబురు తీర్థ ముక్కోటి ఉత్సవం ఈ నెల 31వ తారీఖున అత్యంత వైభవంగా తిరుమలలో జరుగనుంది.
పురాణప్రాశస్త్యం ప్రకారం తిరుమలలోని శేషగిరులలో 3 కోట్ల 50 లక్షల పుణ్యతీర్థాలు ఉన్నవని ప్రతీతి. ఈ తీర్థాలలో ధర్మ, జ్ఞాన, భక్తి, వైరాగ్య, ముక్తి ప్రదములు కలిగించేవి, ప్రధానమైనవి 7 తీర్థములు. అవి స్వామివారి పుష్కరిణి, కుమారధార, తుంబురు, రామకృష్ణ, ఆకాశగంగ, పాపవినాశనం మరియు పాండవ తీర్థములు. ఈ తీర్థాలలో ఆయా పుణ్యఘడియల్లో స్నానమాచరించిన యెడల సర్వపాపాలు తొలగి ముక్తి సమకూరునని పురాణ వైశిష్ట్యం.
పాల్గుణమాసమున ఉత్తరఫల్గుణీ నక్షత్రముతో కూడిన పౌర్ణమినాడు తుంబురు తీర్థ ముక్కోటి నిర్వహించడం ఆనవాయితీ. ఈ పర్వదినాన తీర్థస్నానమాచరించి, దానధర్మాలు చేసి స్వామివారిని భక్తులు దర్శించుకుంటారు. ప్రకృతి సౌందర్యాల నడుమ నిర్వహించే తుంబురు తీర్థ ముక్కోటిని దర్శించి, స్నానమాచరించడం ఒక ప్రత్యేక అనుభూతిగా భావిస్తారు. ఈ ముక్కోటిలో టిటిడి అధికారులు, అర్చకులు, పెద్ద సంఖ్యలో పాల్గొంటారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.