TWO PAEDIATRIC DOCTORS ON CONTRACT BASIS FOR SPCHC _ ఫిబ్రవరి 7న డ్యూటీ మెడిక‌ల్ ఆఫీస‌ర్ పోస్టులకు వాక్‌-ఇన్‌-ఇంటర్వ్యూ

TIRUPATI, 30 JANUARY 2023: TTD is set to recruit two Duty Medical Officers-DMOs(01-OC and 01-SC) on a contract basis for a period of one year on payment of Rs. 60,000 for Sri Padmavathi Children’s Heart Centre in Tirupati.

The eligibility criteria is they must have passed the MBBS degree of a University Recognized by UGC, must be a registered Medical Practitioner within the meaning of Law for rime being existing in the state, Preference will be given to those who possess PG Qualification in MD (Pediatrics).

The Director, SPCHC is permitted to select the doctors through walk-in interview on February 7 at 10am. The candidates who are willing should attend the interview with original certificates, Xerox copies and experience details.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

ఫిబ్రవరి 7న డ్యూటీ మెడిక‌ల్ ఆఫీస‌ర్ పోస్టులకు వాక్‌-ఇన్‌-ఇంటర్వ్యూ

తిరుప‌తి, 2023 జనవరి 30: టీటీడీ ఆధ్వ‌ర్యంలోని శ్రీ ప‌ద్మావ‌తి హృదయాలయం ( చిన్న‌పిల్ల‌ల గుండె చికిత్సల ) ఆసుప‌త్రిలో కాంట్రాక్టు ప్రాతిపదికన డ్యూటీ మెడిక‌ల్ ఆఫీస‌ర్‌ (OC- 01, SC -01 ) సేవలందించేందుకు ఎంబిబిఎస్‌ విద్యార్హత గల అభ్యర్థులకు ఫిబ్రవరి 7వ తేదీన వాక్‌-ఇన్‌-ఇంటర్వ్యూ నిర్వహించనున్నారు.

తిరుపతిలోని బ‌ర్డ్ ఆసుప‌త్రి ప్రాంగ‌ణంలో గ‌ల‌ శ్రీ ప‌ద్మావ‌తి చిన్న‌పిల్ల‌ల హృద‌యాల‌యంలో ఉద‌యం 10 గంట‌ల‌కు వాక్‌-ఇన్‌-ఇంటర్వ్యూ జ‌రుగ‌నుంది. ఆసక్తి గల అభ్యర్థులు త‌మ విద్యార్హతలు, అనుభ‌వానికి సంబంధించిన ధ్రువ‌ప‌త్రాల‌ ఒరిజినల్ , జిరాక్స్ ‌ కాపీలతో ఇంట‌ర్వ్యూకు హాజరు కావాల్సి ఉంటుంది.

ఇతర వివరాలకు www.tirumala.org వెబ్‌సైట్‌ను సంప్రదించగలరు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.